Gold: ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు దాదాపు 100టన్నలు (లక్ష కేజీలు) బంగారాన్ని తరలించింది ఆర్బీఐ (RBI). వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం.. కొన్ని నెలల కసరత్తుతో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక విమానం వినియోగించారు. దీనికి ఆర్ధిక శాఖ నుంచి కస్టమ్స్ మినహాయింపు తీసుకుంది. ఆదాయన్ని రాష్ట్రాలతో పంచుకోవాలి కాబట్టి ఐజీఎస్టీ తప్పలేదు.
విదేశాల్లో పెరిగిన భారత్ బంగారం నిల్వలతో రవాణా, నిల్వ సర్దుబాట్లో భాగంగా ఇంత మొత్తంలో బంగారం తీసుకొచ్చింది. ఇంగ్లాండ్ లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇండియాలో ముంబై మింట్ రోడ్డు, నాగ్ పూర్ కార్యాలయాల్లో బంగారాన్ని నిల్వ చేస్తుంది. కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తోంది కేంద్రం. గతేడాది 27.5 టన్నుల బంగారాన్ని నిల్వల్లో చేర్చింది. 2024 మార్చికి ఆర్బీఐ వద్ద 822.1టన్నల బంగారం ఉండగా.. 413.8టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసింది.
1991లో ఆర్ధిక సంక్షోభం కారణంగా పెద్ద మొత్తంలో బంగారాన్ని తనఖా పెట్టింది భారత్. తర్వాత ఇంత మొత్తంలో తరలించడం ఇదే.