Switch to English

బ్లడ్ బ్రదర్స్ కు ‘చిరు భద్రత’.. గవర్నర్ ప్రశంస

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

దేశంలోని సూపర్ స్టార్స్ గా చెలామణీ అయ్యే హీరోల్లో తమ ఫ్యాన్స్ గురించి విభిన్నంగా ఆలోచించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఫ్యాన్స్ అంటే సినిమా రిలీజ్ కి కటౌట్లు బ్యానర్లు, పాలాభిషేకాలు, హంగామా మాత్రమే చేసేవారిగా దశాబ్దాలుగా సమాజంలో వారిపై ఉన్న గుర్తింపును చిరంజీవి పూర్తిగా మార్చేశారు. తనకున్న అశేష అభిమాన గణాన్ని సేవా మార్గం వైపు నడిపించారు. 1998లో ఏర్పాటు చేసిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా రక్తదానం, నేత్రదానం చేసేలా వారిని ప్రోత్సహించారు. దేశంలో మరే స్టార్ హీరో ఇలా చేయలేదు. ఫ్యాన్స్ కూడా చిరంజీవి చూపిన మార్గంలో అంతే నిబద్ధతతో నడిచి చిరంజీవికి మరింత పేరు తెచ్చారు. దీంతో మెగాభిమానుల్ని బ్లడ్ బ్రదర్స్ గా అభివర్ణించారు చిరంజీవి. ఇప్పుడు మరో ముందడడుగు వేసి వారికి “చిరు భద్రత” ఇన్స్యూరెన్స్ చేయించడం విశేషం.

బ్లడ్ బ్రదర్స్ కు ‘చిరు భద్రత’.. గవర్నర్ చేతుల మీదుగా ఇన్స్యూరెన్స్ కార్డులు అందించిన చిరంజీవి

గవర్నర్ ప్రశంస..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ‘చిరు భద్రత’ పేరుతో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. 50 కంటే ఎక్కువసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేసిన వారికి రాజ్ భవన్ లో గవర్నర్ చేతుల మీదుగా కార్డులు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవిని గవర్నర్ అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఒక డాక్టర్ గా రక్తం విలువ తెలుసు. తన వృత్తిలో భాగంగా రక్తం అవసరమైన వారికి రక్తదానం చేసేందుకు బంధువులు ముందుకు రాని పరిస్థితులు చూశాను. చిరంజీవి రక్తదానం కార్యక్రమంలో అభిమానుల్ని ప్రోత్సహించడం సంతోషించే విషయం. రక్తదానం చేసేవారు నిజమైన హీరోలు. రెడ్ క్రాస్ తరఫున రక్తదానం కోసం యాప్ రూపొందించాం. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇందులో భాగం కావాలని కోరుతున్నాం’ అని అన్నారు.

 

ఆ వార్తలే కదిలించాయి..

చిరంజీవి మాట్లాడుతూ.. ‘సమయానికి రక్తం అందక చనిపోతున్న బాధితుల వార్తలు నన్ను కదిలించాయి. దీంతో తనపై ప్రేమ చూపే అభిమానుల్ని అదే ప్రేమను నలుగురికీ పంచేలా 1998లో చిరీంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా మాటే వేదంగా అభిమానులు రక్తం దానం చేస్తున్నారు. అటువంటి వారికి ఏదైనా భద్రత కల్పించాలని సంకల్పించి ‘చిరు భద్రత’ పేరుతో ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. ఇప్పటివరకూ ట్రస్ట్ ద్వారా 9.30లక్షల యూనిట్లు రక్తం సేకరించి పేదలకు 70శాతం అందించి.. మిగిలిన శాతం ప్రైవేటు ఆసుపత్రులకు అందించాం. రక్తదానం చేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు’ అని తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాతలను గవర్నర్, చిరంజీవి సత్కరించి, ప్రశంసించారు. చిరంజీవి చేసిన ఈ కార్యక్రమం ద్వారా అభిమానులపై ఆయన చూపే ప్రేమకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...