Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: పోలవరం.. పబ్లిసిటీ ‘పరుగు’ మాత్రమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఇదిగో పోలవరం.. అదిగో పోలవరం.. అంటూ ఇప్పటిదాకా చాలా ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేశాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా పోలవరం ప్రాజెక్టుకి శాపం రాజకీయమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎప్పుడో బ్రిటిష్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టు గురించిన ఆలోచన జరిగితే.. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడాన్ని ఏమనుకోవాలి.? ఆలస్యం జరుగుతున్నకొద్దీ పోలవరం ప్రాజెక్టు ‘అంచనా వ్యయం’ పెరిగిపోతూ వస్తోంది.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ పోలవరం ప్రాజెక్టుపై నానా యాగీ జరిగింది. ‘మూడేళ్ళలో పూర్తి చేస్తాం..’ అంటూ అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యారు.. ఆయనా ఐదేళ్ళు పోలవరం ప్రాజెక్టు పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేశారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇందుకు మినహాయింపేమీ కాదు. ‘మేం పబ్లిసిటీ స్టంట్లు చేయం..’ అంటూనే, ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా అవే పబ్లిసిటీ స్టంట్లు చేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

పోలవరం ప్రాజెక్టు.. జాతీయ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వాల్సింది కేంద్రమే. కానీ, కేంద్రం ఇవ్వాల్సిన స్థాయిలో.. ఇవ్వాల్సిన వేగంతో పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వడంలేదు. మరోపక్క, ‘కేంద్రం మెడలు వంచైనా సాధిస్తాం..’ అని చెబుతున్న రాష్ట్రంలోని అధికార పార్టీలు తమంతట తాము మెడలు వంచేసుకోవడం తప్ప, కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల్ని తీసుకురాలేకపోతున్నారు.

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మొదలు పెట్టిన ప్రాజెక్టుని ఆయన తనయుడు జగన్‌ మోహన్‌రెడ్డి పూర్తి చేస్తారు..’ అంటూ తాజాగా వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ట్వీటేశారు. ప్రాజెక్టు పూర్తయితే మంచిదే. కానీ, ఆ స్థాయిలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి వుందా.? అంటే ఆ పరిస్థితే కన్పించడంలేదు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కలిశారు. పలువురు ఇతర కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించారు. అయితే, కేంద్ర మంత్రులెవరూ మీడియా ముందుకొచ్చి, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడకపోవడం గమనార్హం.

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి.. దశాబ్దాల రాజకీయ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు కల సాకారం కావడంలేదు. ఇంకో నాలుగేళ్ళ సమయం జగన్‌ సర్కార్‌కి వుంది గనుక.. ఈ లోగా ప్రాజెక్టు పూర్తవుతుందా.? చంద్రబాబు హయాంలోనే 70 శాతం ప్రాజెక్టు పూర్తయిపోయిందని లెక్కలు చెబుతున్న దరిమిలా.. జగన్‌ సర్కార్‌, ఆ మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయడానికి ఇంకెన్నాళ్ళ సమయం తీసుకుంటుందో ఏమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...