Switch to English

హీరోయిన్లని భయపెడ్తున్న ఆ డైరెక్టర్‌ మూడో ‘గది’!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆ దర్శకుడి మూడో గదిలోకి వెళ్ళేందుకు హీరోయిన్లు భయపడ్తున్నారట. ‘అబ్బే, ఇది వర్కవుట్‌ అయ్యే ప్రాజెక్ట్‌ కాదు..’ అని ఓ ప్రముఖ హీరోయిన్‌ తిరస్కరించిన సబ్జెక్ట్‌ని, ఇంకో హీరోయిన్‌ తనకు అవకాశాల్లేక ‘ఓకే’ చెప్పినా, చివరికి ఆమె కూడా ఆ ‘గది’లోకి తాను వెళ్ళేది లేదని తేల్చేసిందట. దాంతో, ముచ్చటగా మూడో భామని తన ‘మూడో’ గదిలోకి రప్పించేందుకు సదరు దర్శకుడు నానా తంటాలూ పడాల్సి వస్తోంది.

ఆ మూడో గదిలో ఏముందో ఇప్పటికైతే ఎవరికీ తెలియదు. ఇదంతా ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘రాజు గారి గది 3’ సినిమా వ్యవహారం. తొలుత ఈ సినిమా సమంత దగ్గరకే వెళ్ళిందట. కానీ, ఆమె ససేమిరా అనేసింది. రెండో ‘గది’లో కంటెంట్‌ లేకపోవడంతో సమంత, నాగార్జున సైతం ఈ సినిమాని లేపలేకపోయిన విషయం విదితమే. దాంతో, అప్పట్లోనే అనుకున్న ఆ మూడో గది అనివార్య కారణాలతో మూతపడింది. మళ్లీ ఎలాగోలా, మిల్కీ బ్యూటీ తమన్నాతో ఆ మూడో గదిని తెరిపిద్దామనుకున్న ఓంకార్‌, సినిమా ప్రారంభోత్సవమైతే చేసేశాడుగానీ.. తమన్నా, షూటింగ్‌కి ముందర ఆ ప్రాజెక్ట్‌లో తాను కొనసాగలేనని చెప్పి, తప్పుకుంది.

ఇక, ఇప్పుడు మొదలయ్యింది ఓంకార్‌కి అసలు సినిమా. తాప్సీతో చేద్దామా.? ఇంకెవర్నయినా సంప్రదిద్దామా.? అనే ఆలోచనలో పడ్డాడట ఓంకార్‌. నిజానికి, తాప్సీ ఇలాంటి సినిమాలకి ‘ఓకే’ చెప్పే పరిస్థితి లేదు. తాప్సీ దగ్గర అన్నీ పక్కాగా వుండాలి. తమన్నానే తిరస్కరించిందంటే, తాప్సీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. మరోపక్క, చిన్నా చితకా హీరోయిన్లతో ‘మూడో’ గదిని గట్టెక్కించేద్దామనుకున్నా, ఓంకార్‌కి అందుకు సరిపడే హీరోయిన్లు కన్పించని పరిస్థితి.

హీరోయిన్లు అస్సలు లేరని అనలేంగానీ, కొద్దో గొప్పో ఆ ప్రాజెక్ట్‌కి హైప్‌ రావాలంటే కొంచెం పేరున్న హీరోయిన్‌ కావాలి కదా.! ఆ స్థాయి హీరోయిన్లెవరూ ఈ ‘మూడో’ గది వైపు చూడటం కష్టమేనని సినీ పరిశ్రమలో బలమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో, ‘రాజుగారి గది 3’కి కొన్నాళ్ళు తాళం వేసేసి, కొత్త ప్రాజెక్ట్‌ టేకప్‌ చేసే ఆలోచనలో వున్నాడట దర్శకుడు ఓంకార్‌.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...