Switch to English

భళ్లాలదేవుడికి, కాలకేయుడికి మీరే సాటి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. విమర్శలు, ప్రతివిమర్శలతో పరిస్థితి మొత్తం హాట్ హాట్ గా మారింది. ఓవైపు ఎండ వేడి.. మరోవైపు నేతల విమర్శల వాడి వెరసి రాష్ట్రం సెగలు కక్కుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా విమర్శల తూటాలు సంధించారు. బిజ్జలదేవుడికి మీరే సాటంటూ ధ్వజమెత్తారు.

సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. భారతీయ జనతాపార్టీ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంటే యూటర్న్ బాబు పరిస్థితి బాహుబలి సినిమాలోని భళ్లాలదేవుడి పరిస్థితిలా తయారైందని మోదీ ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదని, కమీషన్ల కోసం ఇష్టానుసారం ఆ ప్రాజెక్టు అంచనాలు పెంచుకుంటూ పోయారని, ఈ పథకాన్ని మనీ ఇచ్చే ఏటీఎంగా మార్చుకుని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ హరిటేజ్ ను కాపాడటం బీజేపీ సంకల్పం కాగా, తన సొంత సంస్థ హెరిటేజ్ ను కాపాడుకోవడం చంద్రబాబు లక్ష్యమని మోదీ విమర్శలు చేశారు.

అనంతరం దీనిపై చంద్రబాబు కూడా అంతే స్థాయిలో స్పందించారు. తాను రాష్ట్రానికి బాహుబలిలా పనిచేస్తానని.. భళ్లాలదేవుడు, బిజ్జలదేవుడు వంటి జగన్, మోదీ బారి నుంచి రాష్ట్రాన్ని రక్షిస్తానని పేర్కొన్నారు. పోలవరం తమకు ఏటీఎం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ జూలైలోగా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చి ఎనీ టైం వాటర్ (ఏటీడబ్ల్యూ)గా మారుస్తానని వ్యాఖ్యానించారు.

అనంతరం ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. ట్విట్టర్లో మోదీపై సెటైర్లు వేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఎత్తేసి దండయాత్ర చేస్తున్న కాలకేయుడుగారూ.. కేంద్రం నుంచి ఒక్క పైనా సహాయం లేకపోయినా ఆంధ్రులు తలెత్తుకుని నిలబడేలా చేసిన బాహుబలి మా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు’’ అని ఓ ట్వీట్ చేశారు.

రూ.54 వేల కోట్లయ్యే పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చి ఇంకా పూర్తిచేయలేదంటున్నారు.. మీకు లెక్కలు రావా? లేక ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే లెక్క లేదా అని ప్రశ్నించారు. గుజరాత్ లో నరమేధం సాగించిన మోదీగానూ.. అరివీర భయంకరులైన మీరు భళ్లాలదేవుడికి సరిసాటి. కాలకేయుడికి మీరే పోటీ అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక ఆంధ్రప్రదేవ్ హెరిటేజ్ ను చూసుకోవడానికి చంద్రబాబు ఉన్నారని, హెరిటేజ్ సంస్థను చూసుకోవడానికి బ్రాహ్మణి, భువనేశ్వరి ఉన్నారని చెప్పారు. మోదీ మాత్రం జగన్ అక్రమాస్తుల హెరిటేజ్ కి చౌకీదార్ గా మారారని లోకేశ్ విమర్శించారు. కాగా, మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లోకేశ్ ప్రచారంలో దూసుకుని వెళ్తున్నారు.

ఈ సందర్భంగా అక్కడి స్వర్ణకారులకు హామీలు ఇచ్చారు. వారికి ప్రత్యేక కార్పొరేషన్ తీసుకొస్తానని, దుబాయ్ తరహాలో మంగళగిరిలో గోల్డ్ మార్కెట్ ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. అలాగే రూ.10వేల కోట్లతో ఏర్పాటుచేయబోయే బీసీ అభివృద్ధి బ్యాంకు ద్వారా స్వర్ణకారులకు రుణాలిప్పిస్తానని హామీ ఇచ్చారు.

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....