Switch to English

వైఎస్సార్.! వ్యక్తి పేరా.? పార్టీ పేరా.? జనసేన లాజిక్ అదిరింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘వైఎస్సార్’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయ్. చాలా సంక్షేమ పథకాలకి ఆ ‘వైఎస్సార్’ పేరు వాడుతుండడం చూస్తున్నాం. ఇంతకీ, వైఎస్సార్ అంటే ఏంటి.? దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వైఎస్సార్ అని పిలుస్తుంటాం. అలాగే, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పిలుస్తున్నాం.

ఇంతకీ, వైఎస్సార్ అంటే అసలు అర్థమేంటి.? ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యక్తుల పేర్లను సంక్షేమ పథకాలకు పెట్టడంలో వింతేమీ లేదు. కానీ, రాజకీయ పార్టీల పేర్లని కూడా సంక్షేమ పథకాలకీ, యూనివర్సిటీలకూ పెడతారా.? అన్నదే ఇక్కడ అసలు సిసలు డౌటానుమానం.

జనసేన నేత, విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఓ ప్రముఖ పత్రికలో, చిన్న ‘న్యూస్’ కేటగిరీలో మాత్రమే కనిపించిందిగానీ, నిజానికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినంత చాలా చాలా పెద్ద విషయం.

నిజమే కదా, దేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా సంక్షేమ పథకాలకి తమ పార్టీ పేర్లను పెట్టుకోలేదు. వైఎస్ జగన్ నేతృత్వంలో నడుస్తున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని కాస్తా, ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’గా వ్యవహరిస్తూ వస్తున్నారు.

వైఎస్సార్ చేయూత అనీ, వైఎస్సార్ పెన్షన్ కానుక అనీ.. ఇలా ఏవేవో పేర్లతో సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు రాష్ట్రంలో. జగనన్న కానుక, చంద్రన్న కానుక.. ఇవన్నీ ఆయా వ్యక్తులు ముఖ్యమంత్రులుగా వున్న సమయంలో అమలవుతున్న, అమలయిన సంక్షేమ పథకాలు గనుక, వాటి పేర్ల విషయంలో అభ్యంతరాలున్నా.. అది అలా అలా నడిచిపోతోంది.

దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా, తమ పార్టీ పేరుతో సంక్షేమ పథకాల్ని నడపడంలేదు. యూనివర్సిటీలకు తమ పార్టీ పేర్లను పెట్టలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనే భావనే చాలామందిలో వుంది. ఈలెక్కన, కేంద్ర ఎన్నికల సంఘం సంక్షేమ పథకాలకి ‘వైఎస్సార్’ పేరు విషయమై ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...