Switch to English

టీమిండియాని ధోనీనే ముంచేస్తున్నాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మహేంద్ర సింగ్‌ ధోనీ.. క్రికెట్‌లో దూకుడుకి పర్యాయ పదం. టీమిండియాకి అద్భుతమైన విజయాల్ని అందించిన ఒకప్పటి కెప్టెన్‌. వికెట్‌ కీపర్‌గా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు. బంతిని బలంగా దాటడంలో ధోనీకి సాటి ఇంకెవరూ లేరేమో. బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌గా ధోనీకి వున్న ట్రాక్‌ రికార్డ్‌ అంతా ఇంతా కాదు. కానీ, అలాంటి ధోనీ.. ఇప్పుడు మైదానంలో నత్తతో పోటీ పడుతున్నాడెందుకు.? మరీ ముఖ్యంగా, ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ధోనీ ఆటతీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది.

గెలిచే మ్యాచ్‌ని టీమిండియా ఓడిపోయిందంటే, దానికి కారణం ముమ్మాటికి ధోనీనే. ఇందులో ఇంకో మాటకు ఆస్కారమే లేదు. క్రీజ్‌లో ధోనీ వున్నాడంటే మ్యాచ్‌ గెలిచేసినట్లే.. పైగా, ఛేజింగ్‌లో ధోనీ నాటౌట్‌గా నిలిచిన మ్యాచ్‌లన్నీ దాదాపుగా టీమిండియా గెలిచినవే. ఇంత గొప్ప ట్రాక్‌ రికార్డ్‌ వున్న ధోనీ, పరుగుల కోసం ప్రయత్నించకుండా టైమ్‌ పాస్‌ చేశాడు. ఇంగ్లాండ్‌కి, టీమండియాకీ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిందా.? అన్నట్లు మ్యాచ్‌ కనిపించింది.

ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఉతికి ఆరేస్తోంటే, కీలక సమయాల్లో రివ్యూ కూడా కోరలేకపోయింది టీమిండియా. మామూలుగా అయితే ఈ రివ్యూల బాధ్యతని పూర్తిగా ధోనీనే తీసుకుంటాడు. చిత్రంగా ధోనీ, సరిగ్గా అప్పీల్‌ కూడా చేయలేదు ఈ మ్యాచ్‌లో. అలా ఇంగ్లాండ్‌కి టీమిండియా భారీ స్కోర్‌ అందించింది. బ్యాటింగ్‌ విషయానికొస్తే, రోహిత్‌ మ్యాచ్‌ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కోహ్లీ తనవంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. ఎప్పుడైతే ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడో.. మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో నిస్సత్తువ చోటు చేసుకుంది. ‘ధోనీ ఇలా ఆడటమేంటి.?’ అని అంతా ముక్కున వేలేసుకున్నారు.

అంతకు ముందే ధోనీ నెమ్మదైన ఆటతీరుని విరాట్‌ కోహ్లీ సమర్థించాడు. ఇంకోసారీ సమర్థించక తప్పలేదు. కానీ, కోహ్లీకి తెలుసు.. ధోనీ తలచుకుంటే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ గెలిచేవాళ్ళమని. కోహ్లీ మాత్రం ఏం చేస్తాడు.? ధోనీ విషయంలో అతిగా స్పందిస్తే, ఆ తర్వాత జట్టుకి చాలా పెద్ద నష్టమే కలుగుతుంది. అయినా, ధోనీ ఎందుకిలా చేస్తున్నాడు.? ఇదే ధోనికి చివరి వన్డే వరల్డ్‌ కప్‌. అత్యంత ఘనంగా క్రికెట్‌కి వీడ్కోలు చెప్పే అవకాశం వచ్చినప్పుడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి.. టీమిండియా విజయావకాశాల్ని ఎందుకు దెబ్బతీస్తున్నట్లు.? ఇదే చాలామందికి అర్థం కావడంలేదు.

ఏది ఏమైనా, ధోనీ ఎప్పటికీ మ్యాచ్‌ విన్నరే. టీమిండియాకి 2011లో వరల్డ్‌ కప్‌ అందించిన ధోనీ, అంతకు ముందు టీ20 వరల్డ్‌ కప్‌ని కూడా అందించాడు. జట్టు మేనేజ్‌మెంట్‌తో సమస్యలున్నాయా.? లేదంటే, వ్యూహాత్మకంగానే ధోనీలో వేగం తగ్గిందా.? అన్నది వేరే చర్చ. ఈ వరల్డ్‌ కప్‌ టీమిండియాకి చాలా ప్రత్యేకం. గెలుపు ముందర, చిన్న చిన్న అపవాదులు, అవరోధాలూ మామూలే. పేరుకి కెప్టెన్‌ కోహ్లీనే అయినా, పెద్దన్న మాత్రం ధోనీనే. కప్‌ గెలిస్తే, కెప్టెన్‌ కంటే కూడా ఎక్కువ క్రెడిట్‌ ధోనీకే దక్కుతుంది. ఎనీ డౌట్స్‌.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...