Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: భూముల్ని అమ్మేసే హక్కు ప్రభుత్వాలకి వుంటుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రాజ్యం వేరు.. ప్రభుత్వం వేరు.. ప్రభుత్వం దివాళా తీసిందా.? భూముల్ని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది.? అంటూ న్యాయస్థానం ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు సంధించింది. అయితే, ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాల విషయంలో సంయమనం అవసరమంటూ ప్రభుత్వం, న్యాయస్థానానికి నివేదించాల్సా వచ్చిందట. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఆదాయం నిమిత్తం భూముల్ని వేలం వేయాలన్న ఆలోచన నేపథ్యంలో నమోదైన కేసుకి సంబంధించిన విచారణ సందర్భంగా జరిగిందట.

దేశంలో చాలా రాష్ట్రాలూ భూముల్ని వేలం వేస్తున్న మాట వాస్తవం. ఇందులో వింతేమీ లేదు. అలాగని, అది పూర్తిగా కరెక్ట్‌.. అని ఎవరన్నా అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుండదు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున భూముల్ని సేకరించేందుకు, సమీకరించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఎదురైన ఇబ్బందుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వున్న భూముల్ని అమ్మేసుకుంటే, కొత్తగా భూములు ఎలా వస్తాయి.? పైగా, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి.. భూముల్ని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

నిజమే, ఈ ప్రభుత్వం భూముల్ని అమ్మేస్తే, వచ్చే ప్రభుత్వం మిగిలిన భూముల్ని అమ్మేయకుండా వుంటుందా.? చివరికి ఈ అమ్మకాలు.. ఏ స్థాయికి వెళతాయంటే, ప్రభుత్వ కార్యాలయాల్ని విక్రయించేదాకా వెళ్ళొచ్చన్న అభిప్రాయం ప్రజాస్వామ్యవాదుల నుంచి వ్యక్తమవుతోంది. అయినా, దేవుడి భూముల్ని అమ్మేయడానికీ వెనుకాడని ప్రభుత్వాలకి.. ఇలాంటి భూములు అమ్మేయడం ఓ లెక్కా.? పైగా, సంక్షేమ పథకాల అమలు కోసం భూముల్ని అమ్మాలనుకోవడమట. నిస్సిగ్గు రాజకీయానికి పరాకాష్ట ఇది. అభివృద్ధి కార్యక్రమాలు చేసి.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి.. ఆ తర్వాత సంక్షేమ పథకాల కోసం పంచినా అదో లెక్క.

ఆదాయం లేని పరిస్థితుల్లో భూముల్ని అమ్మి, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే.. సంక్షేమ పథకాల సంగతి దేవుడెరుగు.. ముందు ముందు పాలన నడవడానికి కూడా పైసా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అనే కాదు, ఏ రాష్ట్రమైనాసరే.. ఈ విషయంలో ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఇక్కడ విధానపరమైన నిర్ణయాల సందర్భంగా న్యాయస్థానాలు సంయమనం పాటించడం ఎంత ముఖ్యమన్న విషయాన్ని పక్కన పెడితే, ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మాయ చేయడానికి ప్రభుత్వ భూముల్ని విక్రయించాలన్న ఆలోచన చేసేముందు పాలకులు సంయమనం పాటిస్తే మంచిది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...