Switch to English

150 డేస్‌.. వైసీపీలో ఏం జరుగుతోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మరో పది రోజుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 150 రోజుల పాలనను పూర్తి చేసుకోబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, సంక్షేమ పథకాల మీద ఫోకస్‌ పెట్టారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. అభివృద్ధి సంగతి పక్కన పెట్టి.. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా కుప్పలు తెప్పలుగా సంక్షేమ పథకాల్ని ప్రకటించేస్తున్నారు.. కొన్నిటిని అమల్లోకి తీసుకొచ్చేశారు కూడా. ఇంకా అమల్లోకి రావాల్సినవి చాలానే వున్నాయి. కానీ, వాటి కోసం క్యాలెండర్‌ ఖరారైపోయింది దాదాపుగా.

ఇదిలా వుంటే, ఐదు నెలలు తిరగకుండానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయాయంటూ ఓ గాసిప్‌ ప్రచారంలోకి వచ్చింది. ప్రధానంగా ‘రెడ్డి’ సామాజిక వర్గం తాలూకు పెత్తనం, వైసీపీలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలకు ఇబ్బందికరంగా మారుతోందట. ‘పైకి సామాజిక న్యాయం.. లోపల మాత్రం సొంత సామాజిక వర్గ న్యాయం.. అన్నట్లుంది పరిస్థితి..’ అంటూ పలువురు సీనియర్‌ నేతలు, తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ప్రకటించిన అధికార ప్రతినిథుల జాబితా చూసినా, తాజాగా వెల్లడయిన ఇన్‌ఛార్జి మంత్రుల లిస్ట్‌ చూసినా.. రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. నామినేటెడ్‌ పోస్టుల్లో అన్ని వర్గాలకూ ప్రాతినిథ్యం కల్పిస్తున్నట్లు పైకి ప్రభుత్వం ఎంతలా చెబుతున్నా, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు ఇంకోలా కనిపిస్తున్నాయి. కీలకమైన పోస్టులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే దక్కుతున్నాయి.

ఒకవేళ ఇతర సామాజిక వర్గాలకు ఉన్నత పదవులు దక్కినా, వాటిపై పెత్తనం చేసేందుకు ‘షాడో’ నేతలు అనధికారికంగా నియమితులలవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కీ అర్థమవుతున్నాయి. ఈ క్రమంలోనే ‘ఇన్‌ఛార్జి మంత్రుల మార్పు’ అంశం తెరపైకొచ్చింది.

అదే సమయంలో, ‘పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించొద్దు..’ అంటూ పదే పదే మంత్రుల్నీ, ముఖ్య నేతల్నీ వైఎస్‌ జగన్‌ మందలిస్తుండడం గమనార్హం. అంతలా జగన్‌ని చాలామంది నేతలు ఇరిటేట్‌ చేస్తున్నారనీ, వారిని అదుపు చేయలేని స్థితిలోకి వైఎస్‌ జగన్‌ నెట్టివేయబడ్తున్నారనీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...