Switch to English

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం, దానికి ఆయా పార్టీలకి అనుకూలం గా వుండే మేధావులు మీడియా లో విపరీతమైన ప్రచారం చెయ్యటం అనేది సర్వసాధారణం.

నిజంగా ఏ పార్టీ అయినా వారికి పెద్ద పీట వేస్తుందా అని చూసినప్పుడు గతించిన ఎన్నికల తో పోలిస్తే వెనుకపడిన తరగతుల శాసన సభ్యుల సంఖ్యలో పెద్ద మార్పులు ఏమి వుండవు. టీడీపీ లో కొద్దీ మంది బీసీ నాయకులకి వ్యక్తులుగా ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది కానీ స్థూలం ఏ పార్టీ లో కూడా వారికి ఇచ్ఛేసంఖ్య లో పెద్ద తేడాలు ఏవి ఉండవు.

తెలంగాణ ప్రాంతంలో అందరు చెప్పే మాట వెనుకపడిన తరగతులు ఎక్కువ అని, కానీ ఈ రోజున అసెంబ్లీ లో వారి MLA ల సంఖ్య అక్షరాలా 19.

ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ పార్టీ 41 మంది వెనుకపడిన తరగతులకి, టీడీపీ కూటమి 40 మంది వెనుకపడిన తరగతులకి అవకాశం కల్పించాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 పల్స్ సర్వే అధికారపు లెక్కల పరంగా 1,92,91,829 బీసీ కులస్థుల ఓటర్లు వున్నారు. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య లో 45% గా వున్నారు

అందులో ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతు కులాలు గవర, కాళింగ, వెలమ, కాపు కులాలు సాంకేతికంగా వెనుకపడిన తరగతులుగా ఉన్నప్పటికీ నిజానికి వారు భూమిపుత్రులు, ఆర్ధికం గా, సామాజికంగా, విద్య, ఉద్యోగ,వ్యాపారాలలో మిగిలిన రైతుకులాల లానే రాజకీయాల్లో అవకాశాలని అందిపుచ్ఛుకుంటున్నారు.

అయినప్పటికీ వారిని కూడా పరిగణలో తీసుకున్న వెనుకుబడిన తరగతులకి ఎందుకని ఎక్కువ అవకాశాలని కల్పించలేకున్నారు అనేది సూక్ష్మంగా పరిశీలించవలిసిన విషయం, పైకి ఇంత సంఖ్య కనిపిస్తున్నప్పటికీ ఎవరు పనిగట్టుకుని ఫలానా వారికి అవకాశాలు ఇవ్వకూడదు, తొక్కేయ్యాలి అని చూడరు.

ఎవరి జీవితంలో అయినా మీరు ఏకులం అని అడిగితే నేను ఓసీ,, లేదా బీసీ , లేదా ఎస్సీ, లేదా ఎస్టీ అని చెప్పిన సందర్భం దాదాపు ఉండదు, పరిపాలనా సౌలభ్యం, సంక్షేమ పధకాలు అమలు చేయటానికి సమాజం లో కులాలని తరగుతులు గా విభజించటం, వారికి ఆయా పథకాల్ని అమలు చెయ్యటం అనేది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం చేసినది

అంతే కానీ ఆ తరగతిలో వున్నా అంత మాత్రాన ఆ కులాలు అన్ని కూడా ఐక్యం గా వుంటారు అని అనుకోవటం నిజం కాదు. ఉదాహరణ కి నియోజక వర్గంలో ఒక గౌడ కులస్థుడు మరొక రెడ్డి కులస్థుడు పోటీ చేస్తున్న సందర్భంలో మిగిలిన వెనుకపడిన తరగతులు గంపగుత్తగా కులం పరంగా ఇద్దరినీ ఓన్ చేసుకునే అవకాశం లేదు. ఆ నియోజక వర్గంలో వున్న కుమ్మరి,కమ్మరి, జాలరి,శాలి, వడ్డెర, ఉప్పర, రజక, క్షురక ఇలా ఏ కులం కి ఆకులం గానే ఉంటాయి గాని బీసీ తరగులు కాబట్టి బీసీ లు అందరు వేస్తే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా ఓసీ అభ్యర్థులు ఎట్టి పరిస్థుల్లో గెలవరు, కానీ వాస్తవ రూపంలో అలా ఉండదు.

దానిని దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఆ నియోజకవర్గంలో పార్టీకి చేసిన సేవ, జనం దృష్టిలో ఆ అభ్యర్థికి వున్న పలుకుబడి, ఆర్థికపరమైన పరిపుష్టి, సామాజిక వర్గం కి వున్న ఓట్ల సంఖ్య, ప్రత్యర్థి కి వుండే బల బలాలు అని బేరీజు వేసుకుని మాత్రం గెలుపే లక్ష్యంగా పార్టీలు టికెట్స్ ఇస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో బీసీ తరగతుల్లో ఓట్ల సంఖ్యాపరంగా మొదట 10 స్థానాల్లో వున్న కులాలు

1) యాదవ – 25,53,444
2) గౌడ/చెట్టు బలిజ – 19,78,826
3) మత్సకార – 15,74,865
4) ఉత్తరాంధ్ర కాపులు – 15,18,044
5) రజక – 11,63,887
6) బోయ/వాల్మీకులు – 9,69,868
7) ఉత్తరాంధ్ర వెలమలు – 9,36,564
8) వడ్డెర – 8,61,391
9) చేనేత – 6,87,294
10) కురుబ – 5,34,262

బీసీ తరగతుల్లో వుండి, రాష్ట్రం అంత విస్తరించి వున్న రజక, వడ్డెర లాంటి వారు ఎప్పటికి MLA లు కాలేకున్నారు. అదే విధంగా మత్సకారుల తీర ప్రాంతం అంతా , యాదవులు గాని, గౌడ సామాజిక వర్గం గాని రాష్ట్రం అంతటా విస్తరించి ఉండటంలో సాంద్రత తగ్గి ఏ నియోజక వర్గంలో కూడా ఇవ్వక తప్పని పరిస్థులు లేవు. బోయ, కురుబ లాంటి కులాలు పరిమిత నియోజక వర్గాల్లో మాత్రమే కేంద్రీకృతం అవ్వటం వలన వారికి అవకాశాలు పరిమిత సంఖ్యలో వస్తున్నాయి వేరే ఇతర అంశాలు అయినా ఆర్ధిక వెన్నుదన్ను, నేలమీద ఆధిపత్యం, వృత్త్తిపరమైన ఖ్యాతి లాంటివి దృష్టిలో ఉంచుకుని.

రాజ్యాంగపరంగా వెనుకపడిన తరగతులకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం అని కోట ఏర్పాటు చేస్తే తప్ప తెలంగాణ, ఆంధ్ర ల్లో మొత్తం గా చూస్తే బీసీ కులాలకి అసెంబ్లీలో సంఖ్య పెరగటం అనేది దాదాపు అసాధ్యం.

బీసీ ఓ బ్రహ్మ పదార్ధం!

తెలుగు రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారం. వెనుకబడిన తరగతులకి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం, దానికి ఆయా పార్టీలకి అనుకూలం గా వుండే మేథావులు మీడియాలో విపరీతమైన ప్రచారం చెయ్యటం అనేది సర్వసాధారణం.
నిజంగా ఏ పార్టీ అయినా వారికి పెద్ద పీట వేస్తుందా అని చూసినప్పుడు గతించిన ఎన్నికలతో పోలిస్తే వెనుకబ డిన తరగతుల శాసన సభ్యుల సంఖ్యలో పెద్ద మార్పులు ఏమీ వుండవు. టీడీపీలో కొద్దిమంది బీసీ నాయకులకి వ్యక్తులుగా ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది. కానీ స్థూలంగా ఏ పార్టీ లో కూడా వారికి ఇచ్ఛేసంఖ్య లో పెద్ద తేడాలు ఏవి ఉండవు.

తెలంగాణ ప్రాంతంలో అందరూ చెప్పే మాట వెనుకబడిన తరగతులు ఎక్కువ అని, కానీ ఈ రోజున అసెంబ్లీ లో వారి MLA ల సంఖ్య అక్షరాలా 19.

ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ పార్టీ 41 మంది వెనుకబడిన తరగతులకి, టీడీపీ కూటమి 40 మంది వెనుకబడిన తరగతులకి అవకాశం కల్పించాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 పల్స్ సర్వే అధికారపు లెక్కల పరంగా 1,92,91,829 బీసీ కులస్థుల ఓటర్లు వున్నారు. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య లో 45% గా వున్నారు.

అందులో ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైతు కులాలు గవర, కాళింగ, వెలమ, కాపు కులాలు సాంకేతికంగా వెనుక బడిన తరగతులుగా ఉన్నప్పటికీ నిజానికి వారు భూమిపుత్రులు. ఆర్ధికంగా, సామాజికంగా, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మిగిలిన రైతుకులాల లానే రాజకీయాల్లో అవకాశాలని అందిపుచ్ఛుకుంటున్నారు.

అయినప్పటికీ వారిని కూడా పరిగణలో తీసుకున్నా వెనుకుబడిన తరగతులకి ఎందుకని ఎక్కువ అవకాశాలని కల్పించలేకున్నారు అనేది సూక్ష్మంగా పరిశీలించవలిసిన విషయం, పైకి ఇంత సంఖ్య కనిపిస్తున్నప్పటికీ ఎవరూ పనిగట్టుకుని ఫలానా వారికి అవకాశాలు ఇవ్వకూడదు, తొక్కేయ్యాలి అని చూడరు.

ఎవరి జీవితంలో అయినా మీరు ఏకులం అని అడిగితే నేను ఓసీ, లేదా బీసీ , లేదా ఎస్సీ, లేదా ఎస్టీ అని చెప్పిన సందర్భం దాదాపు ఉండదు, పరిపాలనా సౌలభ్యం, సంక్షేమ పథకాలు అమలు చేయటానికి సమాజం లో కులాలని తరగుతులు గా విభజించటం, వారికి ఆయా పథకాల్ని అమలు చెయ్యటం అనేది బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం చేసినది.

అంతే కానీ ఆ తరగతిలో వున్నా, అంత మాత్రాన ఆ కులాలు అన్నీ కూడా ఐక్యం గా వుంటారు అని అనుకోవటం నిజం కాదు. ఉదాహరణ కి నియోజక వర్గంలో ఒక గౌడ కులస్థుడు మరొక రెడ్డి కులస్థుడు పోటీ చేస్తున్న సందర్భంలో మిగిలిన వెనుకపడిన తరగతులు గంపగుత్తగా కులం పరంగా ఇద్దరినీ ఓన్ చేసుకునే అవకాశం లేదు. ఆ నియోజక వర్గంలో వున్న కుమ్మరి,కమ్మరి, జాలరి,శాలి, వడ్డెర, ఉప్పర, రజక, క్షురక ఇలా ఏ కులం కి ఆకులం గానే ఉంటాయి గాని బీసీ తరగతులు కాబట్టి బీసీ లు అందరు వేస్తే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా ఓసీ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో గెలవరు. కానీ వాస్తవ రూపంలో అలా ఉండదు.

దానిని దృష్టిలో పెట్టుకుని ఏ రాజకీయ పార్టీ అయినా ఆ నియోజకవర్గంలో పార్టీకి చేసిన సేవ, జనం దృష్టిలో ఆ అభ్యర్థికి వున్న పలుకుబడి, ఆర్థికపరమైన పరిపుష్టి, సామాజిక వర్గం కి వున్న ఓట్ల సంఖ్య, ప్రత్యర్థి కి వుండే బల బలాలు అని బేరీజు వేసుకుని మాత్రం గెలుపే లక్ష్యంగా పార్టీలు టికెట్స్ ఇస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో బీసీ తరగతుల్లో ఓట్ల సంఖ్యాపరంగా మొదట 10 స్థానాల్లో వున్న కులాలు

1) యాదవ – 25,53,444
2) గౌడ/ శెట్టి బలిజ – 19,78,826
3) మత్స్యకార – 15,74,865
4) ఉత్తరాంధ్ర కాపులు – 15,18,044
5) రజక – 11,63,887
6) బోయ/వాల్మీకులు – 9,69,868
7) ఉత్తరాంధ్ర వెలమలు – 9,36,564
8) వడ్డెర – 8,61,391
9) చేనేత – 6,87,294
10) కురుబ – 5,34,262

బీసీ తరగతుల్లో వుండి, రాష్ట్రం అంతా విస్తరించి వున్న రజక, వడ్డెర లాంటి వారు ఎప్పటికీ MLA లు కాలేకున్నారు. అదే విధంగా మత్స్యకారుల తీర ప్రాంతం అంతా, యాదవులు గాని, గౌడ సామాజిక వర్గం గాని రాష్ట్రం అంతటా విస్తరించి ఉండటంలో సాంద్రత తగ్గి ఏ నియోజక వర్గంలో కూడా సీటు ఇవ్వక తప్పని పరిస్థితులు లేవు. బోయ, కురుబ లాంటి కులాలు పరిమిత నియోజక వర్గాల్లో మాత్రమే కేంద్రీకృతం అవ్వటం వలన వారికి అవకాశాలు పరిమిత సంఖ్యలో వస్తున్నాయి. వేరే ఇతర అంశాలు అయిన ఆర్ధిక వెన్నుదన్ను, నేలమీద ఆధిపత్యం, వృత్త్తిపరమైన ఖ్యాతి లాంటివి దృష్టిలో ఉంచుకుని.

రాజ్యాంగ పరంగా వెనుకబడిన తరగతులకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం అని కోట ఏర్పాటు చేస్తే తప్ప తెలంగాణ, ఆంధ్ర ల్లో మొత్తం గా చూస్తే బీసీ కులాలకి అసెంబ్లీలో సంఖ్య పెరగటం అనేది దాదాపు అసాధ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...