Switch to English

జగన్ ఏడాది పాలన: సంక్షేమం సరే.. అభివృద్ధి మాటేంటి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది మే 30న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తానేం చేయబోతున్నదీ ఆయన ప్రకటించారు. ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పారు. అదే రోజు వృద్ధాప్య పింఛన్లను రూ.2వేల నుంచి రూ.2,250కి పెంచుతూ తొలి సంతకం చేశారు. దీనిపై వృద్ధులు కాస్త నిరాశ చెందారు. జగన్ వస్తే పింఛన్లు రూ.3వేలు అవుతాయని భావించినవారు.. కేవలం రూ.250 మాత్రమే పెరిగే సరికి చిన్నబుచ్చుకున్నారు. అయితే, ఏడాదికి రూ.250 చొప్పున నాలుగేళ్లలో రూ.3వేలు చేస్తానని సీఎం ప్రకటించడంతో సరిపెట్టుకున్నారు.

అనంతరం గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. రైతుభరోసా, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన వంటి మేనిఫెస్టోలో పేర్కొన్న చాలా అంశాలను అమలు చేస్తూ వచ్చారు. ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలు అమలు చేశారు. మొత్తమ్మీద వివిధ పథకాల ద్వారా దాదాపు 3.57 కోట్ల మందికి రూ.40వేల కోట్లు లబ్ధి చేకూర్చారు. కరోనా కారణంగా ఆదాయం లేకపోయినా సంక్షేమ పథకాలకు లోటు రాకుండా చూసుకున్నారు. అయితే, సంక్షేమం విషయంలో జగన్ కు మంచి మార్కులే వచ్చినా.. అభివృద్ధి విషయంలో మాత్రం అత్తెసరు మార్కులకు కూడా ఆమడ దూరంలో ఉండిపోయారు.

ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైన జగన్ పాలన.. అభివృద్ధి విషయంలో మాత్రం తిరోగమనంలోనే సాగుతుందన్న విమర్శలున్నాయి. రాష్ట్రానికి మూడు రాజధానులు తీసుకు రావాలన్న నిర్ణయానికి అడ్డంకులు ఎదురు కావడంతో రాజధానిపై గందరగోళం సాగుతోంది. ఫలితంగా ఏ ప్రాంతమూ అభివృద్ధి కాని పరిస్థితి నెలకొంది. ఇక రివర్స్ టెండరింగ్ వల్ల ఖజానాకు సొమ్ములు ఆదా అయినా.. పోలవరం కాంట్రాక్టర్ ని మార్చడంతో ఆ పనులు మరింత జాప్యమయ్యాయి. నిజానికి పాలకులు సంక్షేమం పైనే కాకుండా అభివృద్ధి పైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి, సంక్షేమం రెండూ ముఖ్యమే. అభివృద్ధి ఉంటే సంక్షేమానికి తిరుగు ఉండదు. అలా కాకుండా కేవలం సంక్షేమం పైనే దృష్టి పెట్టి అభివృద్ధిని విస్మరిస్తే నష్టం తప్పదు. సంపద పెంచడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి.

ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడం నిరంతరం కుదరని పని. కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయన్న చందంగా.. ఆదాయం పెంచకుండా సంక్షేమానికి కోట్లు ఖర్చు చేసుకుంటూ పోతే రాష్ట్రం మరిన్ని అప్పుల్లో కూరుకుపోయి దివాళా తీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమంలో సరే అనిపించుకుంటున్న జగన్.. అభివృద్ధిలో కూడా అదే దూకుడు చూపిస్తేనే.. ఆయన కోరుకుంటున్నట్టుగా 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండిపోవచ్చు. మరి రెండో ఏడాది పాలనలో ఆ మేరకు మార్పులు చూపిస్తారేమో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....