Switch to English

ఫైర్.. ఫీజ్.! కోవిడ్‌ సెంటర్‌ వర్సెస్‌ క్వారంటైన్‌ సెంటర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘ఫైర్ ప్లస్‌ ఫీజ్ ఈజ్‌ ఈక్వల్‌ టు ఫూల్సూ..’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా హీరో రామ్ వేసిన ట్వీట్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే. స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటన, తదనంతర పరిణామాలపై రామ్ ఈ ట్వీట్‌ వేశారు. ఇలా రామ్ ఈ ట్వీట్‌ వేయడానికి బలమైన కారణం వుంది. అదే రామ్ బంధువుకి చెందిన రమేష్‌ హాస్పిటల్‌ ఈ స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ని నిర్వహిస్తుండడం.

అయితే, అంతకు ముందే ప్రభుత్వం ఈ స్వర్ణ ప్యాలెస్‌ని క్వారంటైన్‌ సెంటర్‌గా ఉపయోగించింది. అప్పుడు గనుక అగ్ని ప్రమాదం జరిగి వుంటే ఎవర్ని బాధ్యులుగా చేసేవారు.? ఎవరిపై చర్యలు తీసుకునేవారు.? అన్నది రామ్ ప్రశ్న. ఈ వ్యవహారంపై పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ, ‘రామ్ ఎవరో తెలియదు.. అయినా, క్వారంటైన్‌ సెంటర్‌ వేరు.. కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ వేరు..’ అంటూ వివరణ ఇచ్చారు. ఏ ‘సెంటర్‌’ అయినా, అక్కడ జరిగింది ఘోర ప్రమాదం. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలకు విరుద్ధంగా స్వర్ణ ప్యాలెస్‌ వుంటే, అక్కడ భద్రతా పరమైన లోపాలు వుంటే, ప్రభుత్వం సైతం దాన్ని క్వారంటైన్‌ సెంటర్‌గా ఉపయోగించడానికి వీల్లేదు.

ఒకవేళ క్వారంటైన్‌ సెంటర్‌గా ఉపయోగిస్తున్నప్పుడే అగ్ని ప్రమాదం జరిగి వుంటే.. దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి కదా.. అన్న రామ్ ప్రశ్నలో లాజిక్‌ వుందనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. అయితే, కోవిడ్‌ చికిత్స పేరుతో రమేష్‌ హాస్పిటల్‌ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతోందనీ, పరిమితికి మించి స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్‌ రోగులకు వైద్య చికిత్స అందిస్తున్నారనీ.. భయపెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారనీ.. ఇలా చాలా ఆరోపణలున్నాయి. దాంతో, అన్ని విషయాలపైనా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

బాధితులు వెల్లడిస్తున్న విషయాలతో ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నదీ బయటకొచ్చే అవకాశముంది. ఏదిఏమైనా, 10 మందిని ఓ నిర్లక్ష్యం బలిగొన్నదంటే.. అది క్షమించరాని నేరమే అవుతుంది. ‘విచారణకు ఆటంకం కలిగిస్తే రామ్ కూడా నోటీసులు అందుకోవాల్సి వుంటుంది’ అని పోలీసు అధికారులు హెచ్చరించడం గమనార్హం. కొసమెరుపేంటంటే, ఇకపై ఈ వివాదం గురించి స్పందించబోనని, నేరం చేసిన వారికి శిక్ష పడుతుందని నమ్ముతున్నానని రామ్ ట్వీటేయడం. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలోనే రామ్ సైలెంటయ్యాడనుకోవాలా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...