Switch to English

ఎడారిలో ఇరుక్కుపోయి.. కారునే బైక్ గా చేసి..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడిపోవడం కాదు.. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించడమే వివేకవంతుల లక్షణం. మొరాకోకు చెందిన ఎమిలీ లెరే అలాంటి ధైర్యవంతుడే. తనకు ఎదురైన ఓ సమస్య నుంచి అతడు చాకచక్యంగా బయటపడటమే ఇందుకు నిదర్శనం. 27 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన గురించి ఓ ఆంగ్ల వెబ్ సైడ్ కథనం ప్రచురించడంతో మనోడి సత్తా ఏంటో తెలుసుకుని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఎమిలీకి టూర్లంటే ఇష్టం. ఎప్పుడూ తన కారు వేసుకుని దూరప్రాంతాలకు షికార్లు చేస్తుంటాడు. అలాగే 1993లో ఓసారి మొరాకోలోని ఎడారి ప్రాంతానికి షికారెళ్లాడు. ఎడారిలో కొంత దూరం వెళ్లిన తర్వాత వెళ్లాల్సిన మార్గంలో కాకుండా రాళ్లు ఎక్కువగా ఉన్న మార్గాన్ని ఎంచుకుని ముందుకెళ్లాడు. అయితే, ఆ మార్గం ప్రమాదకరంగా ఉండటంతో అతడి కారు ప్రమాదానికి గురై ఆగిపోయింది. కారు యాక్సిల్ విరిగిపోవడంతో ముందుకెళ్లే పరిస్థితి లేదు. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఏం చేయాలో తోచలేదు. ముందుకెళ్లాలన్నా.. వెనక్కి వెళ్లాలన్నా చాలా మైళ్లు ప్రయాణించక తప్పదు. అలాంటి ప్రదేశంలో ఎమిలీ ఇరుక్కుపోయాడు.

ఏం చేయాలా అని ఆలోచించిన అతడికి తన కారునే బైక్ గా మారిస్తే సరిపోతుంది కదా అని ఆలోచన వచ్చింది. ఐడియా అయితే వచ్చింది కానీ అందుకు తగ్గ పరికరాలు ఏమీ లేవు. స్వతహాగా కారు మెకానిక్ కావడంతో ఓ సారి ట్రైచేసి చూద్దామని భావించాడు. కారులో ఉన్న టూల్ కిట్ తోనే పని ప్రారంభించాడు. ముందుగా కేవలం చేతులు ఉపయోగించే కారును ఊడబీకడం ప్రారంభించాడు. అందుకు అతడికి నాలుగు రోజుల సమయం పట్టింది. దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారం, నీళ్లను పొదుపుగా వాడుకుంటూ పనిలో పడిపోయాడు. బైక్ తయారీకి కావాల్సిన విడిభాగాలన్నీ సమకూర్చుకున్నాడు. అయితే వాటిని అసెంబ్లింగ్ చేయాలంటే వెల్డింగ్ మెషీన్ కావాలి. మరి ఎలా? దానికీ ఓ ఉపాయం ఆలోచించాడు.. కారులో ఉన్న వైర్లతో ఒక్కో భాగాన్నీ కట్టడం ప్రారంభించాడు. అలా 12 రోజులు 11 రాత్రులు కష్టపడి బైక్ కు ఓ రూపం తెచ్చాడు.

ఇంధన ట్యాంకును అమర్చి, తన తెలివితేటలతో స్టార్ట్ చేయడంతో విజయం సాధించాడు. అంతే.. అప్పటివరకు ఉన్న కష్టమంతా మాయమైపోయింది. ఎంచక్కా ఆ బైక్ వేసుకుని బతుకుజీవుడా అంటూ ఇంటికి పయనమయ్యాడు. అయితే, హైవే పైకి రాగానే మనోడి వాలకం, బండి చూసిన పోలీసులకు అనుమానం కలిగింది. ఇదేం బండి? పత్రాలు చూపించమని అడిగారు. దీంతో కారు పత్రాలు చూపించాడు. కారు పేపర్లు చూపించి బండి పేపర్లు అంటావ్.. తిక్కతిక్కగా ఉందా? ఫైన్ కట్టు అనేసరికి.. వారు వేసిన జరిమానా చెల్లించి బయటపడ్డాడు.

అప్పట్లో మీడియా ఇంత విస్తృతంగా లేకపోవడంతో ఎమిలీ విషయం అంతగా బయటకు రాలేదు. ఇటీవల అతడిపై ఓ వెబ్ సైట్ లో వార్త రావడంతో పాపులర్ అయ్యాడు. ఎమిలీ ఇంటికి వెళ్లి చూస్తే చిత్ర విచిత్రమైన వాహనాలు చాలా కనిపిస్తాయి. చివరకు అతడు ఉపయోగించు కళ్లజోడు కూడా చిత్రంగా ఉంటుంది. ఇప్పటికే చాలా వాహనాలను చిత్ర విచిత్రంగా మార్చేసిన ఎమిలీకి ఒక్క కల అలాగే మిగిలిపోయిందట. అదే.. ఏదైనా విమానం దొరికితే దానిని కూడా మార్చేయ్యాలి అంటున్నాడు. వామ్మో.. వీడు మామూలోడు కాదుగా!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...