Switch to English

ఇంతకీ ఏపీలో గెలుపెవరిది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంల మొరాయింపులు, హింసాత్మక సంఘటనలతో గురువారం అర్ధరాత్రికి పోలింగ్ ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. వాటన్నింటికీ సీల్ వేసి స్ట్రాంగ్ రూములకు తరలించేశారు. గత మూడు వారాలుగా ప్రచారాలు, వ్యూహాలు, ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ క్షణం తీరిక లేకుండా పార్టీలకు కాస్త సమయం చిక్కింది. ఇక తమకు ఎన్ని ఓట్టు పడ్డాయి? ప్రత్యర్థికి ఎన్ని వచ్చాయి? గెలుపు ఎవరిది? ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఎవరు వంటి అంచనాలు, ఊహాగానాలు, లెక్కలు వేసుకోవడంలో బిజీ అయిపోయాయి.ఇందుకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకుని మదింపు చేసుకుంటున్నాయి. వాస్తవానికి గెలుపు ఎవరిది? ప్రజలు ఎవరికి జైకొట్టారు. చంద్రబాబుకే మరోసారి పట్టం కట్టారా? లేక జగన్ కు ఓ అవకాశం ఇచ్చారా? పవన్ పరిస్థితి ఏంటి? ఓసారి చూద్దాం.

ఈసారి ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఇరుపక్షాలూ తమ తమ వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. పాదయాత్ర ద్వారా జనాల్లో ఉంటూ జగన్ దూసుకుపోగా.. సంక్షేమ పథకాల అమలుతో చంద్రబాబు ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నించారు. అయితే, ఈసారి ఎన్నికలు చాలా భిన్నమైన వాతావరణంలో జరిగాయి. గతంలో నెమ్మదిగా పోలింగ్ ప్రారంభమై పుంజుకుని, మధ్యాహ్నానికి కాస్త తగ్గి, మళ్లీ సాయంత్రానికి పెరిగేది. ఈసారి మాత్రం ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. కానీ చాలాచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు వేచిచూశారు. ఎంతకీ అవి సరికాకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో 11 గంటల సమయానికి చాలా తక్కువ పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నానికి కాస్త పుంజుకుని, సాయంత్రానికి మళ్లీ ఓటర్లు బారులు తీరారు. 6 గంటల సమయానికి పెద్ద సంఖ్యలో జనం పోటెత్తారు. దీంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది.

వాస్తవానికి ఒకసారి వెనుతిరిగి వెళ్లిన తర్వాత మళ్లీ పోలింగ్ కేంద్రానికి రావడానికి ఓటరు అంతగా ఆసక్తి చూపించడు. కానీ ఈసారి వారు చాలా కసిగా ఉన్నట్టు కనిపించింది. అందువల్లే ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకోవాలనే తపనతో ఎంత రాత్రైనా వేచి ఉండి ఓటేశారు. దీంతో ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నమని, ఈ ప్రభుత్వం పడిపోవాలనే కసితోనే ఓటరు మీట నొక్కారని ప్రతిపక్ష నేతలు అంచనా వేసుకుంటున్నారు. తమ గెలుపు పక్కా అని, భారీ మెజార్టీతో తాము గెలుపొందడం ఖాయమని పేర్కొంటున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ సరళిపై తొలుత ఆందోళన చెంది, ఈవీఎంలపై ఆరోపణలు చేశారు. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సాయంత్రానికి సీన్ మారినట్టుగా భావించి తమ గెలుపు ఖాయమనే నిర్ధారణకు వచ్చారు. పోలింగ్ శాతం పెరగడం తమకే లాభమని, తెలంగాణలో ఇటీవల భారీ స్థాయిలో నమోదైన పోలింగ్.. అధికార పార్టీకే లాభించిన సంగతి గుర్తుచేస్తున్నారు. అందువల్ల అధికారం తమదేనని ధీమాగా ఉన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. మే 23 తర్వాత మంచిరోజు చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా వ్యాఖ్యానించారు. ఇలా ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో అసలు వాస్తవం ఏమిటనే దానిపై జనాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ హవా ఉండగా.. కృష్ణాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ పైచేయి సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల నాడి మాత్రం పట్టుకోవడం కష్టంగా ఉందని అంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే అధికారం చేపడతారు. ఈ నేపథ్యంల ఈ రెండు జిల్లాల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. పలు అంతర్గత సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్సార్ సీపీ హవా కనిపించిందని చెబుతున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ సర్వే కూడా హోరాహోరా పోరు ఉందని తేల్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అసలు విజేత ఎవరనేది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...