Switch to English

ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి: చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని తమకు అనుమానంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల మొరాయింపు, అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం వంటి విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ వైఖరిని తూర్పారబట్టారు. ఏపీ చరిత్రలోనే ఇలాంటి అరాచకాలను ఎన్నడూ చూడలేదన్నారు. ఎన్నికల సంఘం పూర్తిగా ప్రధాని మోదీ చెప్పినట్టే పనిచేస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఈసీ తనకు ఇష్టం వచ్చినట్టు అధికారులను బదిలీ చేసుకుంటూ వెళ్లిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ తప్పుడు ఫిర్యాదులను ఆధారంగా తీసుకుని కనీసం విచారణ కూడా జరిపించకుండా అధికారులను బదిలీ చేశారని ధ్వజమెత్తారు.

సీఎస్ ను ఇష్టానుసారం బదిలీ చేసి, జగన్ కేసులో సహ నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఆ స్థానంలో నియమించారని, అసలు ఈ దేశం ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు. ఈవీఎంలు పనిచేయని కారణంగా ఓటర్లు ఉదయం నుంచి తిండి, నీళ్లు లేకుండా లైన్లో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. చాలాచోట్ల మధ్యాహ్నం ఒంటిగంటకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఓటర్లు వెనుతిరిగి వెళ్లిపోయారని, దాంతో తాను ఓటేయాల్సిందిగా పిలుపునిస్తే.. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటరు కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. అది వారి కమిట్ మెంట్ అని, కానీ ఈసీ మాత్రం ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమై, ప్రజల ఇబ్బందులకు కారణమైందని దుయ్యబట్టారు.

కొన్నిచోట్ల తెల్లవారేవరకు పోలింగ్ కొనసాగిందంటే ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అవసరమైన మేర పోలీసు బలగాలను కూడా పంపకపోవడంతో రౌడీలు రాజ్యమేలారన్నారు. ఎక్కడిక్కడ దాడులకు తెగబడ్డారని, ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు స్పీకర్ పై కూడా దాడి చేశారని వివరించారు. ఎన్నికల్లో హింస చెలరేగి హత్యలు జరిగినా, మహిళలపై దాడి జరిగినా ఈసీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫలితంగా రాష్ట్రం రావణకాష్టంలా మారి, ప్రజాజీవనం స్తంభించిపోయిందన్నారు. ఈవీఎంల వినియోగంపై తాము మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నామని గుర్తుచేశారు.

బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు ఉండవన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈవీఎంల విధానాలపై అందరికీ సందేహాలు ఉన్నాయని, అందువల్లే బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుతున్నట్టు చెప్పారు.

వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఆరు రోజుల సమయం పడుతుందని సుప్రీంకోర్టుకు ఈసీ తప్పుడు సమాచారం ఇచ్చిందని దుయ్యబట్టారు. బ్యాలెట్ పేపర్లు లెక్కించడానికి 16 గంటల సమయం పట్టినప్పుడు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడానికి 6 రోజుల సమయం ఎందుకు పడుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. తాను శని, ఆదివారాల్లో ఢిల్లీలోనే ఉండి పలు రాజకీయ పార్టీల అధినేతలతో సమావేశమై ఈ విషయం గురించి చర్చిస్తానని వెల్లడించారు.

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు 1లక్ష కేజీల బంగారం తరలింపు.. కారణం ఇదే

Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు దాదాపు 100టన్నలు (లక్ష కేజీలు) బంగారాన్ని తరలించింది ఆర్బీఐ (RBI). వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం.. కొన్ని నెలల కసరత్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక...

‘మా’ మంచు విష్ణు, హేమ గురించి ఇలా స్పందించాడేంటబ్బా.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు, ‘మా’ అసోసియేషన్ తరఫున, సినీ నటి హేమకు అండగా నిలబడ్డాడు.! హేమకి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండ ఖండాలుగా...

Bhaje Vayu Vegam: కార్తికేయ ‘భజే వాయు వేగం’..కు సెన్సార్ U/A సర్టిఫికెట్

Bhaje Vayu Vegam: కార్తికేయ (Karthikeya) గుమ్మకొండ హీరోగా నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం" (Bhaje Vayu Vegam). అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

Viral News: నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని 9ఏళ్ల బాలుడి ఆత్మహత్య

Viral News: 10ఏళ్లు నిండని బాలుడు.. ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చిన్న వయసు.. తల్లిదండ్రుల తీర్చే అచ్చటా ముచ్చటలో ముద్దుగా పెరగాల్సిన రేపటి పౌరుడు ఆకస్మికంగా తనువు చాలించాడు. అదీ జీవితం అంటే...