Switch to English

సినిమాలపై మాట తప్పిన పవన్‌.. పెద్ద నేరమేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘ఇకపై పూర్తి జీవితం ప్రజా సేవకే వెచ్చిస్తాను.. రాజకీయాల్లోనే కొనసాగుతాను తప్ప, సినిమాల గురించి ఆలోచించను..’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన మాట వాస్తవం. దాన్ని ప్రస్తావిస్తూ, పవన్‌ కళ్యాణ్‌పై కుప్పలు తెప్పలుగా విమర్శలు వస్తుండడమూ వాస్తవం. నిజమే, పవన్‌ కళ్యాణ్‌ మాట తప్పారు.. సినిమాల్లో నటించబోనని ప్రజల ముందు వాగ్దానం చేసి, మాట తప్పి.. మళ్ళీ సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇంత పెద్ద నేరం చేసిన పవన్‌ కళ్యాణ్‌ని శిక్షించాల్సిందేనా.? ఈ ప్రశ్న చుట్టూ చాలా పెద్ద చర్చే జరుగుతోంది.

అయినా, పవన్‌ కళ్యాణ్‌ విషయంలోనే ఇంత చర్చ ఎందుకు జరగాలి.? అయినా, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో నటించడం వల్ల ఎవరికి నష్టం.? రెండు చోట్లా ఓడిపోయిన పవన్‌ కళ్యాణ్‌, సినిమాల్లో కొనసాగడం వల్ల ఏ నియోజకవర్గంలో అయినా ప్రజలు ఇబ్బంది పడతారా.? ఛాన్సే లేదు. పైగా, సినిమాల్లో నటించడం ద్వారా జనసేన పార్టీకి పవన్‌ కళ్యాణ్‌ కాస్తో కూస్తో ఊపు, ఉత్సాహం తెచ్చే అవకాశాలున్నాయి.

కానీ, పవన్‌ కళ్యాణ్‌ మాట తప్పాడు కాబట్టి.. తప్పుని సరిదిద్దుకునే క్రమంలో సినిమాలకి గుడ్‌ బై చెప్పాల్సిందేనన్న చిత్ర విచిత్రమైన డిమాండ్లు తెరపైకి వస్తుండడం గమనార్హం. ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మాట తప్పొచ్చు.. అది ప్రజలకు నష్టం కలిగించే విషయమే అయినా.. ఆ పార్టీ నిస్సిగ్గుగా రాజకీయాలు చేయొచ్చు.. ఆయా పార్టీలకు చెందిన నేతలు తమ తమ సంపాదనా వ్యాపకాల్లో నిమగ్నమైపోవచ్చు. కానీ, పవన్‌ కళ్యాణ్‌ మాత్రమే మాట మీద నిలబడిపోవాలి.

సినిమాల్లో నటించడం.. అంటే ఎవరి పొట్టా కొట్టే వ్యవహారమైతే కాదు కదా. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియాలో జనసైనికులు ప్రస్తావిస్తున్నారు. ‘పవన్‌ కళ్యాణ్‌ మందిని వెంటేసుకుని రాజకీయాల్లోకి రాలేదు. తన సొంత బలాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన.. ఎవరూ తన వెంట లేకపోయినా.. 30 ఏళ్ళు జనసేన పార్టీని నడపగల సత్తా వుందనే నమ్మకంతో వున్న వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. జనసేన పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా నష్టం వుండదు’ అని జనసేన పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో ఒకరైన శివశంకర్‌ అభిప్రాయపడ్డారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...