Switch to English

మీడియాకు గడ్డు రోజులు మొదలయ్యాయా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మన్మథుడు సినిమాలో తనికెళ్ల భరణి, నాగార్జున మధ్య ఓ డైలాగ్ ఉంటుంది. ‘‘ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు.. ముద్ర యాడ్ ఏజెన్సీలో పాతిక వేల జీతానికి పనిచేస్తుంటే బతిమాలి 30వేలకు ఒప్పించి తీసుకొచ్చాను’’ అని భరణి అంటాడు. ‘’30 వేలా? మూడు వేలు ఇస్తే పనిచేయడానికి చాకుల్లాంటి కుర్రాళ్లు బోలెడు మంది దొరుకుతారు’’ అని నాగార్జున అంటాడు. ఇప్పుడు తెలుగు మీడియా సంస్థల ఆలోచన ధోరణి అచ్చం నాగార్జున డైలాగ్ లాగే ఉంది. ఎప్పటి నుంచో సంస్థలోనే పనిచేస్తూ అధిక వేతనం పొందుతున్న సీనియర్లకు మంగళం పాడే దిశగా ప్రధాన మీడియా సంస్థలు కదులుతున్నాయి. వారి బదులు తక్కువ జీతానికి కొత్తవారిని నియమించకుని పని కానిద్దామని భావిస్తున్నాయి. ప్రమాణాలు, నాణ్యత కంటే పైకానికే విలువ ఇస్తున్నాయి.

ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేరు పొందిన మీడియా పరిస్థితి దయనీయంగా మారడమే ఇందుకు కారణం. ఒకప్పుడు ప్రభుత్వాల్నే శాసించిన మీడియా.. ఇప్పుడు ఉనికి కోసం పాట్లు పడే స్థితికి చేరింది. సోషల్ మీడియా హవా బాగా పెరగడంతో సాంప్రదాయ మీడియాకు గడ్డు కాలం మొదలైంది. ముఖ్యంగా ప్రింట్ మీడియా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. పెరుగుతున్న ఖర్చులకు తగినంత ఆదాయం లేకపోవడంతో ప్రముఖ మీడియా సంస్థలు సైతం వ్యయ నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. అటు ప్రింట్, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలు రెండూ సాధ్యమైనంత మేర కాస్ట్ కటింగ్ చేపట్టాయి.

ఉద్యోగుల తొలగింపుతోపాటు ఇతరత్రా చర్యలతో ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. తెలుగు మీడియాలో ఇప్పటికే రెండు మూడు ఛానళ్లు మూతపడగా.. ఇటీవల మోజో టీవీకి సైతం మంగళం పాడేశారు. ప్రతి ఉద్యోగికి నాలుగున్నర నెలల వేతనం ఇచ్చి ఆ సంస్థ సెటిల్ చేసుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో టాప్ లిస్ట్ లో ఉండే ఎన్టీవీ సైతం కాస్ట్ కటింగ్ మొదలుపెట్టింది. లక్షల్లో వేతనాలు తీసుకునే సిబ్బందికి ఉద్వాసన పలుకుతోంది. అలాగే టీవీ5, 10 టీవీ కూడా ఇదే బాటలో ఉన్నాయి.

ప్రింట్ మీడియా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఏపీలో ప్రభుత్వం మారగానే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముందుగా కాస్ట్ కటింగ్ చేపట్టినా.. ప్రస్తుతం ఈనాడు కూడా ఆ లైన్లోకి వచ్చేసింది. ఫొటోగ్రాఫర్ల వ్యవస్థను మొత్తానికే తీసివేసే దిశగా కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ప్రస్తుతానికి జర్నలిస్టుల జోలికి వెళ్లకపోయినా.. తదుపరి అడుగు అదే అంటున్నారు.

అధికంగా వేతనాలు పొందుతున్న సిబ్బందిని ఏదో ఒక విధంగా వదిలించుకుని వారి స్థానంలో తమ జర్నలిజం స్కూలు ద్వారా వచ్చేవారిని నియమించుకుని వారితో పత్రిక, టీవీ నడపాలనే యోచన ఉందని చెబుతున్నారు. తెలుగు మీడియాలో పెద్దన్నగా ఉన్న ఈనాడు ఏది పాటిస్తే మిగిలిన సంస్థలు కూడా అదే విధానాన్ని అనుసరిస్తాయి. అంటే త్వరలో తెలుగు మీడియా రంగం కుదుపులకు గురికావడం ఖాయంగా కనిపిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...