Switch to English

డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కు ఆయన కొరియోగ్రఫీ అందించారు. కన్నడలో సుదీప్ ‘రా రా రక్కమ్మ’, హిందీలో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో మూడు పాటలకు కొరియోగ్రఫీ చేశారు. పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సొంతం చేసుకున్న జానీ మాస్టర్ ప్రమాణ స్వీకారానికి తమిళ, కన్నడ, మలయాళ భాషల నుంచి డ్యాన్స్ డైరెక్టర్లు వచ్చారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు & ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కె.ఎల్. దామోదర ప్రసాద్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు.

కెఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ”ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు. అయితే, ఎవరెవరు పోటీ చేశారో తెలియదు. జానీ ఫోన్ చేసి గెలిచానని చెప్పారు. కంగ్రాట్స్ చెప్పా. పాత బాడీ కావచ్చు, కొత్త బాడీ కావచ్చు… ఎవరైనా సరే యూనియన్ సభ్యుల మంచి కోసం పని చేయాలి. గతం గతః. ఏం చేస్తే మంచిదో ఆలోచించాలి. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, వాణిజ్య మండలి కార్యదర్శిగా నా మద్దతు డ్యాన్సర్స్ యూనియన్ సభ్యులకు ఎప్పుడూ ఉంటుంది. పాత తరం వాళ్ళను మర్చిపోవడం చాలా ఈజీ. ముక్కు రాజు గారి కుటుంబ సభ్యులను, పాత వాళ్ళను తీసుకు రావడం నాకు సంతోషంగా అనిపించింది. సౌత్ అంతా ఒక్కటే అని, ఒక్క తాటిలో ఉండాలని చెబుతుంటా. అందరూ కలిసి ఉండాలి. పని చేసుకోవాలి. ఈ రోజు తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి డ్యాన్స్ మాస్టర్లు రావడం సంతోషంగా ఉంది” అని చెప్పారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ ”బెంగళూరు నుంచి హరీష్, మంజునాథ్, సురేష్ వచ్చారు. వాళ్ళకు థాంక్స్. ఫెడరేషన్ నుంచి అందరూ వచ్చి దీవించారు. వాళ్ళకు థాంక్స్. మా కొరియోగ్రాఫర్స్ వచ్చారు. ఈ రోజు మాకు ఇంత పేరు, ఫేమ్ వచ్చి కార్లలో తిరుగుతున్నామంటే ముక్కురాజు మాస్టర్ దయ వల్లే. ఆయనకు థాంక్స్. మేం పిలవగానే ఆయన వంశం నుంచి ఒకరు వచ్చారు. అందుకు థాంక్స్. మా యూనియన్ తరఫున ఆయన వారసురాలికి చిరు కానుకగా రెండు లక్షల రూపాయలు అందజేస్తున్నాం. చెక్ కాకుండా డైరెక్ట్ క్యాష్ ఇస్తున్నాం. ఇవాళ యూనియన్ ఈ స్థాయిలో ఉందంటే కారణం ఆయన. ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ప్రకాష్ అన్న, శ్రీధర్ మాస్టర్… డ్యాన్స్ యూనియన్లో అందరూ ఒక్కటే. మేమంతా ఒక తల్లికి పుట్టిన బిడ్డలం. డ్యాన్స్ యూనియన్ అభివృద్ధికి ఏం చేయాలనేది అందరం ఆలోచిద్దాం. ఇంతకు ముందు చెప్పినట్టు ల్యాండ్ తీసుకొస్తా” అని అన్నారు.

మద్రాస్ డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ దినేష్ మాస్టర్ మాట్లాడుతూ ”జానీ ఇకపై వెనక్కి తిరిగి చూడవచ్చు. ముందుచూపుతో డ్యాన్స్ యూనియన్ సభ్యుల మంచి కోసం ఏం చేయాలని ఆలోచించు. వెనక్కి చూస్తే బండి ముందుకు వెళ్ళదు. మీతో పాటు సీనియర్లను కూడా తీసుకు వెళ్ళాలని రిక్వెస్ట్” అని అన్నారు. ఈ కార్యక్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన డ్యాన్స్ డైరెక్టర్లు కూడా మాట్లాడారు.

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...