Switch to English

టిబి విశ్లేషణ: జగన్ ఫ్రస్ట్రేషన్ కి కారణాలేంటో తెలుసా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కరోనా కష్టాలు ప్రపంచమంతా ఒకలా ఉంటే ఏపీలో మాత్రం మరోలా ఉన్నాయి. భూగోళాన్ని భూచక్రంలా తిప్పుతున్న కరోనా మహమ్మారి పేరెత్తితేనే అభివృద్ధి చెందిన దేశాలు చిగురుటాకుల్లా వణికిపోతుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకున్నట్లు వ్యవహరిస్తోంది. కరోనా కూడా మామూలు జ్వరమే..ఇట్ కమ్ అండ్ గో, పారాసిటమాల్ వేసుకుని బ్లీచింగ్ చల్లుకుంటే చాలన్నట్లు ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్న తీరు ఎవరినీ మెప్పించలేకపోతోంది.

మిగతా వాళ్ల సంగతి సరే…సొంతపార్టీ వాళ్లే తమ అధినేత తీరుచూసి అవాక్కవుతున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో కరోనా, మనం కలిసి ఉండాల్సిన పరిస్థితి అన్న జగన్ చేసిన వ్యాఖ్యలు కరోనాను అరికట్టడంలో ఇక ప్రభుత్వం చేతులు ఎత్తేసిందేమో అన్నట్లు అనిపిస్తోంది. ఇది ఏ ఒక్క ప్రాంతానికో లేక రాష్ట్రానికో సంబంధించిన అంశమైతే జగన్ వ్యాఖ్యలకు జనం జేజేలు పలికేవారేమో..కానీ వాస్తవపరిస్థితులు అత్యంత భయానకంగా కనిపిస్తున్నాయి. ఇక భవిష్యత్తు అయితే పూర్తి గందగరగోళంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనానికి ధైర్యం కల్పించి, సామాన్యులకు భరోసా కల్పించి, వైద్య, పోలీసు సిబ్బందికి అండగా నిలబడుతూ వారి ఆత్మవిశ్వాసం పెంపొందేలా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి పై ఎక్కువ సెటైర్లే వినిపిస్తున్నాయి.

ఆయన తరచుగా చేస్తోన్న వ్యాఖ్యల వల్ల అన్న చెప్పాడు ఇది మామూలు జ్వరమేనట, భయపడాల్సిన పనే లేదట అని సీరియస్ గా నమ్మే ఆయన ఫాలోయర్స్ ఇక విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చేస్తే దాన్ని కంట్రోల్ చేయటం పోలీసులకు సాధ్యమయ్యేపనేనా..? కుటుంబాలకు దూరంగా త్యాగాలకు మారుపేరుగా నిలుస్తోన్న వైద్య సిబ్బంది చేస్తోన్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కరవవుతున్నాయి.

ఇలా కరోనా కధ కంచికి చేరకుండా సశేషంలా ఓవైపు కొనసాగుతోంటే.. మరోవైపు రాజకీయాలు మాత్రం రాజీలేకుండా సాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ తీరు పట్ల టిడిపి శ్రేణులు పండగ చేస్కుంటున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల నుండే కరోనాతో సంబంధం లేకుండా లాక్ డౌన్ లో ఉన్న టిడిపి లీడర్లకు జగన్ తీసుకుంటోన్న కొన్ని నిర్ణయాలు చాలా బాగా కలిసొచ్చాయి. దీంతో ప్రతిరోజూ వైసీపీ, టిడిపిల మధ్య విమర్శల యుద్ధమే నడుస్తోంది. మీ వల్ల కావట్లేదు, మా నాయకుడు చంద్రబాబైతే ఈపాటికే కరోనాను కాటికి పంపేవాడన్నట్లు మాట్లాడుతున్నారు టిడిపి నేతలు.

ఇక సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ లు సైతం వైసీపీ ప్రభుత్వ తీరుపై అవకాశం ఉన్నపుడల్లా టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఇంకోవైపు ఆంధ్రజ్యోతి, ఈనాడు నెట్ వర్క్స్ ప్రభుత్వతీరును తమదైన శైలిలో ఎండగడుతున్నాయి. ఇదిలా ఉంటే కొంతలో కొంత జనసేన వైఖరే వైసీపీకి కొండంత ఊరటని చెప్పొచ్చు. రాజకీయాలకు తావులేదు, కరోనా నివారణకు ప్రభుత్వానికి సాయం చేద్దాం..సామాన్యులను ఆదుకునేందుకు మనవంతు సహకారం అందిద్దామని పిలుపునిచ్చిన పవన్, రెండు తెలుగురాష్ట్రాలకు భారీ విరాళమే ఇచ్చి తన పంథా ఎలాంటిదో చూపాడు.

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఆయన నిశితంగా గమనిస్తున్నారు. కానీ మంత్రి వెలంపల్లి లాంటి వాళ్లు పనికట్టుకుని జనసేనానిపై విమర్శులు చేస్తున్నా సంయమనం పాటించండని పవన్ ఇచ్చిన పిలుపుకు పార్టీ శ్రేణులు కూడా సైలెంట్ అయ్యారు. ఇదంతా పక్కనబెడితే ఇక సోషల్ మీడియాలో అయితే జగన్ నీ, ఇతర వైసీపీ నేతల్ని నెటిజన్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. దీంతో జగన్ విపరీతమైన చిరాకులో ఉన్నట్లు తెలుస్తోంది. చెప్పినంత ఈజీగా దారిలోకి రాని కరోనా ఉపద్రవాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రమిస్తోంటే మధ్యలో ఈ పంచాయితీలేంటన్నది జగన్ బాధగా కనిపిస్తోంది.

ముఖ్యంగా నాలుగైదు నెలలుగా జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. కరకట్ట కట్టడాల తొలగింపు దగ్గర స్టార్టయిన చిరాకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన, రాజధాని తరలింపు, మండలి రద్దు, స్థానిక సంస్థల నిర్వహణ వంటి అంశాలతో కంటిన్యూ అవుతూ వస్తోంది. మరోవైపు హెకోర్టు నుండి తరచుగా ఎదురవుతున్న చీవాట్లు, మొట్టికాయలూ ఆయన చికాకుకు జీఎస్టీలా మారాయి.

సహజంగా తాను అనుకున్నది జరగాలనీ..తనకు ఎదురన్నది లేకుండా ఉండాలనీ జగన్ భావిస్తుంటారని ఆయన సన్నిహితులే చెబుతుంటారు. అందుకు ఉదాహరణగా తాజాగా ఎన్నికల నిర్వహణాధికారి నిమ్మగడ్డ రమేష్ ఉదంతమే మనకు కనిపిస్తోంది. కేవలం పన్నెండుగంటల్లో నిమ్మగడ్డ రమేష్ ను తొలగించటం, ఆయన స్థానంలో కనగరాజ్ ను నియమించటం, ఆయన క్వారంటైన్ సరిహద్దులు దాటుకుని వచ్చిమరీ బాధ్యతలు స్వీకరించటం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ ఇష్యూ కూడా ఇప్పుడు కోర్టుపరిధిలోనే ఉంది. ఇలా ఓవైపు విపక్షాలు వాటి అనుకూల మీడియా, మరోవైపు కోర్టుల చివాట్లు, కార్యరూపం దాల్చని తన ఆలోచనలు..ఇంకోవైపు ముందరకాళ్లకు బంధంలా కరోనా సమస్య..ఇవన్నీ వెరసి జగన్ ఫ్రస్ట్రేషన్ ను పీక్స్ లోకి తీసుకెళ్తున్నాయి.

దీంతో ఎవరైతే తననీ, తన ప్రభుత్వాన్నీ టార్గెట్ చేస్తున్నారో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి కూడా సిద్ధమవ్వండని తన టీమ్ కు జగన్ ఆదేశాలిస్తున్నారట. ఈ మేరకు ప్రభుత్వం, ఎల్లో మీడియా శిబిరంలో వ్యక్తులుగా భావించే కొందరిని అరెస్టు చేయొచ్చని కూడా తెలుస్తోంది. మరి ఇక్కడతో ఆయన ఆగుతారా…? లేదా ఇంకో అడుగు ముందుకేస్తారా..? అన్న సందేహాలు కూడా మీకు వచ్చి ఉంటాయి. మరి వీటన్నింటినీ దాటుకుని జగన్ ముందుకు ఎలా వెళ్తారన్న చికాకు కూడా వచ్చిందా ఏంటి కొంపదీసి..? బాబోయ్, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందంటారు కదా..చూద్దాం ఏం జరుగుతుందో..

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...