Switch to English

బాబుకు బీజేపీ దారులు మూసుకుపోయినట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కేంద్రంలోని బీజేపీకి మళ్లీ దగ్గర కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారా? ఇందుకు సంబంధించి తెర వెనుక కసరత్తు షురూ చేశారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర అంతర్మథనం చెందుతున్న చంద్రబాబు.. బీజేపీతో విభేదించి బయటకు రావడం తీవ్రమైన తప్పిదమని బహిరంగంగానే అంగీకరించారు. 2014 ఎన్నికల్ల తరహాలో బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లి ఉంటే ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకుని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఓ దశలో ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పనిలో పనిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పైనా విమర్శలు చేశారు. తిరుపతి వచ్చిన షాను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేలా చేశారు. ఇవన్నీ ఏపీలో రాజకీయంగా మైలేజీ పొందడానికే చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు సానుకూలంగా రాలేదు. దీంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. పార్టీ నుంచి వలసలు పెరిగిపోయాయి.

మరోవైపు ఏ క్షణమైనా నెత్తిన పిడుగులా పడటానికి కేసులు కాచుకుని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో మళ్లీ కలవాలని బాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం అందుబాటులో ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయన్నది అంతుబట్టకుండా ఉంది.

ఒకప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని ఉరి తీయాలంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. అనంతరం అదే మోదీతో కలిసి 2014లో ఎన్నికలకు వెళ్లారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత మోదీని రాజకీయ ఉగ్రవాదిగా అభివర్ణించారు. కమలనాథులు ఈ విషయాలను అంత తేలిగ్గా ఎందుకు మరచిపోతారు? పైగా చంద్రబాబుకు శాశ్వతంగా తలుపులు మూసేశామని గత ఎన్నకల సమయంలోనే అమిత్ షా స్పష్టంచేశారు.

ప్రస్తుతం వారికి ఉన్న మెజార్టీ నేపథ్యంలో అసలు ఎవరి అవసరమూ కమలనాథులకు లేదు. తాజాగా ఇదే విషయాన్ని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవ్ దార్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుతో తాము కలిసే ప్రసక్తే లేదన్నారు. బోలెడు అవినీతి కేసుల్లో బాబు పీకలదాకా కూరుకపోయారని, ఆయనతో జట్టు కట్టాల్సిన అవసరం లేదని సునీల్ ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో బాబు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...