Switch to English

అఖిలప్రియకు ఝలక్ తప్పదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన అకస్మాత్తుగా వైఎస్సార్ సీపీకి జైకొట్టారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో గంగుల ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.

నంద్యాల ఎంపీ టికెట్ కేటాయిస్తామన్న సీఎం చంద్రబాబు హామీ మేరకు అప్పట్లో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కృషి చేశారు. అయితే, తాజాగా జరిపిన ఎంపీ టికెట్ కేటాయింపులో చంద్రబాబు గంగుల ప్రతాప్ రెడ్డికి మొండిచేయి చూపారు. దీంతో అప్పటినుంచి అసంతృప్తితో ఉన్న ఆయన సరిగ్గా సమయం చూపి బాబుకు షాక్ ఇచ్చారు.

దీంతో మంత్రి అఖిలప్రియకు ఇబ్బందులు తప్పవనే విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియ బరిలోకి దిగగా.. వైఎస్సార్ సీపీ నుంచి గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బిజేంద్రరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు గంగుల కుటుంబం వేర్వేరు పార్టీల్లో ఉండటంతో వారి ఓట్లు చీలిపోవడం ద్వారా తన గెలుపునకు ఢోకా ఉండదని అఖిల భావించారు.

కానీ పోలింగ్ కు వారం రోజుల ముందు జరిగిన ఈ హఠాత్ పరిణామం ఆమెకు మింగుడుపడంలేదని సమాచారం. గంగుల కుటుంబం అంతా ఒక్కటై బిజేంద్ర గెలుపునకు కృషి చేయాలని నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ఇక్కడ సమీకరణాలు మారిపోయాయి. గంగుల కుటుంబానికి స్థానికంగా గట్టి పట్టు ఉండటం, ఎస్వీ మోహన్ రెడ్డి కూడా వైఎస్సార్ సీపీలోకి తిరిగి రావడంతో అఖిల చెమటోడ్చక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

అసలు ఆళ్లగడ్డ పేరు చెప్పగానే భూమా, గంగుల, ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబాలే గుర్తుకొస్తాయి. ఈ మూడు కుటుంబాలకు చెందినవారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ముఖ్యంగా భూమా, గంగుల కుటుంబాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో గంగుల తిమ్మారెడ్డి రెండుసార్లు, ఆయన కుమారుడు గంగుల ప్రతాప్ రెడ్డి మూడు సార్లు, ఎస్వీ సుబ్బారెడ్డి రెండు సార్లు, భూమా శేఖర్ రెడ్డి ఒకసారి, భూమా నాగిరెడ్డి రెండుసార్లు, శోభానాగిరెడ్డి ఐదుసార్లు, అఖిలప్రియ ఒకసారి ఎన్నికయ్యారు.

2014 ఎన్నికల్లో పోలింగ్ కు ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అయినప్పటికీ, పోలింగ్ కొనసాగించగా.. గంగుల ప్రభాకర్ రెడ్డిపై శోభానాగిరెడ్డి విజయం సాధించారు. తర్వాత నిర్వహించి ఉప ఎన్నికల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం తండ్రి నాగిరెడ్డితో కలిసి ఆమె టీడీపీలో చేరారు.

గుండెపోటుతో నాగిరెడ్డి కన్నుమూయడంతో నంద్యాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే, నియోజకవర్గంలో అఖిల అనుసరించిన వైఖరితో చాలామంది సీనియర్లు కినుక వహించారు. అందరినీ కలుపుకునిపోవడంలో ఆమె విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆమెకే చంద్రబాబు టికెట్ ఇచ్చారు.

గంగుల ప్రతాప రెడ్డి ఎలాగూ టీడీపీలోనే ఉన్నారు కాబట్టి, గంగుల కుటుంబం ఓట్లు చీలిపోతాయని, ఫలితంగా తాను గెలుస్తానని అఖిల భావించారు. అంతేకాకుండా ప్రచారంలో ఆమె అమ్మ సెంటిమెంట్ తెరపైకి తెచ్చారు. మీరు వేసే ఓటు తనకు కాదని, శోభమ్మకు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగుల ప్రతాపరెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్ సీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డికి మద్దతు ప్రకటించడంతో అఖిలప్రియ గెలుస్తారా లేదా అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...