Switch to English

జగన్‌ని ‘కవర్‌’ చేయలేక.. ‘పవన్‌’పై అక్కసు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ కన్‌ఫ్యూజన్‌లో వుంటాడు.. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు.. పవన్‌ కళ్యాణ్‌ని పట్టించుకోవడం అనవసరం..’ ఇదీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఉవాచ. ‘అమరావతి రగడ – మూడు రాజధానుల వివాదం’పై రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొన్న విషయం విదితమే. ఈ గందరగోళానికి అధికార వైఎస్సార్సీపీనే కారణం. ఎన్నికల ముందర ఓ మాట.. ఎన్నికలయ్యాక ఇంకో మాట.! రాజకీయాల్లో మాట మార్చడం మామూలేగానీ.. అధికారంలో వున్నోళ్ళు, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కడమంటే.. జనాన్ని మోసం చేయడమే కదా.!

ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తావించారు.. వైఎస్సార్సీపీ అమరావతి విషయంలో వ్యవహరిస్తున్న తీరుని తప్పుపట్టారు. అంతే, వైసీపీ నేత, మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌కి ఒళ్ళు మండిపోయింది. ‘వైఎస్‌ జగన్‌ అప్పుడు అలా అనలేదు.. అమరావతికి మేమెప్పుడూ మద్దతివ్వలేదు.. మూడు రాజధానుల గురించి ముందే చెప్పాలం..’ అని చెప్పగలిగే ధైర్యం అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సహా వైసీపీ నేతలెవరికైనా వుందా.? ఛాన్సే లేదు.

‘కృష్ణా – గుంటూరు జిల్లాల నడుమ 30 వేల ఎకరాల భూమి రాజధానికి అవసరం..’ అని ఇదే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో నినదించారు. కానీ, ఇప్పుడేమో.. ఆ అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని విశాఖకు తరలిస్తారట.. జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ని కర్నూలుకి తరలిస్తారట. ‘మీరు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళుతున్నారు.. మూడు రాజధానులకు ప్రజామద్దతు వుందని భావిస్తే.. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి..’ అని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు. చేతనైతే తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తామంటూ ‘బస్తీ మే సవాల్‌’ అనాలిగానీ.. పవన్‌ కళ్యాణ్‌ మీద అక్కసు ఏంటట.?

అమరావతి విషయంలో టీడీపీ, వైసీపీ.. ప్రజల్ని మభ్యపెట్టాయి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ‘అమరావతి రైతులకు న్యాయం చేయాలి..’ అని పవన్‌ నినదించడం అనిల్‌ కుమార్‌ యాదవ్‌కి పెద్ద ‘నేరం’లా కన్పిస్తోందంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ అమరావతి గురించి ఏం చెప్పారో.. వైసీపీ ముఖ్య నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహా పలువురు వైసీపీ నేతలు.. అమరావతి గురించి గతంలో ఏం మాట్లాడారో ఒక్కసారి పాత వీడియోల్ని రిఫర్‌ చేసుకుని.. ఆ తర్వాత పవన్‌ని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విమర్శిస్తే బావుంటుందేమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...