Switch to English

Annapurna Photo Studio: “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” నాలుగవ సాంగ్ లాంచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

Annapurna Photo Studio: గతం లో “పెళ్లి చూపులు” వంటి హిట్ సినిమా ని అందించిన టాలీవుడ్ నిర్మాణ సంస్థ బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పతాకం పై త్వరలో విడుదల కాబోతున్న 6వ సినిమా నే “అన్నపూర్ణ ఫోటో స్టూడియో- ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును” అనే ఆసక్తికరమైన క్యాప్షన్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమా లో “30 వెడ్స్ 21” వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావు హీరోగా నటించగా, లావణ్య అతనికి జంటగా నటించింది. ఈ మధ్యనే సినిమా నుండి విడుదలైన మోషన్ పోస్టర్ తో పాటు మూడు పాటలకు ప్రేక్షకుల మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు సినిమా నుంచి నాలుగవ పాటను యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన చేతుల మీదుగా విడుదల చేశారు.

“ఓ ముద్దుగుమ్మ” అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. ఇది ఒక రొమాంటిక్ పాట. శ్రేష్ఠ అందించిన లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. ప్రిన్స్ హెన్రీ అందించిన మ్యూజిక్ కూడా వినసొంపుగా ఉంది. మ్యూజిక్ తో పాటు తన వాయిస్ తో కూడా హెన్రీ బాగా మెప్పించారు. ముఖ్యంగా లిప్సిక గొంతు పాట కి బాగా సూట్ అయ్యింది. సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సాగనుంది. వీడియో లో చూపించిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ముందుగా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. చైతన్య తో కలిసి సినిమా చెయ్యలేదు కానీ ముఖ చిత్రం సినిమా నుండే నాకు పరిచయం. తన సినిమా పాటని లాంచ్ చేయడం చాలా సంతోషం గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీలో చాలా కాలం ఉంటారని అనిపిస్తోంది. సాంగ్ అదిరిపోయింది. ముద్దుగుమ్మ పాట చాలా బాగుంది. వింటున్నప్పుడే నేను కూడా హమ్ చేస్తున్నాను. ఈ సినిమాతో చైతన్య మరొక సర్ప్రైజ్ ఇస్తాడు. మూవీ యూనిట్ కి గుడ్ లక్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, పర్ఫామెన్స్ లు, పీరియడ్ సెటప్ చాలా తక్కువ సార్లు ఇంత బాగా కుదురుతాయి. పాట చూసినప్పుడు ఈ సినిమాలో కూడా అన్ని బాగా కుదిరాయి అని నాకు అనిపించింది” అని అన్నారు.

హీరో చైతన్య రావు మాట్లాడుతూ… “మొదటిగా పిలవగానే వచ్చినందుకు విశ్వక్ కి పెద్ద థాంక్స్. విశ్వక్ ది ఒక బైట్ చాలా పాపులర్ అయింది. పరిచయం అయితే నా అంత మంచివాడు లేడు అని కానీ పరిచయం కాకపోయినా కూడా విశ్వక్ అంత మంచివాడు ఎవరు ఉండరు. తను స్నేహం కోసం మా కోసం ఇది చేసి ఉండచ్చు కానీ యంగ్ టీమ్ గా తన లాంటి స్టార్ మా పాట లాంచ్ చేయడం మాకు పెద్ద విషయం. తను నాకు వెళ్లిపోమాకే సినిమా నుండి తెలుసు. నేను కూడా తన స్థాయి కి ఎదగాలి అని కోరుకుంటున్నాను. చిత్ర బృందం కూడా సినిమా కోసం బాగా కష్టపడ్డారు. మంచి సినిమా తో మీ ముందు వస్తున్నాము” అన్నాడు చైతన్య.

గీత రచయిత శ్రేష్ట మాట్లాడుతూ.. ” బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో నేను చేస్తున్న మూడవ సినిమా ఇది. హెన్రీ గారు మరియు చందు గారు ఈ పాటని చాలా బాగా వచ్చేలా చేశారు. ఇంతకుముందు విడుదలైన మూడు పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. దానికి చాలా సంతోషంగా ఉంది. పెళ్లిచూపులు సినిమా ఎంత పెద్ద టైంలో ఈ సినిమా కూడా అంతే మంచిది కావాలని కోరుకుంటున్నాను. విశ్వక్ గారు ఈ పాటని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

డైరెక్టర్ చందు ముద్దు మాట్లాడుతూ “ముందుగా విశ్వక్ సేన్ గారికి నా కృతజ్ఞతలు. శ్రేష్ఠ గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. ప్రిన్స్ హెన్రీ గారు చాలా బాగా పాడారు. మిగతా మూడు పాటల లాగా ఈ పాట కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ మాట్లాడుతూ, “అందరికీ నా కృతజ్ఞతలు. ఈ పాట కోసం మేము చాలా కష్టపడ్డాము. ఇది ఒక మంచి పాట. నేను, లిప్సిక గారు, రితేష్ కలిసి పాడాము. ఈ పాటని మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...