Switch to English

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ఎన్.టి.ఆర్ స్పెషల్ క్వాలిటీని మ్యాచ్ చేసే వాళ్ళు లేరు- ఈషా రెబ్బ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగమ్మాయిలు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోలేరు అనే వారు ముక్కన వేలేసుకునేలా చేసిన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఈషా రెబ్బ. ‘అంతకముందు ఆ తరువాత’ సినిమా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఈ ఏడాది తమిళం, కన్నడలో కూడా అరంగేట్రం చేయనున్న ఈషా రెబ్బతో మేము ప్రత్యేకంగా కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీకోసం..

ఈ కరోనా క్వారంటైన్ టైంలో ఏం మిస్ అవుతున్నారు? అలాగే లాక్ డౌన్ ఎత్తేయగానే చేయాలనుకుంటున్న మొదటి పనేంటి?

కచ్చితంగా ఫ్రెండ్స్ ని బాగా మిస్ అవుతున్నాను. లాక్ డౌన్ ఎత్తేయగానే నా బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి లాంగ్ డ్రైవ్ వెళదామని ఫిక్స్ అయ్యాను. చెప్పాలంటే ఈ క్వారంటైన్ వలన అమ్మ నాన్నలతో ఎక్కువ గడుపుతున్నాను. మూవీస్ చూస్తున్నా, కుక్ చేస్తున్నా, నా పెట్స్ తో ఆడుకుంటున్నా అండ్ రోజూ జిమ్ చేస్తున్నాను. గతంలో మా సిస్టర్స్ తో మాట్లాడటానికి టైం ఉండేది కాదు కానీ ఇప్పుడు రోజుకి రెండు మూడు సార్లు ఫోన్ లో టచ్ లో ఉంటున్నాం.

క్వారంటైన్ అయిపోగానే వెంటనే వెళ్లి ఏం కొనాలనుకుంటున్నారు?

చెప్పాలంటే, కొనాలి అనుకున్నవి ఏంలేవు. కానీ ఈ లాక్ డౌన్ టైంలో బేకింగ్ సోడా దొరకట్లేదండి.. నవ్వుతూ.. అందరూ యమ్మీ యమ్మీగా కేక్స్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ పెడుతున్నారు. కానీ నేను కేక్ కావాల్సిన వస్తువుల కోసం వెళితే బేకింగ్ సోడా దొరకట్లేదు, నేను కేక్స్ చేయలేకున్నా.

మీ పాత్రల కోసం ఎలా ప్రిపేర్ అవుతారు.? ఆన్ స్పాట్ లో చేసేస్తారా లేక మెథడ్ యాక్టరా.?

నా పాత్రలని అర్థం చేసుకొని, అందులో ఇమిడిపోవడానికి కొంత హోమ్ వర్క్ చేస్తాను. దీని వలన నా ఎక్స్ ప్రెషన్స్ నాచురల్ గా ఉంటాయి. కొన్ని సార్లు ఆన్ సెట్లో కూడా ప్రిపేర్ అయ్యి చేసేస్తుంటా..

మిమ్మల్ని ఎక్కువగా సర్ప్రైజ్ చేసేది ఎవరు?

నా చిన్న చెల్లెలు ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ తో సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది.

మీ కెరీర్లో మీ ఫెవరైట్ సీన్ మరియు మీకు బాగా టఫ్ గా అనిపించిన సీన్ ఏది?

నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకూ నా పేవరైట్ సీన్స్ చాలానే ఉన్నాయి. కానీ స్పెషల్ గా చెప్పాలంటే.. ‘అ’ సినిమా కోసం డైరెక్ట్ర్ ప్రశాంత్ వర్మ చైల్డ్ అబ్యూస్ గురించి వివరిస్తున్నప్పుడు నాకే తెలియకుండా సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయాను, సీన్ లో రియల్ గా ఏడ్చేసాను. అంతలా కనెక్ట్ అయినా సీన్. ఎందుకంటే ఈ చైల్డ్ అబ్యూస్ అనేది చాలా మంది లైఫ్ లో జరుగుతుంది కానీ పాప చెప్పుకోలేరు.

బాగా కష్టపడినా సీన్ కూడా ‘అ’ లోనిదే, నేను లెస్బియన్ పాత్రలో కనిపిస్తాను, అదొక యునిక్ క్యారెక్టర్.. నా ఫ్రెండ్స్ లో కూడా లెస్బియన్స్ ఎవరూ లేకపోవడంతో ఆ పాత్ర పలికించే ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ విషయంలో చాలా అంటే చాలా ప్రిపేర్ అయ్యి చేయాల్సి వచ్చింది.

‘అ’ లో మీ నోస్ రింగ్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంది. ఆ ఐడియా ఎవరిది?

థాంక్స్.. ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ప్రశాంత్ వర్మకే చెందుతుంది. డైలాగ్స్ పరంగా పెద్ద ఉండకపోవచ్చు సో అందుకే మీ పాత్ర చూడగానే గుర్తుండిపోయేలా స్పెషల్ గా డిజైన్ చేసాను అని చెప్పారు. అనుకున్నట్టే అది బాగా రీచ్ అయ్యింది.

అరవింద సమేతకి వస్తే.. తారక్ ని అందరూ సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అంటారు. తారక్ నుంచి ఇలా టచ్ చేస్తే అలా మీకు వచ్చేయాలనుకునే క్వాలిటీ ఏంటి?

నాకు ఎన్.టి.ఆర్ గారి హైపర్ యాక్టివ్ నెస్ కావాలని కోరుకుంటాను.. రియల్ లైఫ్ లో ప్రతి సెకన్ అంత హైపర్ గా ఉండడం చాలా కష్టం. కానీ తారక్ అంట హైపర్ యాక్టివ్ గా ఉండడమే ఆయనలోని యునిక్ క్వాలిటీ.

మీకు నెట్ఫ్లిక్స్ ‘మనీ హీస్ట్’ సీరీస్ బాగా నచ్చిందని చెప్పున్నారు. ఆ సీరీస్ లో మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే మీకు ఈ పాత్ర సెలెక్ట్ చేసుకుంటారు? అలాగే తారక్ కి ఏ పాత్ర సెట్ అవుతుందంటారు.

హాహా అని గట్టిగా నవ్వుతూ.. నా పరంగా అయితే టోక్యో పాత్ర నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎన్.టి.ఆర్ గారికిసరిపోయే పాత్ర మనీ హీస్ట్ లో లేదండి. ఆయన మైండ్ బ్లోయింగ్ టాలెంట్ కి మ్యాచ్ అయ్యే పాత్రని సెపరేట్ గా క్రియేట్ చేయాలి.

తమిళ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.. హీరోయిన్ పాత్రల డిజైనింగ్ విషయంలో అక్కడికీ ఇక్కడికి ఉన్న తేడా ఏంటి?

రెండు ఇండస్ట్రీలకి పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ కంటెంట్ ని నడిపించే హీరోయిన్ పాత్రలున్న సినిమాలు తమిళంలో ఎక్కువ వస్తున్నాయి.

చూస్తుంటే మీకు స్ట్రాంగ్ మైండెడ్ అమ్మాయిలా కనిపిస్తున్నారు. మిమ్మల్ని అలా చేసింది సినిమాలా లేక పుస్తకాలా?

మనం స్ట్రాంగ్ గా ఉండడం అనేది పుస్తకాల నుంచి రాదు, మనం తీసుకునే నిర్ణయాలు, వాటి నుంచి వచ్చే అనుభవాల నుంచి మనం స్ట్రాంగ్ గా తయారవుతాం. అలాగే నా రియల్ లైఫ్ అనుభవాలే నన్ను స్ట్రాంగ్ విమెన్ గా చేశాయి. అలాగే మా అమ్మగారు నాకు స్ఫూర్తి. అమ్మకి కిందపడిపోతున్నా వదలకుండా పోరాడుతుంది. ఆవిడ వల్లే నేను ఇలా ఉన్నాను. సో స్పెషల్ థాంక్స్ తో మై మామ్.

డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఆన్ సెట్స్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ చెప్పండి?

సెట్స్ లో నన్ను ఎంతో కంప్యార్టబుల్ జోన్ లో ఉంచేవారు. చాలా కూల్ పర్సన్, ఎప్పుడూ చిరునవ్వుతో అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు.

మీ సినీ జర్నీలో ప్రౌడ్ గా చెప్పుకునే ఒక్క సినిమా ఏంటి?

నా ప్రతి సినిమా విషయంలో ప్రౌడ్ గా ఫీలవుతాను. ఎందుకంటే ప్రతి సినిమా నేను విని, నాకు నచ్చి నేను సెలక్ట్ చేసినవే. హిట్ లేదా ప్లాప్ అనేది పక్కనపెడితే.. ప్రతిసారి నా పాత్ర క్లిక్ అయ్యింది, అందుకే ఈ స్థాయికి రాగలిగాను. నేను ఎవరినీ, ఏ డిపార్ట్ మెంట్ కి బ్లేమ్ చెయ్యను. నా డెషిషన్స్ ని నేను బలంగా నమ్ముతాను.

మీ పరంగా సక్సెస్ అంటే అర్థం ఏమిటి?

ఇప్పుడు చెప్పినట్లే, హిట్ లేదా ప్లాప్ తో సంబంధం లేదు.. నా పాత్ర అందరికీ నచ్చిందా లేదా అనేదానిలోనే నేను నా సక్సెస్ ని చూస్తాను.

మీ కంఫర్ట్ జోన్ దాటి వెళ్లి లస్ట్ స్టోరీస్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. అదెంతవరకూ నిజం అండ్ లస్ట్ స్టోరీస్ ఎప్పుడు రిలీజ్ కానుంది?

అసలు నేను సెట్లో కంఫర్ట్ జోన్ అంటూ ఏదీ పెట్టుకొని కూర్చొను.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వీలైనంతవరకూ నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా.. ముందుగా లస్ట్ స్టోరీస్ ని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఈ లాక్ డౌన్ వలన పేనులాంన్నీ ఆగిపోయాయి. సో న్యూ రిలీజ్ డేట్ కోసం నేను వెయిటింగ్.

ఇప్పుడు మీరు ఎలాంటి పాత్రలు కోసం ఎదురు చూస్తున్నారు?

‘అ’ సినెమాలో చేసినటువంటి స్ట్రాంగ్ విమెన్ పాత్రలు మరియు లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నాను.

చివరిగా.. ప్రస్తుతం ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారు?

ప్రస్తుతం అయితే ఐ లవ్ మై పెట్స్.. నా పెట్స్ తోనే డీప్ రిలేషన్ షిప్ లో ఉన్నాను.

చివరిగా ముగిస్తూ ఈషా రెబ్బతో ఓ చిన్న రాపిడ్ ఫైర్ లాంటి గేమ్ ఆడాము దానికి తన సమాధానాలు ఇలా ఉన్నాయి.. 

మీరు ఒక ఏంజిల్ అయితే?

ప్రపంచం నుండి ఈ కరోనా వైరస్ ని తీసేస్తాను..

మీరు హీరోయిన్ కాకపోయి ఉంటే?

ఒక బిజినెస్ విమెన్ అయ్యుండేదాన్ని

మీరు ఒక హీరో అయ్యుంటే..

ఇంకా టాలెంటెడ్ అనిపించుకునేదాన్ని

మీరు అమ్మాయి కాకపోయి ఉంటే..

అమ్మాయి కాకపోతే అబ్బాయి..అంతేగా (అంటూ గట్టిగా నవ్వుతుంది)

అంతటితో తనకి థాంక్స్ చెప్పి మా ఇంటర్వ్యూ ని ముగించాం..

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...