తెరపై చూపే ధైర్యసాహసాలను తెర వెనుక కూడా చూపాలని నిరూపించిన హీరో ఆయన. తండ్రి సాధించిన గొప్ప విజయాలు.. తెలుగు ప్రజల్లో ఆయన వేసుకున్న బలమైన గుర్తింపును కొనసాగించిన హీరో. తండ్రి పెంచిన వంశ ప్రతిష్టను అద్భుతంగా క్యారీ చేసిన హీరో. ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్నా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో. కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలన్నా.. ప్రయోగాలు చేయాలన్నా వెనకడుగు వేయని హీరో. స్టార్ హీరోగా తెలుగు సినిమాల్లో ఒక తరంలో నిలిచిన కింగ్. భక్తి సినిమాలకు కాలం చెల్లిన రోజుల్లో ఆ జోనర్ లో సినిమాలు చేసి సక్సెస్ అయిన ఏకైక హీరో. యువ సామ్రాట్ టు కింగ్ ఆయన ప్రస్థానం. ఆయనే అక్కినేని నాగార్జున. నేడు ఆయన పుట్టినరోజు.
కొత్తదనానికి ప్రోత్సాహం..
కొత్తగా ఆలోచించి దానిని ఆచరణలో పెట్టడం నాగ్ కు మొదటి నుంచీ అలవాటు. కొత్త తరహా ఆలోచనలతో వచ్చిన ఆర్జీవీకి వెన్నుదన్నుగా నిలిచి ‘శివ’ అనే అద్భుతం ఆవిష్కృతం కావడానికి నాగార్జునే కారణం. ‘శివ’తో తెలుగు సినిమానే కాదు.. భారతీయ సినిమా గమనాన్నే మార్చి ట్రెండ్ సెట్టర్ కు కారణమయ్యారు. మాస్, క్లాస్ ఏదైనా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయాలు సాధించారు. తెలుగు సినిమాల్లో స్టయిలింగ్ కు నాగార్జునే ఆధ్యుడు.. బ్రాండ్ అంబాసిడర్. నిన్నే పెళ్లాడతాలో నాగ్ స్టయిలింగ్ కు నాటి యూత్, కాలేజీ స్టూడెంట్స్ ఫిదా అయిపోయారు. శివ, వారసుడులో కాలేజీ స్టూడెంట్, రక్షకుడు యాక్షన్, అన్నమయ్య, శ్రీరామదాసు భక్తి, మన్మధుడు కామెడీ, సంతోషం ఫ్యామిలీ.. నాగ్ టచ్ చేయని.. హిట్ట కొట్టని జోనర్ లేదు.
నాగ్ స్టయిలే వేరు..
వయసు 60 దాటినా ఫిట్ నెస్, లుక్స్, ఆయనకు వరాలు. ఇద్దరు కుమారులు (నాగ చైతన్య, అఖిల్) హీరోలైనా వారికే పోటీనిచ్చే స్టయిల్ ఆయనది. హీరోగా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతల్లో ఒకరిగా.. ఇటు హీరో, అటు బిజినెస్ మ్యాన్ గా నాగార్జున రెండు పడవల ప్రయాణంలోనూ సక్సెస్ చూశారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పేరుతో ఆధునిక సినిమా పరిజ్ఞానం, ఔత్సాహికులకు శిక్షణ ఇస్తూ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు నాగార్జున. ప్రస్తుతం తన సినిమాలు, కుమారుల సినిమాలు, స్టూడియో నిర్వహణ, బిగ్ బాస్ షో.. తీరికలేని బిజీ షెడ్యూల్స్ తో నాగార్జున బిజీ బిజీ. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ కింగ్ నాగార్జునకు బర్త్ డే విషెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.
camisetas betis
I would like to thank you for the efforts you’ve put
in writing this website. I am hoping to check out the
same high-grade content by you later on as well. In fact, your creative writing abilities has
motivated me to get my own, personal website now 😉
Nice response in return of this difficulty with real
arguments and describing all on the topic of that.
Wow, fantastic blog layout! How long have you been blogging for?
you make blogging look easy. The overall look of your website is excellent,
let alone the content!
Great information. Lucky me I found your blog by chance
(stumbleupon). I have saved it for later!