Switch to English

వైసీపీ నేత ట్వీటులో బాలయ్య ‘బూతు’ డైలాగ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజకీయాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. వైసీపీ నేత ఒకరు, తన ట్వీట్‌లో బూతు డైలాగు వదిలారు. అదీ ఓ ఎంపీని ఉద్దేశించి. ‘అబ్బే, అది బూతు డైలాగు కాదు..’ అని కొంతమంది అనొచ్చుగాక. అదెంత బూతు డైలాగో.. అందరికీ తెలుసు. సరే, నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కోసం ఈ డైలాగ్‌ని దర్శకుడు బోయపాటి శ్రీను వాడడం, ఆ డైలాగ్‌తో ఇటీవల ఆ సినిమా ‘ఫస్ట్‌ రోర్‌’ (టీజర్‌) విడుదలవడం వేరే సంగతి. సెన్సార్‌ సందర్భంగా ఆ డైలాగ్‌పై కత్తెర వేటు పడొచ్చు కూడా.

సదరు వైసీపీ నేత ఎవరో కాదు, సినీ నిర్మాత కూడా అయిన పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ). ఆయన ఆ డైలాగ్‌ డైరెక్ట్‌గా ఎంపీ కేశినేని నాని మీదనే ప్రయోగించారు. కేశినేని నాని చేతిలో పీవీపీ గత ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం విదితమే. అప్పటినుంచీ ఇద్దరి మధ్యా రాజకీయంగా విమర్శల పర్వం నడుస్తోంది. ఇక, టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్‌ వ్యవహారంలో ‘బీసీ నేత’ అంటూ కేశినేని నాని సహా టీడీపీ నేతలు ప్రస్తావించడాన్ని ఉద్దేశించి ‘వాడకూడని బూతు పదాన్ని’ పీవీపీ తన ట్వీట్‌లో వాడారు.

‘బీసీ నా, ఓసీ నా, కాపా, కమ్మా, రెడ్డా, రాజా, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, బలిజా కాదు.. చట్టానికి చుట్టమయ్యేది నేరగాళ్ళే కానీ కులాలు కాదు.. (బూతు మాట). సినిమా డైలాగ్‌ కాదు ఎంపీ, ఆధారాలు లేకుండా సొల్లు వాగుడు వాగే అందరి మీద ప్రజల ఏకాభిప్రాయం’ అన్నది పీవీపీ ట్వీట్‌. అయితే, వెంటనే పీవీపీకి చాలామంది కౌంటర్‌ ఎటాక్‌ షురూ చేశారు.

గతంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, చంద్రబాబు హయాంలో మృతి చెందిన ఓ రైతు గురించి ప్రస్తావిస్తూ కుల ప్రస్తావన చేసిన తాలూకు ట్వీట్‌ని పేర్కొంటూ, పీవీపీగారూ.. మీరు మీ ముఖ్యమంత్రినేనా బూతులు తిడుతున్నది.? అని ప్రశ్నించడం గమనార్హం. ఈ తరహా విన్యాసాలు చేయడంలో ఇప్పటిదాకా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దిట్ట. విజయసాయిరెడ్డి వేసే ఒక్కో ట్వీట్‌, టీడీపీ మద్దతుదారులకు ఎంత షాక్‌ ఇస్తుందోగానీ.. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా మాత్రం కుప్పలు తెప్పలుగా కామెంట్లను తెప్పిస్తుంటుందన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు విజయసాయిరెడ్డికి తోడయినట్టున్నారు పీవీపీ, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని తిట్టించడంలో. రాజకీయాల్లో విమర్శలు సహజమే. కానీ, ఈ బూతుల ప్రవాహమేంటి చెప్మా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...