Switch to English

టిబి స్పెషల్: నవభారత నిర్మాత, భారత ఆర్థిక ప్రదాత.. పీవీ నరసింహారావు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పీవీ నరసింహారావుగా సుప్రసిద్ధులైన పాములపర్తి వెంకట నరసింహారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యావత్ భారతావని గర్వించదగ్గ తెలుగు ముద్దు బిడ్డ. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెలో పుట్టి 17 భాషల్లో పట్టు సాధించి, దేశానికి ప్రధానిగా పనిచేసిన ఆయన.. కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన తీరు అత్యద్భుతం. తన మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడపడమే కాకుండా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచంలో భారత్ ధీటైన శక్తిగా ఎదగడానికి ఎంతగానో కృషి చేసి చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.

రాజకీయ దురంధరుడిగా, బహుభాషా కోవిదుడిగా, రాజనీతిజ్ఞుడిగా, ప్రతిభకే పట్టం కట్టే అసమాన్యుడిగా ఆయన ఖ్యాతి ఆచంద్రతారార్కం నిలిచే ఉందనడం నిస్సందేహం. ఆదివారం పీవీ వందో జయంతి. ఇప్పటికే పీవీ శతజయంతి వేడుకలు ఏడాది పాటు నిర్వహించడానికి తెలంగాణలోని కేసీఆర్ సర్కారు చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పీవీపై ప్రత్యేక కథనం..

1991 జూన్ 21న భారతదేశ తొమ్మిదో ప్రధానిగా పీవీ పగ్గాలు చేపట్టేనాటికి దేశ ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. మన ఎకానమీ దాదాపుగా ఐసీయూలో ఉంది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా రూపాయి లేని పరిస్థితి. ద్రవ్య లోటు గతంలో ఎన్నడూ లేనంత పాతాళానికి పడిపోయింది. ఇక అప్పులైతే జీడీపీలో 53 శాతానికి పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం చరిత్రలో ఎన్నడూ లేనంతగా 12.7 శాతానికి ఎగబాకింది. ఈ పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ నరసింహారావు తక్షణమే ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ను ఆర్థికమంత్రిగా నియమించి ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థను తొలగించడం, పన్నులు తగ్గించడం, మార్కెట్లను పునర్వ్యవస్థీకరించడం, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో దౌడు తీయించారు. వీరిద్దరూ కలిసి తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎంతగానో దోహదపడ్డాయి. ముఖ్యంగా పదవిలోకి వచ్చి పది రోజులు కూడా కాకముందే డాలర్ తో రూపాయి మారక విలువను 9 శాతం తగ్గించారు. మరో రెండు రోజులకు 11 శాతం తగ్గించారు. దీనిపై కొందరి నుంచి విమర్శలు వచ్చినా.. పీవీ వాటిని పట్టించుకోకుండా ముందుకే వెళ్లారు.

ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం. ఇలా పలు అంశాల్లో పీవీ, మన్మోహన్ లు తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదాయి. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా పీవీ బాటలోనే సాగడంతో ప్రపంచంలో భారత్ బలమైన దేశంగా ఎదిగింది. సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇవన్నీ కూడా పీవీ చలవే.

పాలనలో తనదైన ముద్ర వేసిన పీవీ.. రాజకీయంగానూ అపర చాణక్యుడిగానే నిర్ణయాలు తీసుకున్నారు. సంకీర్ణ సర్కారులో ఉండే తలనొప్పులను తట్టుకోవడమే కష్టమనుకుంటే సొంత పార్టీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. పదవిలో ఉన్నప్పుడు, తర్వాత కూడా రాజకీయ కారణాలతో పలు కేసులు పెట్టి పీవీని ఇబ్బంది పెట్టారు. 1996 నుంచి 2002 వరకు పలుమార్లు విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే, ముక్కుసూటిగా, రాజ్యాంగబద్ధంగా పనిచేసిన పీవీ ఆ కేసులన్నింటి నుంచి విముక్తుడయ్యారు.

ప్రధాని ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకుల విషయంలో కూడా ఆయన ఎంతో హూందాగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి చెందిన సుబ్రమణ్యస్వామికి కేబినెట్ హోదా కల్పించినా.. ఐక్యరాజ్యసమితిలో కీలక సమావేశానికి భారత ప్రతినిధిగా వాజ్ పేయిని పంపించినా అది ఒక్క పీవీకే సాధ్యం. అలాంటి పీవీకి మన దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించుకోవడం భారతీయులుగా మన బాధ్యత. ప్రపంచంలో భారత్ ను ఠీవీగా తలెత్తుకునేలా చేసిన పీవీ.. తెలుగు బిడ్డ కావడం మనకు ఎంతో గర్వకారణం. ఆయన్ను సదా స్మరించుకోవడం మన కర్తవ్యం. సాహో పీవీ.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...