Switch to English

ఎక్స్‌ క్లూజివ్‌ ఇంటర్వ్యూ: పాయల్ రాజ్ పుత్ – ప్రభాస్, విజయ్ దేవరకొండ పిలుపు కోసం వెయిటింగ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

RX 100 చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యి ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌ పుత్‌. ఈ అమ్మడు ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె హీరోయిన్‌గా నటించడంతో పాటు ఐటెం సాంగ్స్‌తో కూడా అదరగొడుతోంది. ఇటీవల తన గురించి వచ్చిన పలు పుకార్లకు సమాధానం చెబుతూ, తన భవిష్యత్తు ప్రణాళిక, తన డ్రీమ్‌ రోల్స్‌ గురించిన విషయాలను పాయల్‌ మా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకుంది.

ఈ లాక్‌డౌన్‌ పీరియడ్‌లో మీరు ఎక్కడ ఉంటున్నారు?

ప్రస్తుతం నా తల్లిదండ్రులతో కలిసి నేను ఢిల్లీలో ఉంటున్నాను. రాబోయే రెండు మూడు నెలల్లో హైదరాబాద్‌ షిఫ్ట్‌ అవ్వాలనుకుంటున్నాను. ఇకపై నేను హైదరాబాద్‌ లోనే సెటిల్‌ అయ్యే ఆలోచనలో ఉన్నాను.

ఈ లాక్‌ డౌన్‌ మీకు ఎలా అనిపించింది?

కాస్త ఇబ్బందిగానే ఉన్నా కూడా తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. షూటింగ్‌ కోసం ఎదురు చూస్తున్నాను.

తెలుగు ఎంతవరకూ నేర్చుకున్నారు? భవిష్యత్తులో మీ పాత్రలకు మీరు డబ్బింగ్‌ చెప్పుకునే ఆలోచన ఉందా?

నేను తెలుగు అర్థం చేసుకోగలను పూర్తిగా కాకున్నా కొంత మేరకు తెలుగు మాట్లాడుతాను. కానీ ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. త్వరలోనే హైదరాబాద్‌కు చేరుకుని మిగిలిన తెలుగు నేర్చుకుంటాను. ఇక డబ్బింగ్‌ కూడా త్వరలో చెప్పాలని ఆశిస్తున్నాను.

ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు ఏంటీ?

ప్రస్తుతం నేను కథలు వింటున్నాను. త్వరలోనే నచ్చిన స్క్రిప్ట్‌కు ఓకే చెప్పి ప్రాజెక్ట్‌కు సైన్‌ చేస్తాను. ఇదే సమయంలో ఆహా కోసం ఓ వెబ్ సీరీస్ చేస్తున్నాను. మరికొన్ని వెబ్‌ సిరీస్‌ లలో నటించేందుకు ఆఫర్లు వచ్చాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నాను.

‘సీత’లో మీరు ఐటెం సాంగ్‌ చేశారు కదా ఆ కారణంగానే మీరు పలు ఐటెం సాంగ్స్‌ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి అనుకుంటున్నారా? సీతలో ఐటెం సాంగ్‌ చేయడం వల్ల మీ కెరీర్‌ ప్రభావితం అయ్యిందని మీరేమైనా భావిస్తున్నారా?

నేను సీత లో ఐటెం సాంగ్‌ చేయడంను తప్పుడు నిర్ణయంగా భావించడం లేదు. పూర్తి అవగాహణతోనే ఆ ఐటెం సాంగ్‌ చేశాను. తేజ గారితో వర్క్‌ చేయడం కోసం అలాగే నన్ను నేను నిరూపించుకునే అవకాశం వచ్చింది కనుకే ఆ ఐటెం సాంగ్‌ చేశాను. ఇక ప్రస్తుతం ఐటెం సాంగ్స్‌ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను నేను ఇన్‌ స్టా గ్రామ్‌ ద్వారా కొట్టిపారేశాను. ఇప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌ చేసే ఆసక్తి నాకు లేదు.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం తర్వాత మీరు చాలా ఫ్లాప్స్‌ చవిచూశారు కదా కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు?

ప్రేక్షకులు ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం తర్వాత నా పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే నేను ఎంపిక చేసుకున్న సినిమాలు వారిని నిరాశ పర్చాయి. అదే సమయంలో నాకు నేను ప్రయోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కొన్ని ప్రాజెక్ట్‌లను కమిట్‌ అయ్యాను. ఆ ప్రాజెక్ట్‌లు ప్రేక్షకులను నిరాశ పర్చాయి. ఇకపై ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలని భావిస్తున్నారో అలాంటి పాత్రలను మాత్రమే చేస్తాను.

ఈ లాక్‌డౌన్‌ టైంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు?

ప్రతి రోజు క్రమం తప్పకుండా ఉదయం యోగా చేస్తూ ఉన్నాను. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పై దృష్టి పెట్టాను. ఇదే సమయంలో నా చుట్టు ఉన్న వారు బాగుండేలా చూసుకున్నాను.

సుశాంత్‌ మరణంపై మీ స్పందన ఏంటీ? అతడు మీకు పర్సనల్‌గా తెలుసా?

సుశాంత్‌ మరణం నాకు షాకింగ్‌గా అనిపించింది. వారం రోజుల పాటు ఆ షాక్‌ నుండి బయటకు రాలేక పోయాను. అతడిని నేను కొన్ని సార్లు పార్టీల్లో కలిశాను. వ్యక్తిగతంగా అతడితో నాకు ఎలాంటి పరిచయం లేదు. అతడి విషయంలో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. కాని అతడు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

ప్రస్తుతం మీరు ఎవరితో అయినా రిలేషన్‌ షిప్‌లో ఉన్నారా? సెటిల్‌ అయ్యేందుకు ఏమైనా ప్లాన్స్‌ ఉన్నాయా?

ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా కెరీర్‌ పైనే ఉంది. సెటిల్‌ అయ్యేందుకు ఇంకా చాలా సమయం ఉందని నా అభిప్రాయం.

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో మీ అనుబంధం?

నా జీవితంలో జరిగిన పెద్ద సంఘటన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికి ఆ సినిమాను మర్చిపోను. తెలుగు ప్రేక్షకులకు నన్ను ఇంతగా దగ్గరకు చేర్చినందుకు ఆ సినిమా నా జీవితంలో చాలా ప్రత్యేకం. ఆ సినిమాలో ఇందు మాదిరిగానే కాకుండా ఇంకా చాలా రకాలుగా ప్రేక్షకులకు దగ్గర అయ్యాను. నా నుండి అలాంటి పాత్రల కోసం చూస్తున్న ప్రేక్షకుల కోరిక మేరకు తప్పకుండా నటించాలనుకుంటున్నాను.

సినిమా ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టాలు ఏంటీ? ప్రస్తుత కెరీర్‌ తో మీరు సంతోషంగా ఉన్నారా?

నేను మొదటగా ముంబయి వెళ్లాను. నా వద్ద ఉన్న కొద్ది పాటి డబ్బులతో అవకాశాల కోసం ప్రయత్నించాను. మొదటగా నాకు హిందీ సీరియల్‌ లో ఛాన్స్‌ దక్కింది. ఆ తర్వాత పంజాబీ సినిమాలో కూడా ఛాన్స్‌ దక్కింది. ఆసమయంలోనే తెలుగు సినిమా అవకాశం వచ్చింది. ఇండస్ట్రీలో కష్టపడటం అనేది ఆపకూడదు. ఎప్పటికి కష్టపడుతూనే ఉంటే మంచి గుర్తింపు వస్తుంది. ప్రస్తుతం నా కెరీర్‌ విషయంలో పూర్తి సంతృప్తిగా ఉన్నాను.

మీ అమ్మ నాన్నల్లో మీకు ఎక్కువ క్లోజ్‌ ఎవరు? మిమ్ములను ఎక్కువగా గారాబం చేసేది ఎవరు?

అమ్మ.. ఆమె నాకు మూల స్థభం. ఆమె నన్ను ఎంతగానో గారాబం చేస్తుంది.

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలపై మీకు ఆసక్తి ఉందా?

ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాన్ని చేస్తున్నాను. అది త్వరలో ఓటీటీలో విడుదల అవ్వబోతుంది. నేను ఆ సినిమాలో ఐపీఎస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాను.

మీ డ్రీమ్‌ కో స్టార్‌.. ఎవరితో అయినా మీరు నటించాలని కోరుకుంటున్నారా?

నాకు ఇద్దరు డ్రీమ్‌ కో స్టార్స్‌ ఉన్నారు. తెలుగు హీరోలు అయిన ప్రభాస్‌ ఇంకా విజయ్‌ దేవరకొండలతో నేను నటించాలని కోరుకుంటున్నాను. త్వరలో ఆ కోరిక తీరుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. అలాగే రమ్యకృష్ణ గారితో కూడా స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా ఆమె అద్బుతమైన వ్యక్తి.

మీకు ఎవరు ఆదర్శం?

కరీనా కపూర్‌ మరియు రమ్యకృష్ణ గారు నాకు ఆదర్శం.

వెంకీమామలో నటించినందుకు విమర్శలు ఎదుర్కొన్నారు కదా… ఇకపై సీనియర్‌ హీరోలతో నటించకూడదని ఏమైనా అనుకుంటున్నారా?

నా అభిమానులు నన్ను ఆ పాత్రలో చూడటానికి ఇష్టపడలేదు. ఎక్కువ వయసు ఉన్న పాత్రలో నేను నటించడం వల్ల వారు చాలా నిరుత్సాహ పడ్డారు. అంతే తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరితో నటించను అని చెప్పను. పాత్రకు ప్రాముఖ్యత ఉండి మంచి పాత్ర అయితే తప్పకుండా ఎవరితో అయినా కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్నాను.

బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన ఉందా?

నాకు బాలీవుడ్‌ ఆలోచన ఏమీ లేదు. నాకు తెలుగు సినిమా అంటే ఇష్టం. తెలుగు ఆడియన్స్‌ నన్ను ఆధరిస్తున్న తీరు నచ్చింది. వారి హృదయాలతో నన్ను ఆధరిస్తున్న కారణంగా నేను తెలుగు సినిమా పరిశ్రమలోనే కొనసాగాలని భావిస్తున్నాను.

మీ సహనటుల్లో మీకు ఇష్టమైన వారు ఎవరు?

రవితేజ

ఇండస్ట్రీలో మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?

రాశిఖన్నా

మీరు ఎవరి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నారు?

సందీప్‌ వంగ మరియు తేజ. వీరిద్దరితో పాటు అజయ్‌ భూపతి దర్శకత్వంలో మరో సినిమాను చేయాలనుకుంటున్నాను.

మీరు చేయాలనుకుంటున్న పాత్ర ఏదైనా ఉందా?

జబ్‌ వీ మెట్‌ లో గీత్‌ పాత్ర.

టాలీవుడ్‌ లో మీ అభిమాన హీరో ఇంకా హీరోయిన్‌ ఎవరు?

తమన్నా, రవితేజ ఇంకా ప్రభాస్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...