Switch to English

అగ్రవర్ణ పేదలు సరే.. అసలు పేదలంటే ఎవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడినవారి విషయమై చాలాకాలంగా ‘రిజర్వేషన్ల’ అంశం తరచూ చర్చనీయాంశమవుతూనే వుంది. ఈ కేటగిరీ కోసమే 10 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ నిర్ణయాలు జరిగాయి.. ఈ వ్యవహారం కోర్టెకెక్కింది.. సర్వోన్నత న్యాయస్థానం, గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది తాజాగా.!

అంతా బాగానే వుందిగానీ, అగ్రవర్ణాల్లోని పేదలెవరు.? అసలు పేదవాళ్ళంటే ఎవరు.? దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ‘పేదలు’ అన్న ప్రస్తావనకు అర్థం మారిపోయింది. ఆయా రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డు దారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆయా ప్రభుత్వాలు తాము చేపడుతున్న సంక్షేమ పథకాలు 95 శాతం మందికి అందుతున్నాయని ఘనంగా చెబుతున్నాయి.

ఆ లెక్కన ఆయా రాష్ట్రాల్లో పేదరికం ఎంత వుంది.? దేశంలో పేదరికం ఎంత వుంది.? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందితే, అసలంటూ పేదరికం దేశం నుంచి మటుమాయమైపోవాలి కదా.. కనీసం ఆ పేదరికం తగ్గాలి కదా.? పేదరికం తగ్గడంలేదు సరికదా, సంక్షేమ పథకాలు అందుకుంటోన్న పేదల సంఖ్య నానాటికీ పెరిగిపోయింది.

దాంతో, అసలు పేదలు ఎవరు.? అన్న చర్చ తెరపైకి వస్తోంది. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి. మరి, ఏవి వెనుకబడిన సామాజిక వర్గాలు.? ఏవి అగ్ర వర్ణాలు.? నిజానికి, ఇవి చాలా చాలా సున్నితమైన అంశాలు.

రిజర్వేషన్ల ఫలాలు అందాల్సినవారికి అందుతున్నాయా.? అలా అందడం వల్ల సమాజంలో వస్తున్న మార్పులేంటి.? పేదరికం నానాటికీ పెరుగుతోందంటే, సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదనే కదా అర్థం.?

గతంలో పరిస్థితులు వేరు.. ఇప్పటి అనుకూలతలు వేరు. ఎవరు ఎంత సంపాదిస్తున్నారు.? అన్నదానిపై ప్రభుత్వాల దగ్గర ఖచ్చితమైన లెక్కలు వుంటున్నాయ్. సో, పేదెలెవరన్నది తేల్చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, అధికారంలో వున్నవారి రాజకీయ అవసరాల నిమిత్తం.. సంక్షేమ పథకాల్ని అమలు చేసి, జనాన్ని తమ గుప్పిట్లో వుంచుకోవాలి గనుక.. పేదల లెక్క తేలడంలేదు.

మత మార్పిడులు కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతున్నా.. వాటి లెక్కల్నీ ప్రభుత్వాలు బయటపెట్టలేకపోతున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశంగా మారడం ఒకింత ఆశ్చర్యకరమే

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...