Switch to English

శివ కందుకూరి ‘చూసీ చూడంగానే’ మూవీ రివ్యూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

నటీనటులు: శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీషన్..
నిర్మాత: రాజ్ కందుకూరి
దర్శకత్వం: శేష సింధు రావు
సినిమాటోగ్రఫీ: వేదరామన్
మ్యూజిక్: గోపి సుందర్
ఎడిటర్‌: రవితేజ గిరజాల
రన్ టైం: 1 గంట 53 నిముషాలు
విడుదల తేదీ: జనవరి 31, 2020

‘పెళ్లి చూపులు’, ‘మెంటల్ మదిలో’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి ఈ సారి తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. ఎప్పటిలానే రాజ్ కందుకూరి ఈ సినిమా ద్వారా నూతన దర్శకురాలైన శేష సింధు రావు ని పరిచయం చేశారు. పలువురు టాలెంటెడ్ టెక్నీషియన్స్ కి లైఫ్ ఇచ్చిన రాజ్ కందుకూరి తన కుమారుడు శివ కందుకూరికి హిట్ ఇచ్చాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ: అనగనగా ఓ కుర్రాడు. ఆ అబ్బాయి పేరు సిద్ధు (శివ కందుకూరి). తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అబ్బాయిల్లాగా…. ఎన్నో తెలుగు సినిమాల్లో ప్రేక్షకులు చూసిన హీరోల్లాగా ఇంటర్ లో, ఎంసెట్ లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లి (పవిత్రా లోకేష్) దగ్గర తిట్లు తింటాడు. ఇష్టం లేకపోయినప్పటికీ ఇంట్లో అమ్మ బలవంతం చేసిందని ఇంజినీరింగ్ జయినవుతాడు. మళ్లీ మన తెలుగు సినిమా హీరోల్లాగా అక్కడ ఒక అమ్మాయి ఐశ్వర్య (మాళవిక సతీషన్)తో ప్రేమలో పడతాడు. ఎన్నో తెలుగు సినిమాల్లో చూసినట్టు ప్రేమలో పడగానే అమ్మాయికి నచ్చిన బట్టలు వేసుకుంటాడు. అమ్మాయి అడిగిందని గడ్డం పెంచుతాడు. అమ్మాయికి ఇష్టం వచ్చిన పనులు చేస్తాడు. స్నేహితులకు దూరం అవుతాడు. అయినా… అమ్మాయి బ్రేకప్ చెబుతుంది. ఏ అమ్మాయి అంత సిల్లీ రీజన్ చెప్పదేమో? ‘ఇంట్లో మా నాన్నకు విషయం తెలిసింది సిద్దు. వర్కవుట్ అవ్వదు’ అని వెళ్లిపోతుంది. మూడేళ్ల తర్వాత… హీరో వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అవుతాడు. మరో అమ్మాయి శ్రుతి (వర్ష బొల్లమ్మ) పరిచయం అవుతుంది. కట్ చేస్తే… ఆ అమ్మాయిది కూడా సిద్ధు కాలేజీయే. ఐశ్వర్యకు స్నేహితురాలే. ఇవేవీ సిద్ధుకి తెలియవు. అతడు కాలేజీలో ఐశ్వర్యను ప్రేమిస్తే, ‘ప్రేమకథా చిత్రమ్’లో నందితా శ్వేతలా హీరో వెనుకే తిరుగుతూ సిద్ధూను ప్రేమిస్తుంది శ్రుతి. అతడు ఐశ్వర్యను ప్రేమిస్తున్నాడని తెలిసి తన ప్రేమను చెప్పడం మానేస్తుంది. మూడేళ్ల తర్వాత ఇవన్నీ సిద్ధుకి తెలుస్తాయి. ఆ ప్రభావమో.. మరొకటో… శ్రుతిని సిద్ధు ప్రేమిస్తాడు. శృతికి కూడా సిద్ధు మీద ఫీలింగ్స్ కలుగుతాయి. బట్, రైటర్ గా త్రివిక్రమ్ రాసిన సినిమాల్లో హీరోయిన్ లాగా మరో అబ్బాయికి ఎంగేజ్మెంట్ కి శ్రుతి రెడీ అవుతుంది. రొటీన్ తెలుగు సినిమా టైపు హ్యాపీ ఎండింగ్ ఉంటుందని ఈపాటికి ఈ రివ్యూ చదువుతున్న మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది.

తెర మీద స్టార్స్..

ఏమాత్రం కొత్తదనం లేకుండా పరమ రొటీన్ కథ, సన్నివేశాలతో సాగిన ఈ సినిమాలో కాస్తో కూస్తో ఆకట్టుకున్నది ఎవరైనా ఉన్నారంటే వర్ష బొల్లమ్మ ఒక్కరే. అదీ సెకండాఫ్ లో మాత్రమే. ఫస్టాఫ్ లో ఆ అమ్మాయి చేత కూడా కొన్ని చెత్త సన్నివేశాలు చేయించారు దర్శకురాలు శేష సింధు రావ్. సెకండాఫ్ లోనూ రొటీన్ సీన్స్ ఉన్నప్పటికీ… కొంతవరకూ తన నటనతో వర్ష బొల్లమ్మ గట్టెక్కించింది. ఆ అమ్మాయి బాధ పడుతుంటే… ప్రేక్షకులు కొంతవరకు ‘అయ్యో పాపం!’ అనుకుంటారు. వర్ష బొల్లమ్మ కళ్లు చాలా ఎక్స్‌ప్రెస్సివ్. అవి సినిమాకు, సన్నివేశాలకు ప్లస్ అయ్యాయి. వర్ష తర్వాత ఆకట్టుకున్నది కమెడియన్ వెంకటేష్ కాకుమాను. సినిమాలో అక్కడక్కడా ఎడారిలో వర్షం పడినట్టు నవ్వులు పడ్డాయంటే అది వెంకటేష్ కాకుమాను వల్లే. అతడి కామెడీ టైమింగ్ పర్వాలేదు. శివ కందుకూరి ఓకే అనిపించుకుంటాడు. యాక్టర్ గా ఇంప్రెసివ్ చేసిన సీన్స్ ఏం లేవు. అవసరాల శ్రీనివాస్ గెస్ట్ రోల్ చేశాడు. అదేమంత ఎఫెక్టివ్ గా లేదు. ఆ క్యారెక్టర్ కి కథలో ఇంపార్టెన్స్ కూడా లేదు. హీరో మదర్ అండ్ ఫాదర్ గా పవిత్రా లోకేష్, అనీష్ కురువిల్ల కనిపించచారు. వాళ్ల క్యారెక్టర్స్ రొటీన్ కావడంతో రొటీన్ సినిమాలో ఎలా నటించాలో అలా నటించారు. మరో హీరోయిన్ మాళవికా సతీషన్ ఒక పాటకు, రెండు మూడు సన్నివేశాల్లో కనిపిస్తుందంతే.

తెర వెనుక టాలెంట్..

ఆఫ్ ది స్క్రీన్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ ఒక్కరే అని చెప్పుకోవాలి. మెలోడీ సాంగ్స్ బావున్నాయి. కొన్ని లిరిక్స్ కూడా! సినిమాటోగ్రాఫర్స్ గా కొత్తవాళ్లతో తీసిన సినిమాకు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చిన రవితేజ గిరిజాల, వేదరమణ్… ఎడిటింగ్ విషయంలో ఎఫెక్టివ్ అవుట్ పుట్ ఇవ్వలేకపోయారు. సినిమాలో ల్యాగ్ సీన్స్ చాలా ఉన్నాయి. సుకుమార్, క్రిష్ దగ్గర పని చేసిన శేష సింధు రావ్ దర్శకురాలిగా తొలి సినిమాకు ఫ్రెష్ ఫీల్ ఉన్న కథ రాసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. రొటీన్ కథను ఫ్రెష్ గానూ చెప్పలేకపోయారు.

విజిల్ మోమెంట్స్:

– భయ్యా… పెద్దగా ఏం లేవు.
– చెప్పుకోవాలంటే… మిడ్ నైట్ హీరో, తర్వాత కమెడియన్ ఫ్లాట్ కి వెళ్లి హీరోయిన్ డిస్టర్బ్ చేసే సీన్

బోరింగ్ మోమెంట్స్:

– చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కొన్ని మాత్రమే చెప్పాలంటే…
– పాటలు తప్ప ఫస్టాఫ్ అంతా
– నో ఎమోషన్స్
– క్లైమాక్స్

విశ్లేషణ: రొటీన్ కథతో రొటీన్ సినిమా ఎలా తీయాలో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘చూసీ చూడంగానే’. కొత్త దర్శకురాలు తీసిందని, సినిమాలో కొత్తదనం ఉంటుందని థియేటర్ కి వెళితే… చప్పగా చల్లారిన పిజ్జా, మెత్తబడిన పాప్ కార్న్ తిన్నట్టు ఉంటుంది. సినిమాలో కొత్త కథ లేదు. కొత్తగానూ తీయలేదు. షార్ట్ ఫిలింకి ఎక్కువ, ఫీచర్ ఫిలింకి తక్కువ అన్నట్టు ఉంది. లవ్ సీన్స్ కూడా కొత్తగా లేవు. చాకోలెట్స్ బదులు అబ్బాయిని అమ్మాయి విస్కీ అడగడం, బర్త్ డే కి కేక్ రెడీ చేయడం కొత్తదనం అని దర్శకురాలు, నిర్మాత ఫీల్ అయితే ఎవరూ ఏమీ చేయలేరు.

ఇంటర్వల్ మోమెంట్: ఇదో ట్విస్టా? అఘోరించాం లే! సెకండాఫ్ ఎలా ఉంటోందో??

ఎండ్ మోమెంట్: ఏదో తీశారంటే సినిమా తీశారంతే! పాటలు ఓకే. బిలో ఏవరేజ్ బొమ్మ

చూడాలా? వద్దా?: ఎందుకు భయ్యా? టైమ్ వెస్ట్!

బాక్స్ ఆఫీస్ రేంజ్: అందరూ కొత్తవాళ్లు చేసిన సినిమా కాబట్టి ఓపెనింగ్స్ వీక్ గా ఉండొచ్చు. మౌత్ టాక్ మీద సినిమా కలెక్షన్స్ డిపెండ్ అవుతాయి.

గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.

తెలుగుబుల్లెటిన్ రేటింగ్: 1.5/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...
నటీనటులు: శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవిక సతీషన్.. నిర్మాత: రాజ్ కందుకూరి దర్శకత్వం: శేష సింధు రావు సినిమాటోగ్రఫీ: వేదరామన్ మ్యూజిక్: గోపి సుందర్ ఎడిటర్‌: రవితేజ గిరజాల రన్ టైం: 1 గంట 53 నిముషాలు విడుదల తేదీ: జనవరి 31, 2020 'పెళ్లి చూపులు', 'మెంటల్ మదిలో' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి ఈ సారి తన కుమారుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం...శివ కందుకూరి 'చూసీ చూడంగానే' మూవీ రివ్యూ