Switch to English

ఏపీ సీఎం పవనే: మాయావతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ధీమా వ్యక్తంచేశారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆమె ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలు కూటమిగా కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం ఉదయం మాయావతి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమెకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం అందుకున్నారు. వీరిద్దరూ కలిసి బుధ, గురువారాల్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.

మధ్యాహ్నం విజయవాడలో జరిగే సభలో, గురువారం తిరుపతి, హైదరాబాద్ లలో నిర్వహించే సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కాగా, విశాఖ చేరుకున్న అనంతరం పవన్ తో కలిసి మయావతి విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

అందువల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తగిన న్యాయం జరగలేదని మయావతి అభిప్రాయపడ్డారు. విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కొత్త నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వలలో పడొద్దని ప్రజలకు సూచించారు. పవన్ వంటి యువ నాయకుడు సీఎం అయితే, ప్రజలకు మంచి జరుగుతుందని మయావతి పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో తమ కూటమికి ప్రజలు మద్దతు ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీతోపాటు లోక్ సభ ఎన్నికల్లోనూ తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి గెలుపొంది, పవన్ సీఎం అవుతారని ఆమె జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తన హామీలను నెరవేర్చకపోవడంతో ఆ పార్టీని ప్రజలు ఓడించారని మయావతి పేర్కొన్నారు.

ప్రజలు ఆ ఎన్నికల్లో మార్పు కోసం బీజేపీకి పట్టం కట్టారని, కానీ ఆ పార్టీ కూడా కాంగ్రెస్ బాటలోనే పయనించిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను పాతాళంలోకి పాతిపెట్టేందుకు ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం బయలుదేరిందని పేర్కొన్నారు. బీఎస్పీ నేతృత్వంలోని కూటమి ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

తాము అధికారంలోకి వస్తే ఏ రాష్ట్రం మీదా వివక్ష చూపించబోమని స్పష్టంచేశారు. కాగా, బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రధానిగా చూడాలన్నది తన కల అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఛాయ్ వాలా ప్రధాని కాగా లేనిది, మాయావతి ప్రధాని కావడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. ఒంటరి మహిళగా ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పనిచేస్తుండటం తనకు ఆనందంగా ఉందని పవన్ పేర్కొన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

జనసేన తాలూకా.! ఆంధ్ర ప్రదేశ్‌లో సరికొత్త పొలిటికల్ ట్రెండ్.!

అభిమాన తారల పేర్లను, ఫొటోల్ని తమ వాహనాల మీద చూసుకోవడం అనేది ఎప్పటినుంచో వస్తున్న వ్యవహారమే. రాజకీయాల్లో ఇది కాస్త కొత్త పుంతలు తొక్కుతుండడమూ మామూలే అయిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక...

హైదరాబాద్ లోని NIN లో ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్ కేంద్రంగా ఐసీఎంఆర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్( NIN ) శాశ్వత ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివి తగిన అర్హతలు...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 31 మే 2024

పంచాంగం తేదీ 31- 05-2024, శుక్రవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు. తిథి: బహుళ అష్టమి ఉ.8.39 వరకు తదుపరి నవమి. నక్షత్రం: పూర్వాభాద్ర...

Heatwave: నాగ్ పూర్ లో భగభగలు.. ఏకంగా @56డిగ్రీల ఎండ..!? అయితే..

Heatwave: దేశం మొత్తం ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఆశ్చర్యపరిస్తే.. ఇప్పుడు...

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2 వీరి కాంబోలో తెరకెక్కింది. జూలై 12న...