Switch to English

సుజనా లక్ష్యంగా జగన్ స్కెచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఆయన్ను ఇరికించేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు అండ ఉన్న సుజనాను దెబ్బతీయడం సాధ్యమయ్యే పనేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోనూ సుజనా క్రియాశీలంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు పలు అంశాలపై వైఎస్సార్ సీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పోలవరం, అమరావతి నిర్మాణాలు ఆగిపోవడం, రివర్స్ టెండరింగ్ ప్రక్రియ చేపట్టడం వంటి అంశాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ సైతం ఆయనపై ఎదురుదాడి చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో సుజనా చౌదరి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించింది. దీంతో తనకు అమరావతిలో భూమి ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ, సుజనాల మధ్య మాటల యుద్దం జరిగింది. ఈ క్రమంలో ఇదీ సుజనా, ఆయన బినామీల భూముల జాబితా అంటూ కొన్ని వివరాలు బయటపెట్టారు.

తనకు అమరావతిలో ఎలాంటి భూములు లేవని, తన కుటుంబ సభ్యులకు ఉన్నా.. అవి రాష్ట్ర విభజన జరగక ముందువేనని సుజనా తెలిపారు. దీంతో వైఎస్సార్ సీపీకి ఆయనకు మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారంలో తొలుత ఆరోపణలు గుప్పించిన బొత్స కంటే సుజనా సవాల్ ను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. అంతే.. సుజనాపై దృష్టి సారించి సీఐడీ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులను రంగంలోకి దించారు. రాజధాని ప్రాంతంలో సుజనాకు లేదా ఆయన కుటుంబ సభ్యులకు ఎక్కడెక్కడ భూములున్నాయి? వాటి క్రయ విక్రయాలు ఎప్పుడు జరిగాయో ఆరా తీసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

దీంతో వారు అమరావతి ప్రాంతంలో గ్రామాలన్నీ జల్లెడ పడుతున్నారు. సుజనా కేంద్రంలోని అధికార పార్టీలో ఉన్నందున బీజేపీతో వైఎస్సార్ సీపీ సంబంధాలపై ఈ అంశం ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్న నేపథ్యంలో ఈ విషయం ఎక్కడకు వెళుతుందో చూడాలి

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...