Switch to English

వైఎస్‌ జగన్‌ క్షమాపణ చెప్పాలంటున్న వైసీపీ ఎంపీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘ఇందులో బేషజాలకు పోవాల్సిన అవసరమేముంది.? తప్పులు ఎవరైనా చేస్తారు.. ఆ తప్పుని సరిదిద్దుకోవడం ముఖ్యం. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 8 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితిని ముందే ఊహించి, రాష్ట్ర ప్రజల్ని కాపాడిన గొప్ప వ్యక్తి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆయన ఆ రోజు పరిస్థితుల్ని అంచనా వేసి కరోనా ప్రబలకుండా స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. లేకపోతే, పరిస్థితి ఇంకెంత ప్రమాదకరంగా వుండేదో.! ఆయనకు క్షమాపణ చెప్పి, తిరిగి ఆయన్ని ఆయన పదవిలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి తన హుందాతనాన్ని కాపాడుకోవాలి..’ ఇదీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యల సారాంశం.

‘రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందు మరో ఆప్షన్‌ లేదు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఆదేశాలివ్వడం మంచిది..’ అంటూ ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ అభిప్రాయపడ్డారు. నిమ్మగడ్డ విషయమై ఈ రోజు సుప్రీంకోర్టులో మరోమారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురయిన నేపథ్యంలో అటు రఘురామకృష్ణరాజు, ఇటు జంధ్యాల రవిశంకర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనంగా మారాయి.

మరోపక్క, తనపై అనర్హత వేటు వేయించాలన్న అత్యుత్సాహంతో ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి, ఎంపీల్ని ఢిల్లీకి పంపించడం హాస్యాస్పదమని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ‘నేను పార్టీని పల్లెత్తు మాట కూడా అనలేదు..’ అంటూ ఇంకోసారి తనదైన స్టయిల్లో రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం గమనార్హం. గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం, ఈ క్రమంలో ఆయనకు షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయడమే కాదు, ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కి వైసీపీ ఫిర్యాదు కూడా చేసింది. అయితే, రఘురామకృష్ణరాజు మాత్రం ‘డోన్ట్‌ కేర్‌’ అనేస్తున్నారు.

కాగా, ‘కోర్టుల తీర్పుల్ని లెక్కచేయం.. అని ఇదివరకటిలా అంటే కుదరదు.. ఇకపై పరిస్థితులు ఇంకోలా వుంటాయ్‌..’ అని హెచ్చరించారు రఘురామకృష్ణరాజు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...