Switch to English

టీడీపీ బాటలోనే వైసీపీ మునక.. తాడిని తన్నేవాడుంటే…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

టీడీపీకి రాజీనామా చేసి, దాంతోపాటుగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌, వైసీపీలో చేరి.. ఇప్పుడు తాజాగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. మరి, ఈపాటి చిత్తశుద్ధి టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైసీపీ వైపు వెళ్ళిన ఎమ్మెల్యేలలో ఎందుకు కన్పించడంలేదు.? ఎమ్మెల్సీ పదవి అంటే, అదెలాగూ తనకే దక్కుతుంది గనుక.. డొక్కా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే పదవి అంటే అలా కాదు కదా. రాజీనామా చేస్తే, ఉప ఎన్నికలొస్తాయి. ఆయా ఎమ్మెల్యేలకు మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం లేకపోవడం ఇంకో ఎత్తు, ఆ స్థానాల్ని మళ్ళీ గెలుచుకోగలమా.? లేదా.? అన్న అధికార పార్టీ అనుమానాలు ఇంకో వైపు.. వెరసి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం సందిగ్ధంలో పడింది.

మరోపక్క, టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను, టీడీపీ పైకి ఎగదోయడంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్రమైన గేమ్ ప్లాన్‌ని అమలు చేస్తోంది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇలాగే జరిగింది. టీఆర్‌ఎస్‌ మీదకి, టీఆర్‌ఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలను ఎగదోశారు అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఇక, వైసీపీ గేమ్ ప్లాన్‌లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేతని ఏ స్థాయిలో తిడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తోనూ, జనసేనపై విమర్శలు చేయిస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. మొదటి నుంచీ జనసేనలో రాపాక వ్యవహారశౖలి అనుమానాస్పదమే. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయన విషయంలో జనసేన పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. దాంతో, గట్టిగా జనసేనను తూలనాడేందుకు సంశయిస్తున్న రాపాక, కేవలం పొలిటికల్‌ సెటైర్లతోనే సరిపెడుతున్నారు.

అన్నట్టు, వైసీపీ ఆడుతోన్న ఈ హేయమైన పొలిటికల్‌ గేమ్.. వైసీపీకి కూడా పెద్ద షాకే ఇస్తోంది.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రూపంలో. రఘురామకృష్ణరాజు వైసీపీని వీడే ఉద్దేశ్యం లేదంటున్నారు. కానీ, వైసీపీలో ముసలం పుట్టించారు. వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డినే టార్గెట్‌ చేసుకున్నారు రఘురామకృష్ణరాజు. వైసీపీ ఎమ్మెల్యేల్ని ఇసుక దొంగలుగా అభివర్ణించారు ఈ నర్సాపురం ఎంపీ.

ఇంతా చేసి, ‘మా ముఖ్యమంత్రి చాలా మంచోడు.. ఆయనంటే నాకు వల్లమాలిన ప్రేమ..’ అంటున్నారు. ఇంతలోనే, ‘అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడుంది.? అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ..’ అని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అవును, ఇప్పుడు వైసీపీ ఉనికికే ప్రమాదమొచ్చేలా వుంది నర్సాపురం ఎంపీ ప్రశ్నలతో.. అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందుకే మరి, తాడిని తన్నేవాడుంటే.. వాడి తలను తన్నేవాడూ వుంటాడనేది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...