Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 29 ఆగస్ట్ 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణం

సూర్యోదయం: ఉ.5:48
సూర్యాస్తమయం: రా.6:14 ని.లకు
తిథి: నిజ శ్రావణ శుద్ధ త్రయోదశి మ.12:56 ని.వరకు తదుపరి నిజ శ్రావణ శుద్ధ చతుర్దశి
సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం)
నక్షత్రము: శ్రవణం రా.11:43 ని.వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: సౌభాగ్యం ఉ.5:49 ని. వరకు తదుపరి శోభ
కరణం: తైతుల మ.12:56 ని. వరకు తదుపరి వనిజ
దుర్ముహూర్తం: ఉ.8:17 ని.నుండి 9:07 ని. వరకు తదుపరి రా.10:51 నుండి 11:38 వరకు
వర్జ్యం : సూర్యోదయం నుండి 6:30 ని‌. వరకు తదుపరి రా.3:26 నుండి తె.4:55 వరకు
రాహుకాలం: మ.3:00 ని. నుండి 4:30 గం.వరకు
యమగండం: ఉ.9:00 గం. నుండి 10:30 ని.వరకు
గుళికా కాలం: మ.12:17 నుండి 1:50 ని‌. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:29 ని.నుండి 5:17 ని.వరకు
అమృతఘడియలు: మ.1:59 ని. నుండి 3:29 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:52 ని. నుండి మ.12:41 వరకు

ఈరోజు (29-08-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వృషభం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసి రావు. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది.

మిథునం: దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది.

కర్కాటకం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం: ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

కన్య: దూరప్రయాణ సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

తుల: పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులు అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.

మకరం: ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

కుంభం: కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

మీనం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలలో నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....