Switch to English

బాలకృష్ణ అలా అనడం కరెక్ట్ కాదు – తమ్మారెడ్డి భరద్వాజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రముఖులంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరుపుతున్న విష్యం తెలిసిందే. జనవరి 28న బాలకృష్ణ ‘నన్నెవరూ ఏ మీటింగ్ కి పిలవలేదంటూ’ ఘాటుగా స్పందించారో అక్కడి నుంచి ఇండస్ట్రీలో పలు రకాల విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే బాలయ్య అన్న కామెంట్స్ పై నాగబాబు ఘాటుగా స్పందించి ‘ తెలుగు సినీ పరిశ్రమకి, తెలంగాణ ప్రభుత్వానికి’ క్షమాపణ చెప్పాలని కోరారు.

ఈ విషయంపై కొందరు బాలకృష్ణకి సపోర్ట్ గా ఉంటే, కొందరు చిరు అండ్ ప్రముఖులు చేసిన విషయానికి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ బాలకృష్ణపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘తెలంగాణ ప్రభుత్వం నుంచే చిరుగారిని ఎన్నుకోవడం వలన ఆయన లీడ్ తీసుకొని ఇండస్ట్రీ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పూనుకున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అందరినీ పిలవాల్సిన అవసరం లేదు. వారందరూ సెలబ్రిటీస్, ఈ టైంలో ఎక్కువ మంది ఎందుకు, అయినా వారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అందరినీ పిలిచి ఉండరు. గత ప్రభుత్వం బాలకృష్ణ వాళ్లదే.. మమ్మల్ని ఎప్పుడైనా పిలిచాడా బాలయ్య? చంద్రబాబు హయాంలో నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ ఇలా ఎవరూ వెళ్ళలేదు. వాళ్ళకి కావాల్సిన వారిని పిలిపించి మాట్లాడారు. మాకు నమ్మకం మా సమస్యని బాలయ్య చూసుకుంటారులే అని.. అప్పుడెవరూ అడగలేదుగా.. మీ మీడియా వాళ్ళు ఎదో అడగ్గానే ఆయన ఎదో అనేసారు. ఇండస్ట్రీకి మంచి జరుగుతుంటే బాలకృష్ణ గారికేమన్నా నొప్పా.. ఉండదుగా.. అన్నీ క్లియర్ అయితే ఆయన సినిమాలు జరుగుతాయి, హ్యాపీ కదా.. చిరు, నాగ్, కొందరు నిర్మాతలు కలిసి వెళ్లారు.. పర్మిషన్ ఇస్తే వాళ్ళ సినిమా షూటింగ్స్ మాత్రమే చేస్తారా, లేదుగా అందరికీ పర్మిషన్ వస్తుంది కదా.. అలాంటప్పుడు నన్ను పిలవలేదని బాలకృష్ణ అనడం కరెక్ట్ కాదు, అసలు మీడియా వారు ఆ ప్రశ్న అడగడం కూడా కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారు ఎదో మూడ్ లో ఉండి మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడింది మనం సీరియస్ గా తీసుకోకూడదు. ఆయన్ని పట్టించుకోకూడదు. బాలకృష్ణ – నాగబాబులది వారి పరసనల్ సమస్య.. దానికి దీనికి సంబంధం లేదు. మా ఇండస్ట్రీకి లాభం చేకూరడం కోసం బాలకృష్ణ గారితో పనవుతుందంటే వారి దగ్గరికే వెళ్తాం. అలా ఎప్పుడు ఎవరు అవసరం అయితేనే వారినే కలుస్తాం. అంత సింపుల్, ఇక్కడ వర్గాలు, రాజకీయాలు ఏం లేవు. ఇండస్ట్రీ మంచి కోసం ఎప్పుడూ ఇలాంటి బేధాలు పెట్టుకోకుండా ఉండాలి. ఇంకా ముందుముందు ఇండస్ట్రీకి చాలా బాడ్ ఫేస్ ఉండనుంది. ఇలాంటి టైములో ఇలాంటి కప్పగంతులు వేయకుండా ఉంటే అందరికీ మంచిదని’ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.

ఈ విషయంలో ఇలా రోజుకో సెలబ్రిటీ, రోజుకోలా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ టాపిక్ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్,...

రాజకీయం

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

ఎక్కువ చదివినవి

ఏపీలో ‘వాలంటీర్’ వ్యవహారం బెడిసికొడుతుందా.?

సలహాదారుల పేరుతో పొరుగు రాష్ట్రాలకి చెందిన కొందరికి వైసీపీ సర్కారు అప్పనంగా ప్రజాధనాన్ని దోచిపెట్టిన మాట వాస్తవం. అది వేరే చర్చ. వాలంటీర్ వ్యవహారం అలా కాదు. వాలంటీర్లంటే, ఏపీ ఓటర్లే.! ఇందులో...

AP Assembly Polls: కులమే పాసుపోర్టా ?

ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సామాజిక వర్గాల వెన్నదన్నుగా ఉండటం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో సాంద్రత వున్న సామాజిక వర్గాలని తమ తమ...

Chiranjeevi: జనసేనానికి చిరంజీవి ఆశీర్వాదం.. పార్టీకి రూ.5కోట్ల భారీ విరాళం

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన జనసేన (Janasena) పార్టీకి రూ.5కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును పవన్...

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

Tillu Square: ‘టిల్లు మనింట్లో తిరిగే మనిషి అయిపోయాడు: ఎన్టీఆర్

Tillu Square: ‘టిల్లు పాత్ర మనందరి జీవితాల్లో భాగమైంది. ఈరోజు టిల్లు మన ఇంట్లో తిరిగే మనిషి. అద్భుతమైన పాత్రని క్రియేట్ చేసినందుకు హ్యాట్సాఫ్ సిద్ధు (Siddhu Jonnalagadda)’ అని కొనియాడారు జూనియర్...