జంతువుల్ని హింసించడం నేరమని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో ఏమార్పూ లేదు. ఇటివల కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును పైన్ ఆపిల్ లో బాంబు పెట్టి చంపేశారు కొందరు దుండగులు. దేశం మొత్తం ఈ దారుణ సంఘటన ఎంత వైరల్ అయిందో తెలసిన విషయమే.
నేటి డిజిటల్ యుగంలో ఈ విషయం ఎంతటి మారుమూల ప్రదేశంలో ఉన్నవారికైనా ఇట్టే చేరిపోతుంది. సెల్ ఫోన్లలో ఈ విషయం అంత వైరల్ అయింది. అయినా ఖమ్మం జిల్లాలోని ఓ వ్యక్తికి ఇవేమీ పట్టనట్టుంది. ఓ కోతికి ఉరి వేసి దానిని అత్యంత దారుణంగా చంపేశాడు.
అత్యంత హేయమైన ఈ సంఘటన ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం అమ్మపాలెం గ్రామం లో జరిగింది. ఓ వ్యక్తి కోతిని అతి కిరాతకంగా కర్రలతో కొట్టి ఉరి తీసి చంపాడు. ఆ కోతిని ఉరి వేసిన సమయంలో దాని మెడకు ఉచ్చు బిగుసుకుని అది ఎంత గిలగిలా కొట్టుకోవడం చూస్తుంటే ఎవరి మనసైనా కలత చెందక మానదు. కానీ ప్రత్యక్షంగా హింసిస్తున్న ఆ వ్యక్తికి.. పక్కనే చోద్యం చూస్తున్న వారిలో మాత్రం ఎటువంటి చలనం లేదు.
ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ వీడియో వైరల్ అయింది. ఇలాంటి మానవత్వం లేని మనుషులను పోలీసులు అస్సలు విడిచి పెట్టకూడదు.. కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
Met tho kottali alanti vallani papam aa monkey entha gila gila
kottukuntunnadho
276240 732508Thank you for your quite great info and feedback from you. car dealers in san jose 250380
566076 337347very nice post, i definitely enjoy this incredible internet site, persist with it 132822
610964 936192Any way Ill be subscribing to your feed and I hope you post again soon. I dont believe I could have put it far better myself. 190806