Switch to English

2019లో ‘బిగ్‌’ సంచలనం.. వీళ్ళిద్దరే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ రియాల్టీ షో మూడో సీజన్‌ తెలుగులో చాలా గందరగోళం నడుమ ప్రారంభమయ్యింది. ‘అవకాశాల పేరుతో లైంగిక వేధింపులు..’ అనే ఆరోపణలు కూడా ఈ షో ప్రారంభానికి ముందు వెల్లువెత్తాయి. కింగ్‌ అక్కినేని నాగార్జున ఈ రియాల్టీ షోకి హోస్ట్‌గా వ్యవహరించడంపైనా నిరసనలు పోటెత్తాయి. ఓ దశలో నాగార్జున, ఈ షో నుంచి తప్పుకుంటాడనే ప్రచారం జరిగింది. వ్యవహారం కోర్టుకెళ్ళినా.. వివాదం సద్దుమణిగింది. రియాల్టీ షో ప్రారంభమయ్యింది. అందరి అంచనాలూ తల్లకిందులు చేస్తూ షో సాగింది.

మొదటి, రెండు సీజన్లతో పోల్చితే వివాదాలే కాదు, రొమాంటిక్‌ ట్రాక్‌ ఒకటి ఈసారి మరింత హైలైట్‌ అయ్యింది. ఆ రొమాంటిక్‌ ట్రాక్‌ పునర్నవి భూపాలం – రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అస్సలేమాత్రం పస లేకుండా సాగుతున్న బిగ్‌బాస్‌ రియాల్టీ షో తెలుగు మూడో సీజన్‌కి సంబంధించి ఈ ఒక్క ట్రాక్‌ మాత్రమే కాస్తో కూస్తో వీక్షకులకు ఊరటనిచ్చిందనడం అతిశయోక్తి కాదేమో.

ఓ దశలో ఈ ఇద్దరికీ బిగ్‌హౌస్‌లోనే పెళ్ళి చేసేస్తారేమో.. అనేంతగా సన్నివేశాలు నడిచాయి. అయితే, ఇద్దరి మధ్యా అనూహ్యంగా బ్రేకప్‌ తాలూకు ఛాయలు కన్పించాయి. పాత స్నేహితురాలు శ్రీముఖితో రాహుల్‌ మళ్ళీ కనెక్ట్‌ అయ్యాడు. ఎలాగైతేనేం, రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌ అయ్యాడు.. మళ్ళీ శ్రీముఖితో విభేదాలంటూ రచ్చ తెరపైకొచ్చింది. పునర్నవి – రాహుల్‌, రియాల్టీ షో బయట కూడా తమ ‘కెమిస్ట్రీ’ వర్కవుట్‌ చేస్తున్నారు. ‘అబ్బే, మా మధ్య లవ్‌ లేదు.. కేవలం స్నేహం మాత్రమే’ అని ఇప్పటికీ చెబుతున్నారు. ‘వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే వారికి పెళ్ళి చేయడానికి మేం రెడీ..’ అంటూ ఇరు కుటుంబాలూ ప్రకటన చేశాయన్న వార్తలూ తెరపైకొచ్చాయి.

బిగ్‌బాస్‌3 తెలుగు ముగిసి రోజులు గడుస్తున్నా, ఇప్పటికీ పునర్నవి – రాహుల్‌ చుట్టూ ఏ చిన్న గాసిప్‌ పుట్టుకొచ్చినా.. అది ట్రెండింగ్‌ అవుతోంది. ఇదిలా వుంటే, రాహుల్‌ సిప్లిగంజ్‌ తన పాటలతో బిజీ అయిపోతే, పునర్నవి కూడా తన సినిమాలతో బిజీ అవుతుండడం గమనార్హం. ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించే అవకాశమూ లేకపోలేదు. ఏదిఏమైనా, 2019కి సంబంధించి ‘బిగ్‌’ సంచలనం అంటే రాహుల్‌ – పునరవి అని నిస్సందేహంగా చెప్పొచ్చు. రాహుల్‌, సీజన్‌ విన్నర్‌ అయినా.. అందులో భాగం ఖచ్చితంగా పునర్నవికీ దక్కుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...