Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: జగన్‌ ప్రయత్నానికి అడ్డుపడుతున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

వెయ్యి కాదు, పది వేలు కాదు.. లక్ష కాదు, ఐదు లక్షలూ కాదు.. ఏకంగా 30 లక్షల ఇళ్ళ స్థలాల్ని పేదలకు ఇచ్చే బృహత్‌ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 2020 ఉగాది సందర్భంగా ఇళ్ళ పట్టాల్ని లబ్దిదారులకు ఇవ్వాలన్నది జగన్‌ ప్రభుత్వ లక్ష్యం. కానీ, కరోనా వైరస్‌ సహా అనేక అనేక కారణాలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.

నిజానికి, కరోనా వైరస్‌ కంటే.. ఇతరత్రా అంశాలే ఆ కార్యక్రమం వాయిదా పడ్డానికి కారణమయ్యాయి. అందులో ముఖ్యమైనది అవసరమైన మేర భూమిని సమీకరించకపోవడం. భూముల్ని సమీకరించే క్రమంలో చాలా వివాదాలు తెరపైకొచ్చాయి. ఈ రోజుల్లో భూమిని ఏ ఉద్దేశ్యం కోసం సేకరించాలన్నా, సమీకరించాలన్నా కష్టసాధ్యమైన పని. అది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి తెలియదని ఎలా అనుకోగలం.?

గతంలో వివిధ పథకాల కింద ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని సైతం ప్రస్తుత ప్రభుత్వం పేదల నుంచి లాగేసుకుని, సరికొత్తగా కొత్త లబ్దిదారులకు ఇవ్వాలనే ప్రయత్నం చేసిన ఘటనలూ లేకపోలేదు. ఇంకొన్ని చోట్ల ప్రైవేటు భూముల్ని తీసుకునే క్రమంలోనూ వివాదాలు తలెత్తాయి. ఇవన్నీ ముందుగానే ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందా.? మొండిగా ముందడుగు వేసిందా.? కారణం ఏదైతేనేం.. పలు దఫాలు వాయిదాపడ్డ ఈ కార్యక్రమం.. ఆగస్ట్‌ 15న ఖచ్చితంగా జరిగి తీరుతుందని అధికార పార్టీ భావిస్తోంది. అయితే, ‘ఆశిస్తున్నాం..’ అని మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పగలుగుతున్నారు. పైగా, ఆయన దేవుడి మీద భారం కూడా వేసి పడేశారు.

తాజాగా కృష్ణా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, ‘పెద్దయెత్తున పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని మేం సంకల్పించుకుంటే విపక్షాలు అడ్డుపుల్ల వేస్తున్నాయి.. కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నాయి..’ అని ఆరోపించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. కోర్టుల్లో కేసులు వేస్తే.. కార్యక్రమాలు ఆగిపోతాయా.? విషయంలో ‘స్పష్టత’ వుంటే, ఏ కోర్టు కూడా అడ్డుకునే పరిస్థితి వుండదని న్యాయ కోవిదులు ఇప్పటికే చాలా విషయాల్లో చాలాసార్లు కుండబద్దలుగొట్టేశారు.

నిజానికి, అందుబాటులో వున్న భూముల్లో పది లక్షల మందికో, పదిహేను లక్షల మందికో ఇళ్ళ స్థలాలు ఇచ్చే అవకాశం వుంది. దానికి తోడు, చంద్రబాబు హయాంలోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లు వున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే.. లబ్దిదారులకు ఇంకా ఆ ఫ్లాట్లు దక్కలేదన్నది నిర్వివాదాంశం. ఏదిఏమైనా, 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ఆలోచనని తప్పు పట్టలేం. ఈ క్రమంలో వచ్చే సమస్యల్ని ముందుగా గుర్తించలేక చతికిలపడ్డ వైనాన్ని విస్మరించలేం. నెపాన్ని విపక్షాల మీద నెట్టేయాలని చూస్తే, ప్రజలకు ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత.? అనేది అర్థమవకుండా వుంటుందా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...