Switch to English

స్పెషల్ ఇంటర్వ్యూ: రాజమౌళి భయపడితే.. కార్తికేయ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు – శ్రీ సింహా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow
తెలుగులో డిసెంబర్ 25న ఒక చిన్న సినిమా ‘మత్తు వదలరా’ విడుదలవుతోంది. హీరో, దర్శకుడు, సంగీత దర్శకుడు, కీలక నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులందరూ దాదాపుగా కొత్తవారు. ‘మత్తు వదలరా’ హీరో పేరు శ్రీసింహా. చేసింది చిన్న సినిమా కావొచ్చు. కానీ, అతడి నేపథ్యం పెద్దది. శ్రీసింహా బాబాయ్ దర్శక ధీరుడు రాజమౌళి. తండ్రి సంగీత ధీరుడు కీరవాణి. ఈ సినిమాకు సంగీత దర్శకుడు శ్రీసింహా అన్నయ్య, కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ. కొన్ని గంటల్లో సినిమా విడుదల కానున్న తరుణంలో శ్రీసింహాతో ఇంటర్వ్యూ…

– మీ ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరో మీరు. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటినుండి ఉంది?

చిన్నప్పటి నుండి నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇంట్లో వాళ్లకూ ఈ విషయం తెలుసు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పటి నుండి యాక్టింగ్ ఇంట్రెస్ట్. అయితే, ఏదో ఒక పని చేయాలని డిగ్రీ తర్వాత ‘రంగస్థలం’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశా. ఆ సినిమా మొదలు కావడానికి ముందు… మూడేళ్ళ క్రితం రితేష్ రానా ‘మత్తు వదలరా’ కథతో వచ్చాడు. అయితే కథలో కరెక్షన్స్ చేసుకు వస్తానని చెప్పాడు. ‘రంగస్థలం’ పూర్తయ్యాక మూడు నెలలు యాక్టింగ్ లో ట్రయినింగ్ తీసుకుని ‘మత్తు వదలరా’ చేశాం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయాలి. వాళ్లకు పెద్ద ప్రాజెక్ట్స్ ఉండడంతో మా చెర్రీ మామ బ్యానర్ క్లాప్ ఎంటర్టైన్మెంట్ లో చేశాం. ‘రంగస్థలం’కి పని చేసేటప్పుడు నాపై మైత్రీ వాళ్లకు నమ్మకం కలిగింది. సినిమా చేసే ముందు డెమో వీడియో షూట్ చేసి చూపించాం. దాంతో సినిమాకు ప్రజెంట్ చేశారు.
– చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏయే సినిమాలు చేశారు?

‘యమ దొంగ’లో ఎన్టీఆర్ చైల్డ్ క్యారెక్టర్ నేనే చేశా. ‘మర్యాద రామన్న’లో కూడా ఒక క్యారెక్టర్ చేశా.
– యాక్టర్ అవుతానని అన్నప్పుడు, యాక్టింగ్ లో ట్రైనింగ్ క్లాసులకు వెళుతున్నప్పుడు రాజమౌళి, కీరవాణి ఇచ్చిన సలహాలు ఏంటి?

యాక్టింగ్ పరంగా ఇవ్వలేదు. కానీ, వాళ్ళ ప్రభావం నాపై ఉంటుంది. వాళ్ళు పనిచేసే విధానం చూసి నేర్చుకున్నది ఎక్కువ. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందనేది చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఇండస్ట్రీ గురించి కొన్ని సలహాలు ఇచ్చారు.

– హీరోగా చేస్తున్నాని రాజమౌళికి చెప్పినప్పుడు ఏమన్నారు?

ఆయన కొంచెం భయపడ్డారు. ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే యాక్టింగ్ అనేసరికి ఎవరికైనా భయం ఉంటుంది. సర్వైవ్ అవుతాడా, లేదా అని. అలాగని, ఎప్పుడూ నన్ను ఆపలేదు. రాజమౌళిగారితో పాటు ఇంట్లో అందరు సపోర్ట్ చేశారు. కష్టపడమని, చేసుకోమని చెప్పారు.

– రాజమౌళి కుమారుడు, మీ అన్నయ్య కార్తికేయ ఏమన్నారు?

మా పేరెంట్స్ కి భయాలు ఉన్నా… అన్నయ్య కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఫ్యూచర్ లో తన బ్యానర్ లో నేను, కాలభైరవ అన్నయ్య కలిసి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

–  మీ నేపథ్యానికి పెద్ద కమర్షియల్ సినిమా చేయవచ్చు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేయడానికి రీజన్ ఏంటి?

సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉండక్కర్లేదు. లవ్వు, ఫైట్లు, సాంగులు ఉన్న సినిమాతో లాంచ్ అయితే పెద్ద స్టార్ అవుతాడని నమ్మకం లేదు. నా నమ్మకం ఏంటంటే… స్టోరీ బావుండాలి. స్టోరీ బావుంటే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ప్రేక్షకులు ఈమధ్య డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు.

– ‘మత్తు వదలరా’ అంటున్నారు. మత్తు అంటే ఏంటి?

సినిమాలో రకరకాలుగా ఉంటుంది. హీరోకి నిద్రమత్తు. పల్లెటూరు నుండి వచ్చి సిటీలో డెలివరీ బాయ్ గా వర్క్ చేస్తూ చాలీచాలని జీతంతో జీవితాన్ని వెళ్లదీసే క్యారెక్టర్. ఒక సమస్యలో ఇరుక్కుని ఎలా బయటకు వస్తాడనేది కథ. కథలో 70శాతం ఒక్క రోజులో జరుగుతుంది. మొత్తం కథ రెండుమూడు రోజుల్లో జరుగుతుంది. థ్రిల్లర్ కాబట్టి ఎక్కడికి అక్కడ ఒక్కో సస్పెన్స్ పాయింట్ రివీల్ అవుతుంది.

– మీ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి రీరికార్డింగ్ విషయంలో ఎలా కావాలో చెప్పారా? సలహాలు ఇచ్చారా?

మా టీమ్ లో లాస్ట్ ఎంటర్ అయింది భైరవ అన్న. తనతో కలిసి పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు. సినిమాలో పాటలు లేవు. ప్రొఫెషనల్ గా తనతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భాలు పెద్దగా రాలేదు. అన్న రీ రికార్డింగ్ స్టార్ట్ చూసేటప్పటికి నేను డబ్బింగ్ స్టార్ట్ చేశా. తమ్ముడిగా నా అభిప్రాయం చెప్పాను తప్ప హీరోగా ఏమీ చెప్పలేదు.

– ఇద్దరు ఒకే  సినిమాతో ఇంట్రడ్యూస్ కావడం ఎలా ఉంది?

నేను యాక్టర్ కావాలనేది నా కల. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది భైరవ అన్న కల. ఇద్దరూ ఒకే సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతామని ఎప్పుడు అనుకోలేదు. అలా ఆలోచించలేదు. ఇద్దరం కలిసి చేయడం కుదిరినందుకు చాలా హ్యాపీ. ఇంట్లోవాళ్ళు కూడా హ్యాపీ.

– నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

కొన్ని కథలు విన్నాను. కానీ, ఏది కన్ఫర్మ్ చేయలేదు. ఈ సినిమా విడుదలైన తర్వాత రిజల్ట్ చూసి ఏం చేయాలో డిసైడ్ అవుతా.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...