Switch to English

లాక్ డౌన్ రెండో కోణం: 25 ఏళ్లలో కానిది.. రెండు నెలల్లో అయింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. మనదేశంలో కూడా లాక్ డౌన్ విధించి రెండు నెలలు దాటింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ లాక్ డౌన్ ఈనెల 31తో ముగియనుంది. లాక్ డౌన్ వల్ల ప్రజలు.. ముఖ్యంగా వలస కార్మికులు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో చూశాం. చాలామంది ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డారు. ఇదంతా లాక్ డౌన్ కు ఒక కోణమైతే.. దీనికి మరో కోణం మాత్రం సానుకూలంగా ఉండటం విశేషం.

ఎప్పటినుంచో కాలుష్యపు కోరల్లో చిక్కి విలవిలలాడుతున్న యమునా నది స్వచ్ఛంగా మారిపోయింది. ప్రభుత్వాలు 25 ఏళ్లలో చేయలేనిది.. ఏకంగా రూ.5వేల కోట్లు వెచ్చించినా కానిది.. లాక్ డౌన్ కారణంగా అయిపోయింది. లాక్ డౌన్ వల్ల పరిశ్రమలన్నీ మూతపడటంతో వాటి నుంచి వచ్చే కాలుష్య వ్యర్థాలు యమునా నదిలో కలవడం ఆగిపోయాయి. దీంతో నది నీళ్లు శుభ్రంగా మారిపోయాయి.

యమునా నదిని కాలుష్యపు కోరల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు గత పాతికేళ్లుగా ఎన్నో చర్యలు చేపట్టాయి. ఇందుకోసం రూ.5వేల కోట్లకు పైగా వెచ్చించాయి. అయినప్పటికీ ఆ నదిని కాలుష్యం నుంచి కాపాడలేకపోయాయి. దాదాపు 1400 కిలోమీటర్ల పొడవైన యమునా నది ఏడు రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది. ఈ నది వెంబడి ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఇందులో కలుస్తుండటంతో అది కాలుష్యం బారిన పడుతోంది.

హర్యానాలోని పానిపట్ నుంచి ఢిల్లీ మధ్యే ఏకంగా 300 పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు యమునా నదిని కలుషితం చేస్తున్నాయి. ఈ నదిలో కలిసే కాలుష్య కాసారాల్లో 80 శాతం మేర ఢిల్లీ, ఆగ్రా, మధుర దగ్గర నుంచే వస్తున్నాయి. ఫలితంగా దేశంలోనే అత్యంత కలుషితమైనదిగా యమునా నది మారిపోయింది. ఈ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ యమునా నది స్వచ్ఛంగా మారడానికి కారణమైంది. లాక్ డౌన్ ముందుతో పోలిస్తే లాక్ డౌన్ విధించిన తర్వాత ఢిల్లీలో యమునా నది 33 శాతం మేర శుభ్రమైందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మధుర వద్దకు వచ్చేసరికి యమునా నది నీళ్లు మరింత స్వచ్ఛంగా మారాయని వివరించారు.

యమున ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే.. ఇకపై పరిశ్రమల వ్యర్థాలు ఆ నదిలో కలవకుండా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని పేర్కొంటున్నారు. మొత్తానికి లాక్ డౌన్ అటు నదులను శుభ్రం చేయడమే కాకుండా వాహనాలు తిరగకపోవడం వల్ల గాలి నాణ్యత కూడా పెరగడానికి దోహదం చేసింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...