Switch to English

పక్కా లోకల్‌: వైఎస్‌ జగన్‌కి కేసీఆర్‌ ఝలక్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

‘ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులకే పరిశ్రమల్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువగా వుండాలి..’ అంటూ కొద్ది నెలల క్రితం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే, ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘ఇదే నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే, ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పరిస్థితేంటి.?’ అన్న వాదన విపక్షాల నుంచి గట్టిగా విన్పించింది. అయినాగానీ, జగన్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

ఇక, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని ‘ఫాలో’ అవుతున్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ‘పక్కా లోకల్‌’ నినాదాన్ని అందుకున్నారు. దాంతో ఒక్కసారిగా ‘నాన్‌ లోకల్‌’ గుండెల్లో దడ షురూ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ‘పక్కా లోకల్‌’ డిమాండ్‌ మార్మోగిపోతోంది. గల్ప్‌ దేశాలు కావొచ్చు, అగ్ర రాజ్యం అమెరికా కావొచ్చు.. ‘పక్కా లోకల్‌’ అనే నినాదాన్నే విన్పిస్తున్న విషయం విదితమే. ఈ తరుణంలో ఉపాధి కోసం, ఉద్యోగావకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటోన్న చాలామందిలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.

గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మళ్ళీ ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం చాలా చాలా పెద్దదైపోయిందేమో.! కరోనా సంగతి పక్కన పెడితే, పాలకులు జపిస్తోన్న ‘పక్కా లోకల్‌’ నినాదం, సామాన్యులకు ఇబ్బందికరంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా రాష్ట్రాల సంగతెలా వున్నా, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారుతోంది.

ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదు.. దాంతో, ఉపాధి కనాకష్టంగా మారిపోతోంది. పొరుగు రాష్ట్రాలు ఒకటొకటిగా ‘పక్కా లోకల్‌’ నినాదం అందుకుంటోంటే, తమ భవిష్యత్తు ఏంటి.? అని ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో వలస కార్మికులు. కేవలం వలస కార్మికులే కాదు, ఇతర రాష్ట్రాల్లో చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నవారూ ఇప్పుడు లబోదిబోమనాల్సి వస్తోంది. అయితే, ఈ ‘పక్కా లోకల్‌’ ఏయే విభాగాల్లో అమలవుతుంది.? అది ఏయే రాష్ట్రాలపై ఎంతెంత ప్రభావం చూపుతుంది.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలూ లేకపోలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...