Switch to English

మెగా క్లారిటీ: పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, నా బిడ్డ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి స్పష్టతనిచ్చేశారు. పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, నా బిడ్డ.. అంటూ ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా మీడియా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు చిరంజీవి.

గత కొంతకాలంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు నానా రకాల ప్రయత్నాలూ చేస్తున్నారు. వైసీపీ, అంతకు మించి టీడీపీ.. ఈ ప్రయత్నాల్లో బిజీగా వున్నాయ్. చిరంజీవికి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారడంటాడో బులుగు మూర్ఖుడు. అన్నదమ్ములిద్దరూ కలిసి చెత్త రాజకీయాలు చేస్తున్నారంటాడు మరో పచ్చ మూర్ఖుడు.

మీడియా నుంచి ప్రశ్న రావడమే తరువాయి, మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టయిల్లో స్పష్టతనిచ్చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వున్నారు కదా, ఆయనకు గాడ్ ఫాదర్ మీరేనా.? అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించారు. దాంతో, చిరంజీవి తనదైన స్టయిల్లో సమాధానం చెప్పారు.

‘ఔను, నేనే గాడ్ ఫాదర్ అని చెప్పడం అసహ్యంగా వుంటుంది. అది పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆ మాట చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పాడు. చిరంజీవి తనకు అన్నయ్య కాదు, తండ్రితో సమానమని పవన్ కళ్యాణ్ చెప్పాడు. అవును, పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, నా బిడ్డ..’ అంటూ చిరంజీవి గర్వంగా చెప్పుకొచ్చారు.

అంతేనా, మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, మలయాల ‘లూసిఫర్’ సినిమాలో వున్న డైలాగుల్ని ఎవరైనా తమకు ఆపాదించుకుంటే, భుజాలు తడుముకుంటే చేయాల్సిందేమీ లేదు.. అంటూ సెటైర్ వేశారు చిరంజీవి.

‘పవన్ కళ్యాణ్ నిబద్ధత ఏంటో నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఎటువైపు వుండాలన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. పరిపాలించే అవకాశం పవన్ కళ్యాణ్‌కి రావాలని నేను కోరుకుంటాను. ఏమో, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌కి మద్దతిస్తానేమో. ఇప్పుడు నేను రాజకీయాలకు దూరంగా వుండటమే పవన్ కళ్యాణ్‌కి ప్లస్..’ అని చిరంజీవి చెప్పడం గమనార్హం.

సో, ఇక్కడితో ఇంకాస్త మెగా క్లారిటీ వచ్చేసిందన్నమాట. మెగా ఫ్యాన్స్, జనసేన పార్టీకి అండగా నిలవాలని ఇటీవల తీర్మానించుకున్నాక.. చిరంజీవి సపోర్ట్ జనసేనకు వుందా.? లేదా.? అన్న చర్చే అనవసరం. జనసేనకు గాడ్ ఫాదర్‌లా చిరంజీవి వుంటారు.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...