Switch to English

అధికార పార్టీల నిర్వాకం.. అధికారులకి శాపం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

అనిల్‌ చంద్రపునేటా, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆర్పీ ఠాకూర్‌, ఏబీ వెంకటేశ్వరరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలా పెద్దదే కన్పిస్తుంది. వీళ్ళంతా రాజకీయ బాధితులు. అవును, అధికారంలో వున్న పార్టీలకు బాధితులు వీళ్ళంతా. ఎవరు అధికారంలో వున్నాసరే.. అధికారుల్ని తమకు అనుకూలంగా ‘వాడుకోవడం’ అనేది సర్వసాధారణమైన వ్యవహారంగా మారిపోయింది.

విధి నిర్వహణలో ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా, ఉన్నతాధికారులు సైతం రాజకీయ ఒత్తిళ్ళకు బలవ్వాల్సిందేనని చెప్పడానికి చాలామంది అధికారులు నిదర్శనంగా కన్పిస్తారు. సీఎస్‌గా పనిచేసిన అనిల్‌ చంద్ర పునేఠా, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్షం వైసీపీ నుంచి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది.. పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆర్పీ ఠాకూర్‌ కూడా అంతే. ఎల్వీ సుబ్రహ్మణ్యంని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎలా వాడుకుని వదిలేసిందో చూశాం. ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వైఎస్‌ జగన్‌ హయాంలో.

ఇప్పుడు, స్థానిక ఎన్నికల వేళ చాలామంది అధికారుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. కొందరు అధికారుల్ని ఎన్నికల విధుల నుంచి తప్పించనున్నారు.. కొందరిపై బదిలీ వేటు పడనుంది. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అదే జరిగింది. స్థానిక ఎన్నికల్ని అత్యంత జుగుప్సాకరంగా మార్చేసిన ఘనతని మాత్రం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు.

విపక్షాలు, అధికారులపై ఆరోపణలు చేసినప్పుడు స్పందించే ఆయా సంఘాలు, ఇప్పుడెందుకు నోరు మెదపడంలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. విపక్షానికి చెందిన ఓ రాజకీయ ప్రముఖుడు, ఓ పోలీస్‌ అధికారిపై విమర్శలు చేస్తే, వెంటనే పోలీస్‌ అధికారుల సంఘం నానా యాగీ చేసింది ఆ మధ్య. ఇప్పుడు పోలీస్‌ ఉన్నతాధికారులపై సస్పెన్షన్‌ వేటు పడుతోంది.. బదిలీ వేటు పడుతోంది.. మరి, ఆ పోలీసు అధికార సంఘం తరఫున నాయకులేరీ.? ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు ఏమైపోతున్నారు.?

ఒక్కటి మాత్రం నిజం.. ఎవరు అధికారంలో వున్నా, అధికారులే బలిపశువులగా మారిపోతున్నారు. రాజకీయ ఒత్తిళ్ళ విషయంలో ఉన్నతాధికారులు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...