Switch to English

శాసన రాజధాని అమరావతి ‘స్థాయి’ ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం, అమరావతి నుంచి జ్యుడీషియరీ, ఎగ్జిక్యూటివ్‌ వ్యవహారాల్ని అటు కర్నూలుకి, ఇటు విశాఖపట్నంకీ తరలిస్తున్న దరిమిలా, ఇకపై అమరావతి కేవలం శాసన కార్యకలాపాలకే పరిమితం కానుంది. పైగా, ఓ సెషన్‌ శాసన వ్యవహారాల్ని విశాఖలోనూ, ఇంకో సెషన్‌ని కర్నూలులోనూ నిర్వహించాలన్న ఆలోచన కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి వుంది.. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఆయా ప్రాంతాల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి. అదే నిజమైతే, అమరావతి పరిస్థితేంటి.? అమరావతి ‘స్థాయి’ ఎలా వుండబోతోంది.?

ఒకే ఒక్క సెషన్‌ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరిగితే, అమరావతిలో కొత్తగా నిర్మితమయ్యే అధికారిక భవనాలు ఏమైనా వుంటాయా.? వుండవా.? మరి, ఇప్పటికే పూర్తిగా నిర్మితమైన.. కొంత మేర నిర్మితమైన, నిర్మాణం కావాల్సిన భవనాల పరిస్థితేంటి.? అసలు అమరావతి అభివృద్ధి అనేది 2019 ఎన్నికలకు ముందు ఎలా వుందో, అంతకన్నా దయనీయంగా మారిపోబోతోందా.? ఇలా సవాలక్ష ప్రశ్నలు.

తాజగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాజధాని విషయమై నాలుగు రహస్య జీవోల్ని జారీ చేసిందనే ప్రచారం జరుగుతోంది. అవేంటి.? అన్నదానిపై అమరావతి ప్రాంత రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు కూడా తాజా పరిణామాలపై కలత చెందుతున్నారు. అధికార పార్టీ నేతల్లోనూ స్పష్టత లేని పరిస్థితి. కాగా, అమరావతిని రాజధానిగా ప్రకటించాక అప్పటి ప్రభుత్వం, రైతులతో పలు ఒప్పందాలు చేసుకుంది. భూ సమీకరణ విషయమై జరిగిన ఒప్పందాలివి. ఆ ఒప్పందాల ప్రకారం అభివృద్ధి జరగకపోతే మాత్రం, రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి వుంటుందట. ఆ నష్ట పరిహారం ఏకంగా లక్ష కోట్లదాకా వుండొచ్చన్నది ఓ అంచనా.

నిజమే మరి.. ఎంచక్కా పంటలు పండించుకుంటున్న రైతులు, ప్రభుత్వానికి తమ భూముల్ని ఇచ్చారంటే అది ఆషామాషీ వ్యవహారమా.? ‘మీ భూములు మాకొద్దు..’ అని ప్రభుత్వం ఇప్పుడు చెబితే కుదరదు. ఆ భూములు ఇప్పుడెందుకూ పనికిరావు. గతంలో అమరావతి రైతులకు సంబంధించి కేంద్రం కూడా కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. అంటే, కేంద్రం ప్రమేయం అమరావతి విషయంలో వున్నట్లే. ఇలా ఎలా చూసుకున్నా.. అంతా సంక్లిష్టమైన ప్రక్రియే. సీఆర్డీయే స్థానంలో అమరావతి మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ రాబోతోంది. దాంతో, సీఆర్డీయేతో రైతులు చేసుకున్న ఒప్పందాలు అమరావతి మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీకి బదిలీ అవుతాయి. అయితే, సీఆర్డీయే పరిధి ఎంత.? అమరావతి పరిధి ఎంత.? అన్నదానిపై ఇంకా కొంత గందరగోళం నెలకొన్న మాట వాస్తవం. మొత్తంగా చూస్తే, సమీప భవిష్యత్తులో అమరావతి తన స్థాయిని కోల్పోతుందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయన్నది నిర్వివాదాంశం. మరి, ప్రభుత్వం ఈ విషయమై ఎలా స్పందిస్తుందో ఏమో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...