Switch to English

నేను రాను సర్కారు దవాఖానాకు అంటున్న సర్కారోళ్ళు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అత్యాధునిక సదుపాయాలున్నాయి అని ఊదర గొడతారు.. ఎవ్వరూ చేయనంతగా మేమే అభివృద్ది చేశాం అని ఘనంగా చెప్పుకుంటారు ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు సూపర్ స్పెషాలిటీ స్థాయి వసతులున్నాయి అని గొప్పలు చెప్పుకుంటారు.. ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేస్తారు,అక్కడ ప్రోటోకాల్ పాటించకుంటే రంకెలేస్తారు.

మేమే చేశాం,మా వల్లే అయ్యింది అని కోట్లు ఖర్చు చేసి ప్రచారాలు చేస్కుంటారు. ఇవన్నీ చూపించి ఓట్లు అడుగుతారు, గద్దెనెక్కుతారు, పదవులు అనుభవిస్తారు. కానీ తమ దాకా వస్తే మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులకి పరుగులు పెడుతున్నారు.

ప్రజా ప్రతినిధుల నిజ స్వరూపనికి కరోనా ఒక ఉదాహరణగా నిలిచింది.వారి నైజాన్ని ప్రజల ముందు ఉంచింది.ప్రతీ రోజు ప్రకటనల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ సదుపాయాలు ఉన్నాయి అని చెబుతున్నారు,కానీ ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు మాత్రం నిర్మొహమాటంగా మేము చేరం ఈ ధర్మాసుపత్రుల్లో అని అంటున్నారు.

సామాన్యుడిదీ ప్రాణమే ఈ నేతలదీ ప్రాణమే..వీరికి అవకాశం ఉంది కాబట్టి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరారు.అంటే మరి సామాన్యుడికి గతికి లేదు కాబట్టి ధర్మాసుపత్రుల్లో చేరాలా?

తమ కరకమలములచే ఆరంభింపబడిన ఆసుపత్రుల్లో చేరడానికి వీరు ఎందుకు విముఖత చూపుతున్నారు ? ప్రభుత్వ వైధ్య విధానాల పై అనుమానమా? వైద్యులపై నమ్మకం లేదా? సదుపాయాలు చాలవా? ఇది ప్రభుత్వ వైద్యులను అవమానించడం కాదా? మాటలతో ముద్దాడుతూ నొసటితో వెక్కిరించడం కాదా ఇది ??

ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేనివి వీరు ఎన్నుకునే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎమున్నాయో సదరు నేతలు చెప్పాలి.ప్రభుత్వం ఆ సౌకర్యాలు కల్పించడం లో ఎందుకు విఫలం అయ్యిందో ప్రభుత్వం వివరించాలి,తప్పులు సవరించాలి.

కరోనా వల్ల చికెన్ తింటే వ్యాధులు ప్రబలుతాయి అనే అపోహ ప్రజల్లో ఉంటే తమ సాటి మంత్రుల,నేతల పౌల్ట్రీ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి అని,సాక్షాత్తూ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి నుండి క్యాబినెట్ మంత్రుల దాకా వేదికలెక్కి మరీ చికెన్ ఆరగించి అపోహలు పోగొట్టారు.

మరి తమ తమ నియోజికవర్గ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలపై భయాందోళనలు చెందకుండా ఉండేందుకు ఏ ఒక్కరూ,ఒక్కరంటే ఒక్కరూ కూడా గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోలేదేం ?? వ్యాపారాల కోసం ఏమైనా చేస్తారు…తమ ప్రాణాల మీదకొస్తే మాత్రం తప్పించుకుంటారు.

తెలంగాణ నాయకులు ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ నాయకుల తీరి మరీ దారుణం. లాక్ డౌన్ నిబంధనలు భేఖాతరు చేస్తూ ర్యాలీలు,జాతరలు తీశారు,అశ్రద్ద వహించి వేడుకలు చేశారు,నిర్లక్ష్యంతో సామాజిక దూరం మరిచారు.తీరా పాజిటివ్ అని తేలగానే హైదరాబాద్,చెన్నైకి పరుగు లంకించుకున్నారు.ఇక్కడ స్థానికులకే బెడ్లు దొరక్క అల్లాడుతుంటే వీరు మాత్రం మా ప్రాణ రక్షణే మాకు ముఖ్యం అన్నట్లు వ్యవహస్తున్నారు.

నలుగురికి స్ఫూర్తిగా నిలిచి ఆదర్శ ప్రాయంగా ఉండే నాయకులు ఎవరూ లేరని రోజుకొకరు రుజువు చేస్తున్నారు..పచ్చి అవకాశ వాదులు వీరంతా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...