Switch to English

రఘురామకృష్ణరాజు జోస్యం.. విజయసాయిరెడ్డి పదవి పోతుందేమో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘నాపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన డిస్‌ క్వాలిఫికేషన్‌ పిటిషన్‌ డిస్‌ క్వాలిఫై అవుతుంది. ఎంపీ పదవిని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు..’ అంటూ ఇప్పటికే పలు మార్లు కుండబద్దలుగొట్టేసిన వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ప్రస్తుతం నేను పార్లమెంటరీ స్టాండిగ్‌ కమిటీ (సబార్డినేట్‌ లెజిస్లేషన్‌) ఛైర్మన్‌ పదవిలో వున్నాను. నా నుంచి ఆ పదవిని దూరం చేయాలనే ఆలోచనతో పార్టీ పెద్దలు వున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని బాలశౌరి ఆ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, అది వైసీపీ ఇచ్చిన పదవి కాదు. బీజేపీ పెద్దలు ఇచ్చిన పదవి. ఒకవేళ పదవి కోసం బాలశౌరి ప్రయత్నాలు ఫలిస్తే, ఆటోమేటిక్‌గా విజయసాయిరెడ్డి పదవి పోవచ్చు. అంతే తప్ప, నా పదవికి వచ్చిన నష్టమేమీ లేదు..’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి.

పార్టీకి వున్న ఎంపీల బలం ప్రకారం చూస్తే, ఒకే ఒక్క పదవి వస్తుంది. అది లోక్ సభ సభ్యుడికి ఇవ్వాలిగానీ, రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డకి ఆ పదవి ఇచ్చారు. ఇప్పుడు బాలశౌరి పోటీకి వస్తే, మరి విజయసాయిరెడ్డి పరిస్థితి ఏమవుతుందోనన్నది నర్సాపురం ఎంపీ అభిప్రాయంగా కన్పిస్తోంది. ‘పార్టీ పట్ల ఇప్పటికీ విధేయుడిగానే వున్నాను. కానీ, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు..’ అన్నారు రఘురామకృష్ణరాజు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడనీ, స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి రాజశేఖర్‌రెడ్డి అనీ, ఎవరైనా ఏదన్నా సలహా లేదా సూచన ఇస్తే, దాన్ని పరిశీలించే గొప్ప గుణం ఆయనలో వుందని రాజశేఖర్‌రెడ్డితో తనకున్న సన్నిహిత సంబంధాల గురించి చెప్పుకున్నారు నర్సాపురం ఎంపీ.

వైఎస్సార్‌ హయాంలో వచ్చిన ‘అభయ హస్తం’ పథకానికి పేరు తానే సూచించాననీ, ఆలోచన తనది అయినా ఆ పేరు తాలూకు క్రెడిట్‌ ముళ్ళపూడి వెంకటరమణగారిదని చెప్పారు రఘురామకృష్ణరాజు. ఇదిలా వుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు పడుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ‘నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చి తీరుతుంది’ అని వైసీపీ నేతలు కుండబద్దలుగొడ్తోన్న విషయం విదితమే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...