Switch to English

సినిమా రివ్యూ: బందోబస్త్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

నటీనటులు: సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేశా సైగల్ తదితరులు.
సంగీతం: హారీష్ జైరాజ్
ఎడిటర్‌: ఆంథోని
సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్ ప్రభు
దర్శకత్వం: కెవి ఆనంద్
నిర్మాణం: లైక ప్రొడక్షన్స్
నిర్మాతలు: ఎ. సుభాస్కరన్
విడుదల తేదీ: 20 సెప్టెంబర్‌ 2019

తెలుగు ప్రేక్షకులకి సినిమా అంటే పిచ్చి అభిమానం, అందుకే మూవీ బాగుంటే చాలు ఏ భాషకి చెందిన హీరో అనేది చూడరు. అందువల్లే తమిళ స్టార్ హీరో సూర్య తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సూర్య నటించిన కొత్త మూవీ ‘బందోబస్త్’ ఇవాళ రిలీజ్ అయ్యింది. సూర్యతో గతంలో ‘వీడోక్కడే’, ‘బ్రదర్స్’ వంటి హిట్ సినిమాలు తీసిన కెవి ఆనంద్ దర్శకత్వంలో మోహన్ లాల్, ఆర్య, సయేశా సైగల్, బోమన్ ఇరానీ లాంటి స్టార్స్ తో వచ్చిన ఈ సినిమా వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ గా నిలిచిందా? లేదా? చూద్దామా..

కథలోకి వెళితే..

రవి కిషోర్(సూర్య) గోదావరి జిల్లాలో వ్యవసాయం చేసుకునే ఓ కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇది అందరికీ తెలిసింది కానీ ఎవ్వరికీ తెలియంది, దేశ భద్రతల కోసం పనిచేసే ఓ సీక్రెట్ ఏజంట్. గోదావరిలో ఉన్న తనకి ఒక రోజు లండన్ ట్రిప్ వెళ్తున్న ప్రధానమంత్రి చంద్రకాంత్ వర్మ(మోహన్ లాల్) మీద అటాక్ చేసే ఛాన్స్ ఉందని, ఆయన్ని కాపాడాలనే ఆపరేషన్ ఇస్తారు. అనుకున్నట్టుగానే లండన్ లో అటాక్ జరగడం, రవి కిషోర్ ప్రధానమంత్రిని సేవ్ చేస్తాడు. దాంతో ప్రధాన మంత్రి రవి కిషోర్ ని తన పర్సనల్ సెక్యూరిటీగా ఉంచుకుంటాడు. కానీ తను చేరిన కొన్ని రోజులకే తన కళ్ళ ముందే ప్రధానమంత్రి చంద్రకాంత్ వర్మని చంపేస్తారు. దాంతో అతని జాబ్ పోతుంది. కానీ రవి కిషోర్ పర్సనల్ గా ప్రధానమంత్రి మర్డర్ కి సంబందించిన క్రైం మొత్తాన్ని బయటకి ఎలా రాబట్టాడు? అందులో ఎవరెవరు ఉన్నారు? ప్రధాన మంత్రిని ఎందుకు చంపాలనుకున్నారు? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన కథ.

తెర మీద ఎవరెలా చేశారు:

సూర్య ఇప్పటికే తనలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న హీరో. ఈ సినిమాలో సీక్రెట్ ఏజంట్ గా, మట్టిని నమ్ముకునే రైతు పాత్రలో వైవిధ్యం బాగా చూపాడు. ఎమోషనల్ సీన్స్ తో పాటు యాక్షన్ స్టంట్స్ కూడా బాగా చేసాడు. మరో స్టార్ హీరో మోహన్ లాల్ ముఖ్య పాత్ర పోషించారు. ప్రధాన మంత్రి పాత్రలో ఓకే అనిపించారు. ఆర్య, సయేశా సైగల్, బొమన్ ఇరానీ, సముద్రఖని లాంటి స్టార్స్ కి పెద్దగా నటనకి ఛాన్స్ లేదు కానీ ఉన్నంతలో ఓకే. మెయిన్ విలన్ గా చేసిన చిరాగ్ జానీ బాగా చేసాడు.

తెరవెనుక ఎవరెలా చేశారు

‘బందోబస్త్’కి తెరపై ఎంతమంది స్టార్స్ కనపడ్డారో, అలాగే తెర వెనుక కూడా అదే రేంజ్ టెక్నీషియన్స్ పని చేశారు. వారిలో సూపర్బ్ వర్క్ చేసాడు అని చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ ఎం.ఎస్ ప్రభు గురించి మాత్రమే. ప్రతి ఫ్రేమ్ హై స్టాండర్డ్స్ లో ఉంది. ఇకపోతే అందరి వర్క్ ఈ సినిమాకి మైనస్ అని చెప్పాలి. హారీష్ జైరాజ్ ఇచ్చిన పాటల్లో ఒక్కటి బాలేదు, అలా అని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా బాగుందా అంటే అదీ లేదు. ఇక స్టార్ ఎడిటర్ ఆంథోని ఎడిటింగ్ అస్సలు బాలేదు, ప్రతి సీన్ సాగదీత, చాలు బాబోయ్ సీన్ కట్ చెయ్యండి అనే రేంజ్ లో సహనాన్ని పరీక్షిస్తాడు. దానివల్ల చూసే ఆడియన్స్ కి నిద్రొస్తుంది.

పీటర్ హెయిన్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక రథసారధి కెవి ఆనంద్ విషయానికి వస్తే, ప్రతి సినిమాలో ఏదైనా ఒక కొత్త పాయింట్ చెప్పాలనుకుంటాడు. ఇందులోనూ క్రైమ్ కి పరిచయం చేసిన పాయింట్ సూపర్బ్ కానీ దాని చుట్టూ అల్లుకున్న కథ, కథనం చాలా వీక్ గా ఉన్నాయి. అలాగే దర్శకత్వంలో కూడా ఆయన ప్రతిభ కనపడలేదు. ఆయన చేసిన సినిమాల్లో ఇదే బ్యాడ్ అవుట్ ఫుట్ అని చెప్పచ్చు. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలువలు మాత్రం హైలైట్.

ది బెస్ట్ సీన్స్:

  • సెకండాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ బ్లాక్స్
  • సూర్య – ఆర్య – బొమన్ ఇరానీ మధ్య వచ్చే వార్నింగ్ సీన్

సీటీమార్ పాయింట్స్:

  • క్రైమ్ కోసం ఉపయోగించిన ఐడియా
  • టెక్నికల్ గా ఐతే సినిమాటోగ్రఫీ – నిర్మాణ విలువలు.

బోరింగ్ పాయింట్స్:

  • తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న కథ
  • ఊహించేయగల స్క్రీన్ ప్లే
  • డెడ్ స్లో నెరేషన్
  • నో ఎంటర్టైన్మెంట్
  • ఎడిటింగ్.. చాల్లే చెప్పుకుంటే చాలా ఉన్నాయి.

విశ్లేషణ:

‘బందోబస్త్’ పోస్టర్ చూడగానే, సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేశా సైగల్ ఇలా ఇంతమంది స్టార్స్ కలిసి చేశారంటే సినిమా ఏ రేంజ్ ఉంటుందో అనుకొని థియేటర్ కి వెళ్ళారో డబ్బులిచ్చి మీ ప్రశాంతతని మీరే పోగొట్టుకున్నవారు అవుతారు. డైరెక్టర్ కెవి ఆనంద్ ఇంతమంది స్టార్స్ ని పెట్టుకొని కూడా వారిని సక్రమంగా వాడుకోలేకపోయారు. ఒక్కరికీ కూడా సరైన పాత్ర రాయలేదు. మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నాడనే చెప్పాలి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సూర్యని రెండు హిట్స్ ఇచ్చిన కెవి ఆనంద్ కూడా సేవ్ చేయలేకపోయాడు. ఖలేజా, మహర్షి, ఖైదీ నెంబర్ 150 మొదలైన సినిమాల్లో ఇదే కథని చూసేసాం. అందుకే మీరు బందోబస్త్ అనే సినిమా రాలేదనుకోవడమే బెటర్.

ఫైనల్ పంచ్: బందోబస్త్ – బోరింగ్ ని భరించలేరు.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...
నటీనటులు: సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేశా సైగల్ తదితరులు. సంగీతం: హారీష్ జైరాజ్ ఎడిటర్‌: ఆంథోని సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్ ప్రభు దర్శకత్వం: కెవి ఆనంద్ నిర్మాణం: లైక ప్రొడక్షన్స్ నిర్మాతలు: ఎ. సుభాస్కరన్ విడుదల తేదీ: 20 సెప్టెంబర్‌ 2019 తెలుగు ప్రేక్షకులకి సినిమా అంటే పిచ్చి అభిమానం, అందుకే మూవీ బాగుంటే చాలు ఏ భాషకి చెందిన హీరో అనేది చూడరు. అందువల్లే తమిళ స్టార్ హీరో సూర్య తమిళంతో...సినిమా రివ్యూ: బందోబస్త్