Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: పవన్‌ని తిడితే ‘కాపులకి’ మేలు చేసినట్లా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎప్పుడైతే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెరపైకి తెచ్చారో, అధికార పార్టీకి వెన్నులో వణుకు మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు.. వైసీపీలోని ‘కాపు’ నేతలంతా పోటీ పడి మరీ, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌పై ఎడా పెడా విమర్శలు చేసేస్తున్నారు. గతంలో పవన్‌, చంద్రబాబుకి లొంగిపోయారట.. ఇప్పుడూ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తున్నారట. చంద్రబాబుని అప్పుడెందుకు ప్రశ్నించలేదు.? అని వైసీపీ కాపు నేతలంతా పవన్‌కళ్యాణ్‌పై విరుచుకుపడిపోతున్నారు.

టీడీపీ నుంచి వైసీపీలోకి ఈ మధ్యనే చేరిన ఓ ‘కాపు’ ప్రముఖుడు కూడా ఈ రోజు మీడియా ముందుకొచ్చి, పవన్‌కళ్యాణ్‌ని ప్రశ్నించేయడం చూస్తోంటే, పవన్‌కళ్యాణ్‌ని తిట్టాల్సిందిగా.. వైసీపీలోని ‘కాపు’ నేతలకు ఏ స్థాయిలో ఆదేశాలు అందాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ రోజు పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించేందుకు వైసీపీ నుంచి ఇంకో బ్యాచ్‌ దూసుకొచ్చింది. ఆమంచి కృష్ణమోహన్‌, తోట త్రిమూర్తులు తదితరులున్నారు ఈ బ్యాచ్‌లో.

కాపు నేస్తం, కాపు కార్పొరేషన్‌, కాపు రిజర్వేషన్‌ అంశాలపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఓ ప్రెస్‌నోట్‌ని మాత్రమే విడుదల చేశారు. ప్రెస్‌నోట్‌కే అధికార పార్టీ ఇంతలా అదిరిపడాలా.? ఇక, పవన్‌ కళ్యాణ్‌ గ్రౌండ్‌లోకి దిగితే, ‘కాపులకు మద్దతుగా బహిరంగ సభ’ లాంటిది ఏమన్నా పెడితే.. ఆ తర్వాత పరిస్థితులెలా వుంటాయి.? ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

‘అసలు పవన్‌ కళ్యాణ్‌ని ఎందుకు తిడుతున్నారో అర్థం కావడంలేదు. అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ.. రెండు పార్టీలూ కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయి. చంద్రబాబు కనుసన్నల్లో కొందరు నేతలు చెంచాగిరీ చేస్తే, అంతకు మించిన చెంచాగిరీ వైఎస్‌ జగన్‌ కనుసన్నల్లో సోకాల్డ్‌ కాపు నేతలు చేస్తున్నారు..’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కాపు సామాజిక వర్గానికి చెందినవారు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు.

అసలే ఆంధ్రప్రదేశ్‌ అనగానే అందరికీ ‘కులాల కుంపటి’ అనే భావన కలుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కులాల కుంపట్లను రాజకీయ పార్టీలు రాజేస్తుంటాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓ అంశంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నిస్తే, కాపు సామాజిక వర్గ నేతలతోనే పవన్‌కళ్యాణ్‌ని తిట్టించడమా.? అసలు సమస్య ఏంటి.? జనసేన సంధించిన ప్రశ్నలకు సమాధానమేది.? ప్రశ్నకు సమాధానమిస్తే.. సమస్య సద్దుమణిగే అవకాశముంటుంది. సమస్యను దాటవేసి, అడ్డగోలు విమర్శలకు తెరలేపితే.. ఆ సమస్య ముదిరి పాకాన పడుతుందన్న కనీస విజ్ఞతను అధికార పార్టీ విస్మరిస్తే ఎలా.? అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...