Switch to English

“ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు దేవ కట్టా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ దేవ కట్టా మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా నుంచి ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. చైతన్య నాకు బాగా ఇష్టమైన యాక్టర్. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, మ్యారేజి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కంటెంట్ చూస్తుంటే ఇదొక మంచి రూటెడ్ మూవీగా అర్థమవుతోంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సైలెంట్ గా రిలీజ్ కు వచ్చి పెద్ద సక్సెస్ అయ్యే సినిమాలా అనిపిస్తోంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – దేవ కట్టా గారు చాలా బిజీగా ఉన్నా మేము అడగగానే మా సాంగ్ రిలీజ్ కు ఒప్పుకున్నారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. మా డైరెక్టర్ కుమారస్వామికి దేవ కట్టా గారు ఫేవరేట్ డైరెక్టర్. ఆయనతోనే మా సెకండ్ సాంగ్ లాంఛ్ చేయించాలని అనుకున్నాం. నాకు బాగా ఇష్టమైన సినిమా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి. దేవ కట్టా గారు అన్నట్లు సైలెంట్ గా థియేటర్స్ లోకి వచ్చి సక్సెస్ అందుకోబోతున్నాం. ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ సాంగ్ లో లిరిక్స్ గమ్ముత్తుగా ఉంటాయి. మనం మాట్లాడుకునే మాటల్లాగే ఉన్నా..పాటలో చిన్న ఫిలాసఫీ ఉంటుంది. ఈ పాట వినేప్పుడు గమనించండి. అరుణ్ చిలువేరు బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశాడు. క్యాచీ ట్యూన్ ఇచ్చారు. మల్లెగోడ గంగాప్రసాద్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. వింటూ ఉంటే ఈ పాట ఇంకా నచ్చుతుంది. అన్నారు.

డైరెక్టర్ కుమారస్వామి మాట్లాడుతూ – దేవ కట్టా గారు నా ఫేవరేట్ డైరెక్టర్ మాత్రమే కాదు నాకు గురువు లాంటి వారు. నేను రొవోల్ట్ అవడానికి సార్ ప్రస్థానం మళ్ళీ మళ్ళీ సినిమా చూస్తుంటాను.దేవ కట్టా గారు బిజీగా ఉన్నా మా సినిమా సాంగ్ లాంఛ్ టైం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను. వెస్ట్రన్ స్టైల్ ట్యూన్ లో తెలంగాణ సాహిత్యంతో ఈ పాటను రూపొందించాం. ఈ పాట మీ అందరికీ నచ్చుతుంది తప్పకుండా చూడండి. అన్నారు.

లిరిసిస్ట్ మల్లెగోడ గంగాప్రసాద్ మాట్లాడుతూ – దేవ కట్టా గారు రాసే డైలాగ్స్ సాధారణంగా ఉంటూనే ఆసాధారణ ఫిలాసఫీ చెబుతుంటాయి. నేనూ ఈ పాటను మా డైరెక్టర్ కుమారస్వామి గారి సూచనతో అలా చిన్న చిన్న పదాలతో పెద్ద లవ్ ఫిలాసఫీ చెప్పేలా రాసేందుకు ప్రయత్నించాను. ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, హీరో తో పాటు సాంగ్ రిలీజ్ చేసిన దేవ కట్టా గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

హీరో హీరోయిన్ల మధ్య బ్యూటిఫుల్ లవ్ సాంగ్ గా ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు మల్లెగోడ గంగాప్రసాద్ లిరిక్స్ అందించగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. హరిచరణ్, భార్గవి పిళ్లై పాడారు. ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె.. పూల సెట్టల్లే ఊగే..ఈడు రంగుల్లో సింగిడొచ్చే..రెండు గుండెల్లో నిండే, ఓ గడియలో సెరుకు సెక్కరై కరిగెలే ఈ చెలిమి తీపి చిలకలే కలిసెలే’ అంటూ లవ్ ఫీలింగ్స్ చెబుతూ ఆకట్టుకునేలా ఈ పాటను రూపొందించారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...